Home Entertainment బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ కలెక్షన్స్ ని దాటేసిన ‘వారసుడు’

బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ కలెక్షన్స్ ని దాటేసిన ‘వారసుడు’

0 second read
0
0
2,090

ఎన్నో అంచనాలతో ఈ ఏడాది సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో రెండు డబ్బింగ్ సినిమాలు ఉండగా మరో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు వారసుడు, తెగింపు కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే థియేటర్ల కేటాయింపు విషయంలో చాలా రచ్చ జరిగింది. తెలుగులో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి రెండు పెద్ద సినిమాలు ఉండగా.. వాటికి ధీటుగా డబ్బింగ్ మూవీ అయిన వారసుడు మూవీకి నిర్మాత దిల్ రాజు థియేటర్లు బ్లాక్ చేయడం మీద చాలా రోజుల పాటు చర్చ నడిచింది. చివరకు తెర వెనుక ఏం జరిగిందో ఏమో కానీ.. తన సినిమాను ముందు అనుకున్న ప్రకారం 11న రిలీజ్ చేయకుండా 14న విడుదల చేశాడు. దీంతో తెలుగు సినిమాల మీద తనకున్న ప్రేమకు నిదర్శనం ఇది అని దిల్ రాజు ప్రచారం చేసుకున్నాడు.

ఇదంతా పక్కన పెడితే సంక్రాంతి సినిమాలలో వాల్తేరు వీరయ్య విజేతగా నిలిచింది. ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంది. తమిళంలో అజిత్ సినిమా తునివు కూడా బ్రేక్ ఈవెన్‌కు చేరింది. అయితే తొలిరోజు రికార్డు స్థాయి వసూళ్లను సాధించిన బాలయ్య మూవీ వీరసింహారెడ్డి ఇంకా బ్రేక్ ఈవెన్‌కు చేరుకోలేదు. వీరయ్య ప్రభంజనంతో బాలయ్య మూవీ డీలా పడిపోయింది. ఇంకా విచిత్రం ఏంటంటే వీరసింహారెడ్డి మూవీ కంటే విజయ్ వారసుడు మూవీకే ఎక్కువ వసూళ్లు వస్తుండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్చపరుస్తోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో చాలా ప్రాంతాల్లో వీరసింహారెడ్డి కంటే వారసుడు మూవీకి వసూళ్లు బెటర్‌గా ఉన్నాయి. అటు హైదరాబాద్ నగరంలో బాలయ్య చిత్రాన్ని మించి విజయ్ డబ్బింగ్ మూవీకి ఎక్కువ షోలు కేటాయించడం చాలామందికి మింగుడు పడడం లేదు. వాల్తేరు వీరయ్య మూవీకి రెండో వారంలో 400కు పైగా షోలు ఇవ్వగా.. దిల్ రాజు సినిమా వారసుడు 300 ప్లస్ షోలతో నడుస్తోంది. బాలయ్య వీరసింహారెడ్డికి షోలు 270 మాత్రమే ఇవ్వడం నందమూరి అభిమానులకు పెద్ద షాక్ అనే చెప్పాలి.

తొలివారం వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలను చూసిన అభిమానులకు రెండో వారంలో చూసేందుకు సినిమాలు లేకపోవడం కూడా వారసుడు సినిమాకు కలిసొచ్చిందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. నిజానికి వారసుడు మూవీకి తెలుగులో ఏమంత మంచి టాక్ రాలేదు. కానీ సంక్రాంతికి జనాలు సినిమాలు చూసే మంచి మూడ్‌లో ఉంటారు. థియేటర్లలో ఏ సినిమా ఉన్నా చూస్తారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాల ఓవర్ ఫ్లోస్ కూడా దీనికి కలిసొచ్చాయి. మంచి థియేటర్లలో వారసుడు ఆడుతుండటం కూడా ప్లస్ అయింది. ఈ నేపథ్యంలో రెండో వారంలో స్క్రీన్లు, షోల విషయంలో వాల్తేరు వీరయ్య తర్వాత దిల్ రాజు నిర్మించిన వారసుడు రెండో స్థానంలో ఉండడం ఆశ్చర్యం కలిగించే విషయం. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ మూవీని దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. రష్మిక మందన హీరోయిన్‌గా నటించగా జయసుధ, శ్రీకాంత్, కిక్ శామ్, శరత్ కుమార్, ప్రభు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.13.93 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.14.2 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతానికి ఇంకా ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు చేరుకోలేదని సమాచారం.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

రామ్ చరణ్ కోసం చేసిన అప్పులను పూడ్చేసిన ‘వారసుడు’ సినిమా

‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్‌లో చిరంజీవి ఓ మాట చెబుతూనే ఉన్నారు. ‘సరిగ్గ…