
నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా నటించిన భింబిసారా చిత్రం ఇటీవలే విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే..తన మార్కెట్ కి మించిన భారీ బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమా అంచనాలకు మించి వసూళ్లు రాబట్టడం..అది కూడా టాలీవుడ్ మార్కెట్ పూర్తిగా స్లంప్ లో ఉన్నప్పుడు ఇలాంటి విజయం రావడం నిజంగా హర్షణీయం..కలెక్షన్స్ లేక డల్ గా పడున్న ఇండస్ట్రీ కి ఈ సినిమా ఇచ్చిన ఊపు మామూలుది కాదు..మేజర్ మరియు విక్రమ్ వంటి సెన్సషనల్ హిట్ తర్వాత భింబిసారా చిత్రం కూడా అదే రేంజ్ హిట్ అయ్యి బయ్యర్స్ కి కాసుల కనకవర్షం కురిపించింది..ముఖ్యంగా ఆదివారం నాడు అయితే ఈ సినిమాకి వచ్చిన వసూళ్లు మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాకి కూడా రాలేదు అని అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..ఆచార్య సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచినా సంగతి మన అందరికి తెలిసిందే..బహుశా ఈ సినిమా హిట్ అయ్యుంటే ఆచార్య మొదటి రోజు వసూళ్లు అంత కూడా భింబిసారా ఫుల్ రన్ ఉండదు అనుకోండి అది వేరే విషయం.
ఇక భింబిసారా మూడు రోజుల వసూళ్ల విషయానికి వస్తే ఈ చిత్రం మొదటి రోజే రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఏకంగా 6 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసి అందరిని ఆశ్చర్యపరిచింది..ఇక రెండవ రోజు 4 కోట్ల 50 లక్షల రూపాయిలు వసూలు చేసిన ఈ చిత్రం మూడవ రోజు 5 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..ఇలా కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ కి కలిపి 18 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..ఇది మీడియం హీరోల సినిమాలలో ఒక రికార్డు గా చెప్పుకోవచ్చు..కళ్యాణ్ రామ్ కి ఇంతకు ముందు క్లోసింగ్ కలెక్షన్స్ కూడా ఈ రేంజ్ లో ఉండేది కాదు..కానీ ఆ రేంజ్ వసూళ్లు కేవలం మూడు రోజుల్లోనే వసూలు చేసింది అంటే ఈ సినిమా కి పబ్లిక్ లో ఉన్న టాక్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ని కేవలం 15 కోట్ల రూపాయలకే చేసారు..కానీ మూడు రోజులు తిరగకముందే ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కి పెట్టిన పైసాకి 10 రూపాయిలు లాభం వచ్చేలా చేసింది ఈ చిత్రం..ఈ సినిమాకి ఉన్న ఫ్లో ని చూస్తుంటే కచ్చితంగా ఫుల్ రన్ కూడా 40 కోట్ల రూపాయిల మార్కుని అందుకునేలా అనిపిస్తుంది..ఈరోజు నూన్ షోస్ కూడా భింబిసారా కి అదిరిపోయాయి..ఇక మాట్నీస్ నుండి ఈ సినిమా కుమ్ముడు ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు..త్వరలోనే భింబి సారా పార్ట్ 2 కూడా ఉంటుంది అని కళ్యాణ్ రామ్ ఇది వరకే ప్రకటించిన సంగతి మన అందరికి తెలిసిందే..అసలే ఈమధ్య కాలం లో సీక్వెల్స్ కి విపరీతమైన క్రేజ్ ఉంది..భింబిసారా సీక్వెల్ కూడా అదే రేంజ్ లో కుమ్మేస్తుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు ఆ చిత్ర దర్శకుడు వసిష్ఠ.