
నందమూరి బాలకృష్ణ లో ఇప్పటి వరకు మనం చూడని ఎన్నో కోణాలు బయటపడుతున్నాయి.నటన తప్పితే బాలయ్య బాబు కి ఏమి తెలియదని ఇన్ని రోజులు మనం అనుకునేవాళ్లం.కానీ ఆయన యాంకరింగ్ చేసే టాలెంట్ కూడా ఉందని ఆహా మీడియా లో ప్రసారమైన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో చూస్తే కానీ మనకి తెలియలేదు బాలయ్య ఇంత అద్భుతంగా యాంకరింగ్ చేయగలడా అని.ఎప్పుడూ గంభీరంగా కనిపించే బాలయ్య తో మాట్లాడాలంటే ఎవరికైనా భయం గా ఉండేది.అసలు ఈయనతో డైరెక్టర్స్ అన్ని రోజులు కలిసి ఎలా పని చేసేవాళ్ళు అని అనుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు.కానీ బాలయ్య మంచి సరదా మనిషి అని, ఆయన సెట్స్ లో ఉన్నంతసేపు మంచి జోష్ ఉంటుందని ఈ అన్ స్టాపబుల్ షో చూసిన తర్వాతే జనాలకు అర్థం అయ్యింది.
ఆ రెండు సీజన్స్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో బాలయ్య ని హోస్ట్ గా పెట్టుకునేందుకు ప్రముఖ టీవీ చానెల్స్ అన్ని క్యూ కట్టేస్తున్నాయి.ఇప్పుడు టాలీవుడ్ లో ఏ హీరో కి దక్కని మరో అరుదైన గౌరవం బాలయ్య కి దక్కనుంది.ఈ నెల 31 వ తారీఖు నుండి IPL టోర్నమెంట్ ప్రారంభం కానుంది.ప్రతీ ఏడాది ఈ టోర్నమెంట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.
ఈ టోర్నమెంట్ డిస్నీ + హాట్ స్టార్ లో ప్రారంభం కానుంది,గత రెండు మూడేళ్ళ నుండి హాట్ స్టార్ లో తెలుగు కామెంటరీ కూడా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే.ఈసారి జరగబొయ్యే టోర్నమెంట్ కి కామెంటెర్ గా బాలయ్య బాబు వ్యవహరించబోతున్నట్టు తెలుస్తుంది.బాలయ్య కి యూత్ లో రోజు రోజుకి పెరుగుతున్న క్రేజ్ ని గమనించే హాట్ స్టార్ యాజమాన్యం బాలయ్య బాబు ని కలిసి రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.