
టాలీవుడ్ స్టార్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ మూవీ ఈనెల 25న పాన్ ఇండియా రేంజ్లో విడుదలవుతోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో హీరో విజయ్ దేవరకొండతో పాటు దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరోయిన్ అనన్య పాండే దేశమంతటా తిరుగుతూ ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విజయ్ దేవరకొండ కెరీర్లోనే లైగర్ సినిమా అత్యధిక థియేటర్లలో విడుదలవుతోంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఇటీవల ఆన్లైన్లో బుకింగ్స్ ప్రారంభించగా టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. బాలీవుడ్లో ఖాన్ల సినిమాలను తలదన్నేలా విజయ్ లైగర్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వసూళ్లను కొల్లగొడుతోంది. లైగర్ మూవీ టిక్కెట్లకు ఫుల్ డిమాండ్ ఉండటంతో అడ్వాన్స్ బుకింగుల ద్వారా తొలిరోజే హిందీలో రికార్డు స్థాయిలో రూ.10 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా హిందీలో కరణ్ జోహార్ ప్రొడక్షన్లో లైగర్ మూవీ వస్తుండటం ప్లస్ పాయింట్ అని చెప్పాలి. కరణ్ జోహార్ మూవీని భారీ స్థాయిలో ప్రమోట్ చేయడంలో ముందుంటారు. కానీ ఇటీవల బాలీవుడ్ మూవీస్ అన్నీ బక్కెట్ తన్నేస్తున్నాయి. ఇప్పుడు లైగర్ కూడా అదే ఫలితాన్ని అందుకుంటుందని పలువురు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే బాయ్‌కాట్ లైగర్ అని ఇటీవల పలువురు నెటిజన్లు డిమాండ్ చేశారు. ఈ ట్రెండ్ దెబ్బకు ఇప్పటికే అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలు నటించిన లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ సినిమాలు బలి అయిపోయాయి. కాసుల వర్షం కురిపిస్తాయనుకున్న ఆ చిత్రాలు బాయ్‌కాట్ ట్రెండ్ ప్రభావానికి ఘోరంగా చతికిలపడ్డాయి. ఇప్పుడు లైగర్‌ని కూడా బాయ్‌కాట్ చేయాలంటూ హిందీ ఆడియన్స్ నిర్ణయించుకున్నారు. దీనికి కారణం హిందీలో ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహర్ విడుదల చేస్తున్నాడు. అతనిపై అక్కడ భారీ స్థాయిలో నెగెటివిటీ ఉంది కాబట్టి అతని ప్రాజెక్టుల్ని బ్యాన్ చేయాలని హిందీ ఆడియన్స్ ఫిక్సయ్యారు.
ప్రస్తుతం లైగర్ సినిమాను కూడా కరణ్ జోహార్ విడుదల చేస్తున్నాడు కాబట్టి ఈ చిత్రాన్ని బహిష్కరించాలన్న ఉద్దేశంతో బాయ్‌కాట్ లైగర్ అనే ట్రెండ్‌కి తెరలేపారు. అయితే ఇది పూర్తిస్థాయి కరణ్ జోహర్ ప్రాజెక్ట్ కాదు. కేవలం హిందీలో రిలీజ్ చేసేందుకు ఆయన్ను ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం చేసుకున్నారు. హిందీ రిలీజ్ వరకే ఆయన పాత్ర ఉందే తప్ప.. అంతకుమించి ఇంకేం లేదు. అందుకే రౌడీ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తన్నారు. అన్ స్టాపబుల్ లైగర్ అనే హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ చేస్తున్నారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించిన విజయ్ దేవరకొండ లాంటి హీరో సినిమాని బాయ్‌కాట్ చేయాలని ట్రెండ్ చేయడం సరికాదని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. విజయ్ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్లే.. లైగర్‌ను బాయ్‌కాట్ చేయాలని చూస్తున్నారని మండిపడుతున్నారు. అటు తెలంగాణలో విజయ్ దేవరకొండకు ఉన్న మాస్ ఫాలోయింగ్ కారణంగా దాదాపు నైజాం మెయిన్ సెంటర్లలో ఈ మూవీకి తొలిరోజు హౌస్ ఫుల్ బోర్డులు దర్శనం ఇవ్వనున్నాయి. అటు ఈ సినిమాకు రూ.90 కోట్ల రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఛార్మి, పూరీజగన్నాథ్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీలో బాక్సింగ్ గాడ్ మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించి అభిమానులను అలరించనున్నాడు.