
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ప్రోగ్రాం కి టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు..అందరూ హాజరవ్వడం వేరు..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరవ్వడం వేరు..ఆయన క్రేజ్ అలాంటిది మరి..మొన్ననే ఈ ఎపిసోడ్ కి ప్రభాస్ వచ్చిన సంగతి తెలిసిందే..ఈ ఎపిసోడ్ ఎల్లుండి స్ట్రీమింగ్ కాబోతుంది..ప్రభాస్ ఎపిసోడ్ కి కూడా మంచి హైప్ ఉంది కానీ..పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి షూటింగ్ దగ్గర నుండే విపరీతమైన హైప్ ఏర్పడింది..నిన్న అన్నపూర్ణ స్టూడియోస్ ని మొత్తం అభిమానులు ఒక పవర్ స్టార్ జిందాబాద్ నినాదాలతో హోరెత్తిపోయ్యేలా చేసారు..అది చూసి బాలయ్య బాబు కూడా షాక్ కి గురయ్యాడు..నిన్న సోషల్ మీడియా మొత్తం అన్నపూర్ణ స్టూడియోస్ పవన్ కళ్యాణ్ అభిమానులు చేసిన కోలాహలం కి సంబంధించిన వీడియోలు మరియు ఫొటోలే ఉన్నాయి..మీడియా సైతం ఈ ఎపిసోడ్ ని కవర్ చెయ్యడానికి తెగ కష్టపడ్డారు.
ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ బయట ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో..ఇండస్ట్రీ లో కూడా అదే స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది..కుర్ర హీరోల దగ్గర నుండి.స్టార్ డైరెక్టర్స్ వరకు అందరూ ఆయన అభిమానులే..రీసెంట్ గా ఆ జాబితాలోకి బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కూడా చేరిపోయాడు..నందమూరి కుటుంబం లో పుట్టి పెరిగిన బిడ్డ కచ్చితంగా నందమూరి హీరోలని అభిమానిస్తారు అని అనుకోవచ్చు..కానీ నందమూరి కుటుంబం లో కూడా పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ ఉన్నారు అంటే మాత్రం చెప్పుకోదగ్గ విషయమే..ఈ ఎపిసోడ్ లో కేవలం పవన్ కళ్యాణ్ ని కలవడం కోసమే మోక్షజ్ఞ మధ్యలో వస్తాడట..వచ్చి పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగి కాసేపు మాట్లాడి వెళ్తాడట..ఇది ఎపిసోడ్ లో కూడా ఉండబోతుంది..కచ్చితంగా నందమూరి మరియు మెగా అభిమానులకు ఇది పండుగ లాంటి ఎపిసోడ్ అనే చెప్పొచ్చు.
పవన్ కళ్యాణ్ సినిమాలు ఏది కూడా మిస్ అవ్వకుండా మోక్షజ్ఞ బాగా చూస్తాడట..అందుకే కొడుకుని ప్రత్యేకంగా పిలిపించి చివర్లో ఫోటో తీయించాడు బాలయ్య..ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో అతి తర్వరలోనే విడుదల కానుంది..ఫుల్ ఎపిసోడ్ వచ్చే సంక్రాంతి నుండి ఆహా లో స్ట్రీమింగ్ కాబోతున్నట్టు సమాచారం..ఇది ఇలా ఉండగా త్వరలో జరగబొయ్యే బాలయ్య బాబు ‘వీర సింహా రెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాడట..దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా త్వరలోనే తెలియనుంది.