
విజయ్ దేవరకొండ హీరో గా నటించిన లైగర్ మూవీ pai నేడు ప్రేక్షకులలో ఎలాంటి అంచనాలు మరియు హైప్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఎప్పుడు యూత్ ని ఆకట్టుకునే జిమ్మిక్స్ తెలిసిన విజయ్ దేవరకొండ ఈ సినిమా కి కూడా యూత్ లో విపరీతమైన క్రేజ్ ని పెంచేసాడు..సాంగ్స్ , టీజర్స్ మరియు ట్రైలర్ అన్ని కూడా యావరేజి గా ఉన్నప్పటికీ కూడా ఓపెనింగ్స్ న భూతొ న భవిష్యతి అనే రేంజ్ లో ఉండబోతుంది..ఈ స్థాయి లో ఒక మీడియం రేంజ్ హీరో మూవీ కి క్రేజ్ రావడం గతం లో మనం ఎప్పుడు కూడా చూడలేదు..ఫుల్ రన్ లో 30 కోట్లు కొల్లగొట్టడమే కష్టం అనుకునే స్థాయి నుండి విజయ్ దేవరకొండ 30 కోట్ల రూపాయిల షేర్ ని మొదటి రోజే కొల్లగొట్టే రేంజ్ కి తన మార్కెట్ ని పెంచుకున్నాడు అనేది పచ్చి నిజం..లైగర్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే ఈ విషయం ని మనం అర్థం చేసుకోవచ్చు.
లైగర్ సినిమాకి సిటీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజ్ లో జరుగుతున్నాయి..ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ని బట్టి చూస్తుంటే ఈ సినిమాకి మొదటి రోజు కేవలం నైజాం ప్రాంతం నుండే 8 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది..ఈ మార్కుని ఇప్పటి వరుకు పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , చిరంజీవి, ప్రభాస్ మరియు అల్లు అర్జున్ వంటి హీరోలు మాత్రమే దాటారు..అంతే కాకుండా ఈ చిత్రానికి ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అద్భుతమైన బుకింగ్స్ జరిగాయి..కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుండే ఈ సినిమా 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని మొదటి రోజే వసూలు చేస్తుందని అంచనా..అదే కనుక జరిగితే స్టార్ హీరోల లిస్ట్ లోకి విజయ్ దేవరకొండ వెళ్ళిపోయినట్టే అని చెప్పొచ్చు..ఇక ఓవర్సీస్ గురించి ప్రత్యేకంగా ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి..ఈ ఏడాది ఈ సినిమాకి దొరికినన్ని థియేటర్స్ పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు వంటి ఓవర్సీస్ కింగ్స్ కి కూడా దొరకలేదు.
కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ నుండే ఈ సినిమాకి అమెరికా లో రెండు లక్షల 50 వేల డాలర్లు వచ్చాయి..ప్రీమియర్స్ ప్రారంభం అయ్యేసరికి ఈ సినిమా 5 లక్షల డాలర్లు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల నుండి వినిపిస్తుంది..ఇక ప్రీమియర్స్ మరియు మొదటి రోజు కి కలుపుకొని ఈ చిత్రం కచ్చితంగా 1 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని అంచనా..ఇక ఆస్ట్రేలియా, లండన్ , దుబాయి వంటి ప్రాంతాలలో కూడా ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ గట్టిగానే జరిగాయి..ఇక విజయ్ దేవరకొండ కి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..బడా బడా హీరోయిన్లు కూడా విజయ్ దేవరకొండ అంటే పడి చస్తారు..ఒక్క సినిమా హిందీ లో చెయ్యకపోయినా కూడా ఆయనకీ ఈ రేంజ్ క్రేజ్ అంటే మాములు విషయం కాదు..టాక్ వస్తే ఈ సినిమా హిందీ లో కూడా పగిలిపొయ్యే రేంజ్ ఓపెనింగ్ ని కొట్టడం గ్యారంటీ..అక్కడ ఈ సినిమాకి మొదటి 5 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వస్తుందని అంచనా వేస్తున్నారు..గ్రాండ్ ఓపెనింగ్ కి సర్వం సిద్ధం..ఇక టాక్ రావడమే ఆలస్యం..ఆకాశమే హద్దు అంటున్నారు రౌడీ ఫాన్స్..మరి వారి అంచనాలను ఈ సినిమా ఎంత వరుకు అందుకుంటుందో చూడాలి.