
సినీ పరిశ్రమలో అందంతో పాటు అభినయం కూడా అవసరం. అలాంటి కొద్దిమంది నటీమణుల్లో హీరోయిన్ సాయిపల్లవి ఒకరు. సాయిపల్లవి దగ్గర డ్యాన్సింగ్ టాలెంట్ కూడా ఉంది. స్టార్ హీరోలతో సమానంగా ఆమె డ్యాన్స్ చేస్తుంది. అందుకే సాయిపల్లవి అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. నేచురల్ బ్యూటీగానూ ఆమెకు గుర్తింపు ఉంది. ఫిజిక్ విషయంలోనూ ఎప్పుడూ ఒకేలా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో సాయిపల్లవి వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. అయితే సాయిపల్లవి చిన్నతనంలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన విషయం చాలా మందికి తెలియదు. సాయి పల్లవి చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన సినిమాలు ఇప్పటికీ టీవీలో ప్రసారమవుతూ ఉంటాయి. కానీ ఆ సినిమాలను చూస్తే మనం సాయిపల్లవిని గుర్తుపట్టలేం. ఆరేళ్ల వయసులోనే సాయిపల్లవి సినిమాల్లో నటించింది.
చైల్డ్ ఆర్టిస్టుగా సాయిపల్లవి నటించిన సినిమా కోలీవుడ్ మూవీ. కంగనారనౌత్, జయం రవి హీరో హీరోయిన్లుగా నటించిన ధూమ్ ధామ్ సినిమాలో సాయిపల్లవి చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మెప్పించింది. ఈ సినిమాలో సాయి పల్లవి కంగనా రనౌత్ పక్కన చిన్న పిల్లలా వెనకల కూర్చొని ఉంటుంది. ఈ సినిమా తర్వాత మరో సినిమాలోనూ ఆమె చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. ప్రసన్న హీరోగా మీరాజాస్మిన్ హీరోయిన్‌గా నటించిన తమిళ సినిమాలో నటించింది. తొలుత చిన్నతనంలో నటించి నటనపై మక్కువతో డ్యాన్స్ టాలెంట్ షోలలో పాల్గొని ఆ తర్వాతే సాయిపల్లవి లీడ్ క్యారెక్టర్లు సంపాదించింది. మల్లర్ అనే మలయాళం మూవీతో ఆమె సినీరంగ ప్రవేశం చేసింది. మలయాళంలో ప్రేమమ్ మూవీ సాయిపల్లవికి బ్రేక్ ఇచ్చింది. తెలుగులోనూ రీమేక్ అయిన ఈ సినిమాలో తొలుత సాయిపల్లవినే తీసుకుందామని భావించారు. కానీ అప్పటికీ ఆమె మెడిసిన్ పరీక్షలు ఉండటంతో నో చెప్పింది. దీంతో సాయిపల్లవి క్యారెక్టర్‌లో శ్రుతిహాసన్‌ను తీసుకున్నారు.
టాలీవుడ్‌లో ఫిదా సినిమాతో ప్రేక్షకులను సాయిపల్లవి ఫిదా చేసింది. ఈ మూవీలో భానుమతి పాత్రలో ఆమె జీవించింది. వరుణ్ తేజ్ పక్కన సాయిపల్లవి లాంటి పొట్టి అమ్మాయి సరితూగుతుందా అని చాలా మంది కామెంట్ చేశారు. కానీ తన నటనతో ఆమె వరుణ్ తేజ్‌నే డామినేట్ చేసి పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఇక సన్నగా కనిపించే సాయిపల్లవి జిమ్, డైట్ అసలు ఫాలో కానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మెడిసిన్ చదివిన తనకు మొదటి నుంచి బాడీ మీద కంట్రోల్ ఉందని, ఏం తిన్నా.. ఎంత తిన్నా.. బాడీని కరెక్ట్ ఫిజిక్‌లో పెట్టుకోవడానికి హెల్తీగా ఉండటానికి చక్కగా ఇంటి పనులు చేసుకుంటానని తెలిపింది. తాను ప్రతిరోజూ తీసుకునే బ్రేక్ ఫాస్ట్‌లో రాగి జావా, రెండు ఇడ్లీలు.. మధ్యాహ్నం భోజనంలో రసం అన్నం, ఒక వెజిటేబుల్స్ ఫ్రై, ఈవినింగ్ రెండు చపాతీలు.. అంటూ తన డైట్ ప్లాన్‌ను చెప్పుకొచ్చింది. టాలీవుడ్‌లో గత ఏడాది శ్యామ్ సింగరాయ్‌తో మెప్పించిన సాయిపల్లవి ఈ ఏడాది విరాటపర్వం, గార్గి సినిమాలతో అలరించింది.