
నందమూరి బాలకృష్ణ అంటే మనకి వెంటనే గుర్తుకు వచ్చేది ఆయనకి ఉన్న మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ,మాస్ సినిమాలు , వీరోచిత పంచ్ డైలాగ్స్ ఇవే గుర్తు వస్తాయి,కానీ పైకి ఎంతో గంభీరంగా కనిపించే బాలకృష్ణ మనసు మాత్రం చిన్నపిల్లాడి మనస్తత్వం అని మన అందరికి తెలిసిందే, సినీ యాక్టర్ గా , రాజకీయ నాయకుడిగా ఆయన మన అందరికి సుపరిచితం, కానీ ఆయనలో మనకి తెలియని ఎన్నో కోణాలు ఉన్నాయి,అలా బాలయ్య బాబు తనలో దాగి ఉన్న కోణాన్ని ఇప్పటి వరుకు మనం ఎప్పుడు కూడా చూడని కోణం ఆయన యాంకరింగ్ స్కిల్స్, కెరీర్ లోనే తొలిసారిగా బాలయ్య బాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ చేసిన టాక్ షో అన్ స్టాపబుల్ విత్ బాలయ్య ప్రోగ్రాం ఆహా యాప్ లో ప్రతి వారం ప్రసారం అవుతున్న సంగతి మన అందరికి తెలిసిందే,ఇప్పటికే దీపావళి సందర్భంగా మంచు మోహన్ బాబు మరియు అతని ఫామిలీ తో చేసిన మొట్టమొదటి ఎపిసోడ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది , ఈ ఎపిసోడ్ లో బాలయ్య బాబు మోహన్ బాబు తో సరదాగా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.
తొలుత మోహన్ బాబు షో లోకి అడుగుపెట్టగానే ఇంట్రడక్షన్ ఇవ్వకుండానే వచ్చేస్తాడు ముసలి చాదస్తం అంటూ మోహన్ బాబు పై పంచులు వేస్తాడు బాలయ్య బాబు, ఇక షో నడుస్తున్న కొద్దీ సమయం తర్వాత మంచు విష్ణు మరియు మంచు లక్ష్మి షోలోకి ఎంటర్ అవుతారు,వాళ్ళు రాగానే బాలయ్య బాబు మనోజ్ ఎక్కడా రాలేదా అని అడుగుతాడు, వాడు గాలి ఎటు వీస్తే అటు పోతుంటాడు మాలాగా కాదు అని సమాధానం చెప్తారు, అప్పుడు వెంటనే బాలయ్య బాబు మాట్లాడుతూ ‘అవును వాడు మీలాగా కాదు, చాలా మంచోడు’ అని సమాధానం ఇస్తాడు, అప్పుడు మంచు లక్ష్మి ‘ అందరూ ఇదే మాట అంటూ ఉంటారు’ అని బదులిస్తుంది, అప్పుడు బాలయ్య బాబు మనోజ్ చిన్నప్పటి సంఘటన గుర్తుకు వచ్చి ‘ మనోజ్ చిన్నప్పుడు మా అమ్మాయి బ్రహ్మీని ని చెంప పగలకొట్టాడు, ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ నా దగ్గరకి వచ్చి చెప్పింది, చిన్నప్పుడు చాలా తులిపి వేషాలు వేసేవాడు, ఇప్పుడు చాలా మంచోడిగా మారిపోయాడు’ అంటూ బాలయ్య బాబు మాట్లాడాడు.
ఇక బాలయ్య బాబు ప్రస్తుతం బోయపాటి శ్రీను తో అఖండ అనే సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, సీమా మరియు లెజెండ్ వంటి సెన్సషనల్ హిట్స్ తర్వాత మల్లి వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్నా సినిమా కావడం తో ఈ సినిమా పై అంచనాలు ఎవ్వరు ఊహించని స్థాయిలో ఉన్నాయి, దానికి తగ్గట్టుగానే ఈ సినిమా టీజర్ కి అభిమానుల నుండి మరియు ప్రేక్షకల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 2 వ తేదీన లేకపోతే 17 వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు, ఇక అన్ స్టాపబుల్ విత్ బాలయ్య షో లో మొదటి ఎపిసోడ్ లో మోహన్ బాబు రాగ , రెండవ ఎపిసోడ్ లో దగ్గుపాటి రానా, మూడవ ఎపిసోడ్ లో విజయ దేవరకొండ , నాల్గవ ఎపిసోడ్ లో ప్రభాస్ , మరియు 5 వ ఎపిసోడ్ లో నాగబాబు గెస్ట్స్ గా రాబోతున్నారు, ఇక ఆఖరి ఎపిసోడ్ లో జూనియర్ ఎన్టీఆర్ అహుడిగా రాబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.