
సినిమా వేడుకల్లో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఇచ్చే స్పీచ్‌ల కోసం అభిమానులు ఆసక్తిగా చూస్తుంటారు. బండ్ల గణేష్ మాట్లాడితే ఆ ఫంక్షన్‌కు కిక్కు వస్తుందనడంలో అతిశయోక్తి లేదు. అందుకే సినిమా ఫంక్షన్‌ల కోసం బండ్ల గణేష్‌ను ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంటారు. తాజాగా ఆకాష్ పూరీ హీరోగా నటించిన చోర్ బజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బండ్ల గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. దేశం మొత్తం కల్లాపు చల్లాడు కానీ.. ఇంటి ముందు కల్లాపు చల్లడానికి టైం లేద ఆయనకు.. ఎంతో మందిని స్టార్లను చేశాడు.. డైలాగ్స్ చెప్పడం రాని వాళ్లకు నేర్పాడు.. డాన్సులు రాని వాళ్ళకు డాన్సులు నేర్పాడు.. కానీ కన్న కొడుకు సినిమా ఫంక్షన్‌కు రాలేకపోయాడు అంటూ పూరీ జగన్నాథ్‌ను ఉద్దేశించి ఆరోపణలు చేశాడు. అంతేకాకుండా పూరీ భార్య గురించి కూడా బండ్ల మాట్లాడాడు. పూరీ భార్య లావణ్య రామాయణంలో సీత వంటిదన్నాడు.
అయితే బండ్ల గణేష్ పూరీ భార్య లావణ్య గురించి ప్రస్తావిస్తూ పరోక్షంగా ఛార్మిని ఉద్దేశించి కూడా మాట్లాడాడు. ఛార్మి.. పూరి లైఫ్‌లో వ్యాంప్‌లా చొరబడిందన్న తరహాలో వ్యాఖ్యలు చేశాడు. లావణ్య మాత్రం ఆదర్శవంతమైన భార్య, చెల్లెలు, కోడలు అని బండ్ల గణేష్ అభివర్ణించాడు. దీంతో ఛార్మికి కౌంటర్లు పడ్డాయని తెగ ప్రచారం జరుగుతోంది. కొన్నాళ్లుగా పూరీ జగన్నాథ్‌తోనే ఛార్మి కలిసి ప్రయాణం చేస్తోంది. గతంలో ఛార్మి, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో జ్యోతిలక్ష్మి అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో ఛార్మి హీరోయిన్‌గా నటించగా పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తర్వాత ఇద్దరూ కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు. పూరీ కనెక్ట్స్ పేరుతో పూరీ జగన్నాథ్ ఓ బ్యానర్ నిర్మించగా.. ఛార్మి కూడా ఆ సంస్థకు భాగస్వామిగా వ్యవహరిస్తోంది. అంతే కాకుండా జ్యోతిలక్ష్మీ సినిమా తర్వాతనే వీరిద్దరూ కలిసి డేటింగ్ చేస్తున్నట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఛార్మి, పూరీ మధ్య ఏదో కథ నడుస్తుందని ఇండస్ట్రీలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పూరీ జగన్నాథ్, ఛార్మి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి.
బండ్ల గణేష్ తాజా వ్యాఖ్యలతో ఛార్మి హర్ట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. మధ్యలో ఎన్ని వంపులు, రంపులు వచ్చినా అంటూ బండ్ల కామెంట్ చేయడంతో ఛార్మి తన గురించే మాట్లాడాడని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పూరీకి, తనకు మధ్య స్నేహం మాత్రమే ఉందని.. తామిద్దరం కేవలం సినిమాలు మాత్రమే నిర్మిస్తున్నామని.. అంతేకానీ ఎవరికి ఇష్టం వచ్చిన స్టోరీలు వాళ్లు అల్లేయవద్దంటూ ఛార్మి బండ్లకు గట్టిగానే కౌంటర్ ఇచ్చిందని ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది. పూరీ తన కొడుకు గురించి పట్టించుకోలేదని మాట్లాడటం కూడా సరికాదని ఛార్మి హితవు పలుకుతోంది. ఆయన తన కొడుకు సినిమా కోసం స్క్రిఫ్ట్‌లు సమకూర్చడమో లేదా కథలు వినడమో లేదా మాటలు ఫ్రీగా రాయడయో పూరి చేస్తూనే ఉంటాడని.. ఇవన్నీ తెలియని బండ్ల గణేష్ ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తే సరిపోతుందా అని ఛార్మి ఫైర్ అవుతోంది.