Home Uncategorized బాక్స్ ఆఫీస్ వద్ద సుడిగాలి సుధీర్ ప్రభజనం.. ‘గాలోడు’ 3 రోజుల వసూళ్లు ఎంతో తెలుసా?

బాక్స్ ఆఫీస్ వద్ద సుడిగాలి సుధీర్ ప్రభజనం.. ‘గాలోడు’ 3 రోజుల వసూళ్లు ఎంతో తెలుసా?

0 second read
0
0
358

సుడిగాలి సుధీర్ ఇంతకుముందు హీరోగా చేసిన సినిమాలేవీ పెద్దగా ఆకట్టుకోలేదు. బాక్సాఫీస్ వద్ద కూడా అతడి సినిమాలు సత్తా చాటుకున్న సందర్భాలు లేవు. అతడు గతంలో సాఫ్ట్‌వేర్ సుధీర్, త్రీ మంకీస్, ఎందుకో ఏమో, వాంటెడ్ పండుగాడ్ వంటి సినిమాలలో నటించినా ఆ సినిమాలు వచ్చిన సంగతి కూడా కొంతమంది ప్రేక్షకులకు తెలియదు. ఏదో ఓటీటీలలో వస్తే చూడటం తప్ప సుధీర్ సినిమాలకు థియేటర్‌కు వెళ్లి చూడాల్సినంత అవసరం లేదని మరికొందరు అభిప్రాయపడ్డారు. అయితే ఎట్టకేలకు సుడిగాలి సుధీర్ సుడి తిరిగినట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం సుధీర్ నటించిన గాలోడు సినిమా అతడి ఖాతాలో హిట్ వేసిందనే చెప్పాలి. కానీ గాలోడు సినిమా కూడా గాలికి కొట్టుకుపోతుందని చాలా మంది భావించారు. ఎందుకంటే ఈ సినిమా గురించి విడుదలకు ముందు యూనిట్ సభ్యులు ఎక్కడా ప్రమోట్ చేయలేదు. కానీ అనూహ్యంగా గాలోడు మూవీ మొదటి నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయినట్లు ట్రేడ్ పండితులు చెప్తున్నారు సినిమా కూడా సాధారణం ఆడియన్స్ కు మంచి కిక్ ఇచ్చే సినిమాగా ఉండటం తో సినిమా హిట్ గా దూసుకుపోతూ మంచి కలెక్షన్స్ సాధిస్తుంది అని చెప్పాలి సినిమా పరంగా మంచి బ్రేక్ ఈవ్ కూడా సుధీర్ కి వచ్చింది సుదీర్ కు తెలుగు లో మంచి ఫ్యాన్ ఫ్లోయింగ్ కూడా ఎక్కువ ఉండటం తో మంచి హిట్ అయ్యింది సినిమా అని చెప్పాలి.

ఎలాంటి హడావిడి లేకుండా విడుదలైన గాలోడు మూవీ తొలి మూడు రోజుల్లో అందరినీ ఆశ్చర్యపరిచేలా వసూళ్లను సొంతం చేసుకుంది. తొలిరోజు రూ.1.21 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ మూవీ రెండో రోజు కూడా అదే స్థాయిలో వసూళ్లను రాబట్టింది. రెండో రోజు గాలోడు మూవీ రూ.1.14 కోట్ల గ్రాస్ సాధించింది. మూడో రోజు ఆదివారం కావడంతో ఈ మూవీ వసూళ్లు పెరిగాయి. మూడో రోజు రూ.1.61 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో మొదటి మూడు రోజుల్లో గాలోడు మూవీ రూ.4 కోట్ల గ్రాస్, రూ.2.25 కోట్ల షేర్ సొంతం చేసుకుంది. సుధీర్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా నిలిచిపోయింది. కాగా ఈ మూవీ రూ.3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. ఇంకా రూ.75 లక్షలు మాత్రమే రావాల్సి ఉండటంతో నాలుగో రోజే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుందని ట్రేడ్ నమ్ముతోంది అయితే ఈ సినిమా ఇలాగే కొనసాగితే లాంగ్ రన్ లో మంచి వసూళ్లను సాధిస్తుంది అని చెప్పచ్చు సినిమా లో మంచి స్కోప్ కూడా ఉండటం తో సినిమా కి సంబంధించి హిట్ ఫెయిర్ గా దూసుకుపోతుంది అని చెప్పాలి.

ఇప్పటికే కొన్ని ఏరియాలలో గాలోడు మూవీ ప్రాఫిట్ జోన్‌లోకి వచ్చిందని సమాచారం అందుతోంది. జబర్దస్త్ షోతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ తన కామెడీ టైమింగ్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. దీంతో వరుసగా హీరో ఆఫర్లను చేజిక్కించుకుంటున్నాడు. సినిమా ఆఫర్లు వస్తుండటంతో జబర్దస్త్ షో నుంచి కూడా సుధీర్ తప్పుకున్నాడు. అయితే గాలోడు టీజర్, ప్రోమోలను చూసిన తర్వాత చాలా మంది నాసిరకంగా ఉన్నాయని విమర్శించారు. సుధీర్‌కు సినిమాలు అవసరమా అని చాలా మంది ప్రశ్నించారు. చక్కగా టీవీ షోలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ తన క్రేజ్‌తో గాలోడు మూవీని సక్సెస్ బాటలో నడిపించాడు. అయితే గాలోడు మూవీ హిట్ కావడానికి పోటీ ఇతర సినిమాలు లేకపోవడం కూడా సుధీర్‌కు కలిసొచ్చిందనే చెప్పాలి. ఓ టీవీ నటుడు వెండితెరపై ఇలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకోవడం నిజంగా గ్రేట్ అని పలువురు కొనియాడుతున్నారు.

 

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…