Home Entertainment బాబాయి పవన్ కళ్యాణ్ పై సెన్సషనల్ కామెంట్స్ చేసిన రామ్ చరణ్

బాబాయి పవన్ కళ్యాణ్ పై సెన్సషనల్ కామెంట్స్ చేసిన రామ్ చరణ్

0 second read
0
1
3,352

మన టాలీవుడ్ మాత్రమే కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్న మూవీ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ మల్టీస్టార్ర్ర్ మూవీ ఆర్ ఆర్ ఆర్,దాదాపు మూడేళ్ళ నుండి ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఈ సినిమా కోసం డేట్స్ ని కేటాయించారు, వాళ్ళ పడిన కష్టం ఎలాంటిదో మనం మొన్న విడుదల అయినా ట్రైలర్ ని చూసే చెప్పేయొచ్చు,దాదాపుగా 350 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అన్ని బాషలలో విడుదల కానుంది,కరోనా తర్వాత కుదేలు అయినా ఫిలిం ఇండస్ట్రీ కి బాలీవుడ్ లో సూర్యవంశీ అనే సినిమా ఊపిరి పోసింది, ఇక మలయాళం లో కురూప్, కోలీవుడ్ లో డాక్టర్ మరియు మనాడు సినిమాలు కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదల అయ్యి ఘానా విజయాలు సాధించి ఇండస్ట్రీ కి ఊపిరి పోశాయి, మన టాలీవుడ్ లో లేటెస్ట్ సెన్సేషన్ అఖండ ద్వారా మల్లి మనకి పూర్వ వైభవం ని తెచ్చింది, ఇక ఇండస్ట్రీ మరో లెవెల్ కలెక్షన్స్ ని చూడాలి అనుకునేది ఆర్ ఆర్ ఆర్ సినిమాకే, ఆర్ ఆర్ ఆర్ సినిమా కరోనా వాళ్ళ నష్టపోయిన ఈ మూడేళ్ళను పూడుస్తుంది అనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో గట్టిగ ఉంది.

అయితే ఈ సంక్రాంతికి ఆర్ ఆర్ ఆర్ తో పాటుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మరియు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాలు కూడా విడుదలకి సిద్ధం గా ఉన్నాయి, వాస్తవానికి ఆర్ ఆర్ ఆర్ కంటే ముందు గా సంక్రాంతికి వస్తున్నాము అని చెప్పింది భీమ్లా నాయక్ మరియు రాధే శ్యామ్ సినిమా టీమ్స్ వారే, కానీ ఎవ్వరి ఊహించని విధంగా రేస్ లోకి ఆర్ ఆర్ ఆర్ మూవీ కూడా వచ్చింది, దీనితో మూడు సిఎంలకు థియేటర్స్ సర్దుబాటు చేయడానికి డిస్ట్రిబ్యూటర్స్ తలలు పట్టుకున్నారు , ఆర్ ఆర్ ఆర్ మూవీ టీం పై డిస్ట్రిబ్యూటర్స్ ఒత్తిడి తీవ్రంగా పెరగడం తో వాళ్ళు భీమ్లానాయక్ మరియు రాధే శ్యామ్ నిర్మాతలతో పలు మార్లు విడుదల వాయిదా వేసుకోమని చెప్పడానికి చర్చలు జరిపారు, కానీ రెండు సినిమాలకు సంబంధించిన నిర్మాతలు వెనక్కి తగ్గడానికి ఏ మాత్రం సిద్ధంగా లేరు , దీనితో ఈ సంక్రాంతికి మూడు పెద్ద హీరోల సినిమాలు పోటీ పడక తప్పని పరిస్థితి ఏర్పడింది.

ఇది ఇలా ఉండగా ఇటీవల రామ్ చరణ్ , ఎన్టీఆర్ మరియు రాజమౌళి లు ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రొమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఈ ప్రొమోషన్స్ లో ఒక్క విలేకరి రామ్ చరణ్ తో మాట్లాడుతూ ‘ ఈ సంక్రాంతికి చాలా రష్ ఉంది కదా , మీ బాబాయి గారి భీమ్లా నాయక్ సినిమా కూడా వస్తుంది, ఇంతటి కాంపిటీషన్ లో మీ భారీ మొత్తం మీద మీ సినిమాని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టాలు వస్తాయి అని అనుకుంటున్నారా’ అని అడిగిన ప్రశ్నకి రామ్ చరణ్ సమాధానం ఇస్తూ ‘ వాస్తవానికి మా సినిమా ఈ ఏడాది అక్టోబర్ 13 వ తేదీన విడుదల కావాల్సి ఉంది, కానీ పరిస్థితులు ఇంకా మాములు స్థితికి రాకపోవడం తో మేము జనవరి 7 వ తేదీన రావాలి అనుకున్నాం, సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు కనీసం రేండు ఉంటాయి అని తెలుసు, అందుకే మా సినిమాని సంక్రాంతి పండగకి వారం రోజులు ముందు వేసుకుంటున్నాము, అలాగే బాబాయి భీమ్లా నాయక్ సినిమా జనవరి 12 వ తేదీన,నా మిత్రుడు ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా 14 వ తేదీన వస్తున్నాయి , ఆ సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను,మా సినిమా అయితే జనవరి 7 వ తేదీన రాబోతుంది, ఎవరు వచ్చిన రాకపాయినా మేము మాత్రం వస్తున్నాము’ అంటూ చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

హీరో రానా ఎమోషనల్ గా మాట్లాడిన ఈ మాటలు వింటే కన్నీళ్లు ఆపుకోలేరు

తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫామిలీ నుండి ఇండస్ట్రీ కి వచ్చినప్పట…