
ప్రస్తుతం టాలీవుడ్‌లో సీనియర్ నటుడు నరేష్ నాలుగో పెళ్లి విషయం హాట్ టాపిక్‌గా మారింది. సీనియర్ నటుడు, మా అసోసియేషన్ సభ్యుడు నరేష్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. అలనాటి హీరోగా ఇప్పుడు స్టార్ యాక్టర్‌గా ఆయన నటనకు ఫిదా కానీ వారుండరు. ఇటీవల నాని నటించిన అంటే సుందరానికీ చిత్రంలో నాని తండ్రి పాత్రలో నరేష్ నటన అద్భుతం. భలే భలే మగాడివోయ్, సమ్మోహనం వంటి సినిమాల్లోనూ నరేష్ తన నటనతో అదరగొట్టాడు. ఇక కెరీర్ పరంగా ఆయన గురించి, ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇటీవల నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారం కలకలం రేపుతోంది. నరేష్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయితే వైవాహిక జీవితంలో వచ్చే మనస్పర్దల కారణంగా ముగ్గురు భార్యలను వదిలి ప్రస్తుతం ఆయన ఒంటరిగా నివసిస్తున్నాడు.
సూపర్ స్టార్ కృష్ణ, మహిళా దర్శకురాలు విజయనిర్మల భార్యాభర్తలన్న విషయం అందరికీ తెలుసు. అయితే కృష్ణతో వివాహానికి ముందే విజయనిర్మలకు పెళ్లి అయ్యింది. విజయనిర్మల మొదటి భర్తకు కలిగిన సంతానం నరేష్. అయితే విజయనిర్మల తన భర్తకు విడాకులు ఇచ్చి.. సూపర్ స్టార్ కృష్ణను రెండో పెళ్లి చేసుకున్నారు. విజయనిర్మల కుమారుడు కావడంతో నరేష్‌ను కృష్ణ తన సొంత కుమారుడి తరహాలోనే చూసుకున్నారు. దీంతో నరేష్ బాలనటుడిగానూ పలు సినిమాల్లో నటించాడు. పండంటి కాపురం సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టాడు. తర్వాత తన తల్లి విజయనిర్మల దర్శకత్వంలో ప్రేమ సంకెళ్లు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. జంధ్యాల నాలుగు స్తంభాలాట సినిమాతో ఫేమస్ అయ్యాడు. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే నరేష్‌కు మొదటి పెళ్లి జరిగింది. తల్లి విజయనిర్మల కోరిక మేరకు సీనియర్ డ్యాన్స్ మాస్టర్ శ్రీను కుమార్తెను నరేష్ పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరికీ నవీన్ జన్మించిన తర్వాత మనస్పర్థల కారణంగా విడిపోయారు.
తొలి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత నరేష్ ప్రముఖ కవి, సినిమా పాటల రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనువరాలు రేఖా సుప్రియను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు కూడా తేజ అనే కుమారుడు ఉన్నాడు. నరేష్, సుప్రియ కూడా విడాకులు తీసుకున్నారు. అనంతరం 50 ఏళ్ల వయసులో ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె రమ్యను 2010 డిసెంబరు 3న హిందూపురంలో నరేష్ వివాహం చేసుకున్నాడు. రమ్య వయసులో నరేష్ కంటే 20 ఏళ్లు చిన్నది. నరేష్-రమ్య దంపతులకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. రెండేళ్లు కాపురం చేసిన తర్వాత రమ్యతో కూడా నరేష్ దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడు పవిత్ర లోకేష్‌తో నాలుగో పెళ్లి రహస్యంగా చేసుకున్నాడని మూడో భార్య రమ్య ఆరోపిస్తోంది. ఇటీవల మైసూరులోని ఓ అపార్టుమెంట్‌లో నరేష్, పవిత్ర లోకేష్‌లను రమ్య రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టించింది. ఆ సమయంలో పవిత్రను రమ్య చెప్పు తీసుకుని కొట్టబోగా పోలీసులు అడ్డుకున్నారు. విజయనిర్మల ధరించే డైమండ్ నెక్లేస్‌ను నరేష్ పవిత్రకు బహుమతిగా ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. మరి నరేష్ తనకు విడాకులు ఇవ్వకుండా పవిత్రతో సహజీవనం చేయడాన్ని రమ్య తప్పుబడుతోంది. తనను మోసం చేశాడని ఆరోపిస్తోంది. కాగా నరేష్ కుమారుడు నవీన్ హీరోగా ఎంట్రీ ఇచ్చి నందిని నర్సింగ్ హోమ్ వంటి సినిమాలోనూ నటించాడు. కానీ హీరోగా సక్సెస్ కాలేకపోయాడు. నవీన్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ బెస్ట్ ఫ్రెండ్స్.