Home Movie News బండి సంజయ్ కుమార్ మరియు రాజమౌళి మధ్య మాటల యుద్ధం

బండి సంజయ్ కుమార్ మరియు రాజమౌళి మధ్య మాటల యుద్ధం

0 second read
0
0
1,732

బాహుబలి సినిమా తర్వాత దర్శకుడు ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ వంటి ఊర మాస్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలతో తీస్తున్న ముల్టీస్టార్ర్ర్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ కోసం ఇప్పుడు యావత్తు భారతదేశం ప్రజలు ఎంతో ఆత్రుత గా ఎదురు చూస్తున్నారు, ఇప్పటికే షూటింగ్ ని ప్రారంబించుకొని 70 శాతం కి పైగా టాకీ పార్ట్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా లాక్ డౌన్ తర్వాత ఇటీవలే మల్లి షూటింగ్ ని తిరిగి ప్రారంబించుకున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఈ ఏడాది మార్చి నెలలో రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా రామ్ చరణ్ అల్లూరి సీత రామరాజు టీజర్ ని విడుదల చేసిన చిత్ర బృందం , ఇటీవల కొమరం భీం జయంతి సందర్భంగా ఎన్టీఆర్ కొమరం భీం టీజర్ ని విడుదల చేసారు, రెండు టీజర్స్ అభిమానుల నుండి ప్రేక్షకుల నుండి కనివిని ఎరుగని రెస్పాన్స్ వచ్చింది, రెండు టీజర్స్ టాలీవుడ్ లో ఉన్న రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టాయి, ఎన్టీఆర్ కొమరం భీం టీజర్ కి టాలీవుడ్ లోనే హైయెస్ట్ లైక్స్ రాగ, రామ్ చరణ్ టీజర్ కి హైయెస్ట్ వ్యూస్ వచ్చాయి, తెలుగు తో పాటు హిందీ ,తమిళ్ ,మలయాళం మరియు కన్నడ బాషలలో విడుదల అయినా ఈ టీజర్స్ కి అక్కడి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ అల్లూరి సీత రామ రాజు టీజర్ ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వని సంగతి మన అందరికి తెలిసిందే, కానీ ఎన్టీఆర్ కొమరం భీం టీజర్ మాత్రం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది, ఈ టీజర్ చివర్లో ఎన్టీఆర్ ముస్లిం గెటప్ లో కనపడడమే ఇందుకు కారణం, కొమరం భీం అనే యోధుడు ఆది వాసీయుల కోసం నిజాం ప్రభువు అరాచకాల పై పోరాడిన వీరుడు, అతని మతం హిందుత్వం, కానీ టీజర్ లో ముస్లిం గా చూపించి చరిత్రని వక్రీకరించి ప్రయత్నం చేస్తున్నారు రాజమౌళి, ఆలా చేస్తే మేము చూస్తూ ఊరుకోము అంటూ కొమరం భీం అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఇది ఇలా ఉండగా ఇప్పుడు తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజీవ్ కూడా రాజమౌళి పై తీవ్రమైన విమర్శలు చేస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం గా మారింది, ఆయన ఏమి మాట్లాడాడో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

ఆయన మాట్లాడుతూ ‘ రాజమౌళి అనే దర్శకుడు కొమ్మరం భీం ని కించపరుస్తూ సినిమా తీస్తున్నాడు, ఆది వాసీయుల కోసం ఆయన పోరాడిన తీరుని వక్రీకరిస్తే రాజమౌళి నిన్ను నది రోడ్డు మీద నిలబెట్టి కొడతాం, దమ్ము ఉంటే ఆ సినిమాని విడుదల చెయ్యి ,తెలంగాణ బిడ్డల దెబ్బ ఎలా ఉంటుందో నీకు రుచి చూపిస్తా , నీ సినిమా ఆడే థియేటర్స్ అన్ని పగలకొడతాం, చరిత్ర ని వక్రీకరించే సాహసం చేసే దమ్ము ఉంటే , నిజాం ప్రభువు ఫోటో కి దందా వేసి తియ్యి సినిమాని ,అప్పుడు మేము ఏంటో చూప్పిస్తాం నీకు, కొమరం భీం లాంటి మహా వ్యక్తి జీవితం ని వక్రీకరించి సినిమా తీస్తుంటే ప్రశ్నించే ధైర్యం టీ ఆర్ ఎస్ పార్టీ కి కాంగ్రెస్ పార్టీ కి లేదు ,సిగ్గు లేదు మీకు’ అంటూ బండి సంజీవ్ రాజమౌళి పై తీవ్రమైన విమర్శలు చేసాడు, అయితే రాజమౌళి ఈ సినిమా ప్రారంభం రోజే ఒక్క విలేకరి అడిగిన ప్రశ్నకి సమాధానం ఇచ్చాడు, ఆయన అప్పట్లో మాట్లాడుతూ ‘ కొమరం భీం అప్పట్లో నిజాం ప్రభువుపై పోరాడాడు , నిజాం ప్రభువు ముస్లిం, అంటే ముస్లిమ్స్ మీద పోరాడినట్టా? అల్లూరి సీత రామ రాజు 40 ఏళ్ళు మన దేశాన్ని పట్టి పీడిస్తున్న బ్రిటిష్ వాళ్లపై పోరాడాడు, బ్రిటిష్ వాళ్ళు క్రిస్టియన్స్, అంటే అల్లూరి సీత రామ రాజు క్రిస్టియన్స్ మీద ఫైట్ చేసినట్టా, మతాల పేరు తో అల్లకల్లోల సృష్టించే వెదవలు ఉంటారు, వాళ్ళ కోసం అని మనం కథ చెప్పడం మానేస్తామా’ అంటూ అప్పట్లోనే సమాధానం ఇచ్చారు రాజమౌళి, కానీ కొమరం భీం అభిమానులు మాత్రం వాళ్ళ పాయింట్ మీద స్టిక్ అయ్యి ఇప్ప్పటికీ ఆర్ ఆర్ ఆర్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు,మరి ఈ వివాదానికి రాజమౌళి ఎలా తెర దింపుతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Movie News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

హీరో రానా ఎమోషనల్ గా మాట్లాడిన ఈ మాటలు వింటే కన్నీళ్లు ఆపుకోలేరు

తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫామిలీ నుండి ఇండస్ట్రీ కి వచ్చినప్పట…