
బిగ్‌బాస్-6 సీజన్లో ఆకట్టుకున్న కంటెస్టెంట్లలో ఆదిరెడ్డి ఒకడు. ఒక కామన్‌మేన్‌లా హౌస్‌లోకి అడుగుపెట్టిన అతడు తన స్ట్రాటజీలు, ఆలోచనలతో టాప్-5 వరకు చేరుకున్నాడు. అయితే ఆదిరెడ్డి బ్యాక్‌గ్రౌండ్ గురించి చాలా మందికి తెలియదు. బిగ్‌బాస్ రివ్యూవర్గానే అతడు అందరికీ తెలుసు. కానీ అంతకంటే ముందే అతడు యూట్యూబర్. క్రికెట్ అనలిస్ట్ కూడా. ఆదిరెడ్డి డ్రీమ్ లెవన్ యాప్‌లో బెట్టింగులు పెట్టి కూడా చాలా డబ్బు సంపాదించాడు. ఆ తర్వాతే అతడు బిగ్‌బాస్ క్రిటిక్‌గా మారాడు. బిగ్‌బాస్ షోల గురించి తనదైన రీతిలో రివ్యూలు ఇస్తూ యూట్యూబ్‌లో క్రేజ్ తెచ్చుకున్నాడు. క్రికెట్, మూవీస్, ఫుడ్ వీడియోస్ చేసే ఆదిరెడ్డి బిగ్ బాస్ రివ్యూలతో బాగా పాపులర్ అయ్యాడు. ఆదిరెడ్డి ట్వీట్ చేస్తే వాటిని సెలబ్రిటీలు రీట్వీట్ చేసేంత రేంజ్లో అతడికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగింది. 2020లో ఆదిరెడ్డి కవిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఆదిరెడ్డి సిస్టర్‌కు ఫ్రెండ్. ఆమెకు కూడా ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. ‘కవిత నాగ విలాగ్స్’ పేరుతో యూట్యూబ్ ఛానల్‌ను కవిత రన్ చేస్తోంది.
అయితే ఆదిరెడ్డి బిగ్‌బాస్ హౌస్‌లో తాను సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తిగా పరిచయం చేసుకున్నాడు. కానీ అతడు సామాన్య వ్యక్తి కాదని.. కొన్ని కోట్ల విలువ చేసే భూమి ఉందని తెలుస్తోంది. తనకు 40 ఎకరాల పొలం ఉందని గతంలో ఓ సందర్భంలో స్వయంగా ఆదిరెడ్డి చెప్పాడు. ఈ విషయం తాజాగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో బిగ్‌బాస్ షోలో ఆదిరెడ్డి నటించాడని.. జెన్యూన్‌గా లేడని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఆడియన్స్‌ను ఆదిరెడ్డి చీట్ చేశాడని మండిపడుతున్నారు. డబ్బు ఉండి కూడా ఏమీ లేని వ్యక్తిగా నాటకాలు ఆడి సానుభూతి సంపాదించుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అయితే ఆదిరెడ్డి బిగ్‌బాస్ షో వాల్యూ పోగొట్టాడని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిగ్‌బాస్ షో ద్వారా కూడా ఆదిరెడ్డి బాగానే రెమ్యునరేషన్ అందుకున్నాడని ప్రచారం జరుగుతోంది.
ఒక కామన్ మ్యాన్ నుంచి రివ్యూయర్‌గా, రివ్యూయర్ నుంచి బిగ్‌బాస్ కంటెస్టంట్‌గా ఎదిగిన ఆదిరెడ్డి.. బిగ్‌బాస్ సీజన్ 6లో థర్డ్ రన్నరప్‌గా నిలిచాడు. బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి.. తనదైన వ్యూహాలు, గేమింగ్ టాలెంట్‌తో ప్రేక్షకుల మనసు దోచి, చివరి వరకు షోలో కొనసాగాడు. అక్కడక్కడ కొన్ని తప్పిదాలు చేసినప్పటికీ.. అతని ఆటతీరు ఆడియన్స్‌కు బాగా నచ్చడంతో, థర్డ్ రన్నరప్ వరకూ తీసుకొచ్చారు. హౌస్‌లో ఉన్నప్పుడు తాను బిగ్‌బాస్ షోలో ఉన్న కంటెస్టంట్ల కంటే యూట్యూబ్ ద్వారానే ఎక్కువ సంపాదిస్తానని ఆదిరెడ్డి పేర్కొన్నాడు. అలాగే ఓ ఇంటర్వ్యూలో షానీ సైతం ఒక సినిమాకు స్టార్ హీరోయిన్ తీసుకునే పారితోషికం, తన నెల సంపాదనతో సమానమని స్వయంగా ఆదిరెడ్డే చెప్పినట్టు తెలిపాడు. బిగ్‌బాస్ షో ద్వారా మొత్తం 15 వారాలకు ఆదిరెడ్డి రూ. 12 లక్షల పారితోషికం అందుకున్నాడని తెలుస్తోంది. ఈ లెక్కన.. వారానికి రూ. 80 వేలు చొప్పున ఆదిరెడ్డి రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన కంటే ఇది చాలా అంటే చాలా తక్కువ అని నెటిజన్లు భావిస్తున్నారు.