
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన సర్కారు వారి పాట సినిమా ఇటీవలే విడుదల అయినా సంగతి మన అందరికి తెలిసిందే..భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ వచ్చింది..కోస్తాంధ్ర లో మంచి ఓపెనింగ్ వచ్చినప్పటికీ, నైజం మరియు సీడెడ్ ప్రాంతాలలో ఈ సినిమా వసూళ్లు ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపోయ్యేలా చేసింది..ఎందుకంటే ఇటీవల కాలం లో భారీ అంచనాల నడుమ ఒక్క సినిమా విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ ఆశించిన స్థాయి వసూళ్లు రాకపోవడమే..దానికి కారణం తెలంగాణ ప్రాంతం లో మితిమీరిన టికెట్ రేట్స్ పెట్టడమే..దీని వాళ్ళ తెలంగాణ క్రింద ప్రాంతాలలో ఈ సినిమాకి మొదటి రోజే దారుణమైన ఆక్యుపెన్సీలు వచ్చాయి..కానీ ఇప్పుడు ఈ చిత్ర నిర్మాతలు ఇటీవల విడుదల చేసిన మొదటి రోజు వసూళ్లు ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీ కి దారి తీశాయి..ముఖ్యంగా నైజం ప్రాంతం లో ఈ చిత్రానికి మొదటి రోజు వేసిన వసూళ్లు మొత్తం ఫేక్ అని నెటిజెన్ల సర్కారు వారి పాట ప్రొడ్యూసర్స్ ని ట్యాగ్ చేసి విమర్శలు చేస్తున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా నైజం బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సషనల్ ఓపెనింగ్ ని దక్కించుకుంది..ఈ చిత్రం హైదరాబాద్ సిటీ నుండి నైజం మారు మూల ప్రాంతం వరుకు నూటికి నూరు శాతం ఆక్యుపెన్సీ తో అద్భుతమైన వసూళ్లను దక్కించుకొని అల్ టైం డే 1 రికార్డు గా నిలిచింది..ఇప్పటి వరుకు ఈ రికార్డు ని RRR మినహా ఏ సినిమా కూడా బ్రేక్ చెయ్యలేకపోయింది..మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా ఈ రికార్డు ని అతి తేలికగా దాటేస్తుంది అని అందరూ అనుకున్నారు..దానికి కారణం కూడా లేకపోలేదు..ఎందుకంటే భీమ్లా నాయక్ సినిమా 295 టికెట్ రేట్స్ తో విడుదల అయితే, సర్కారు వారి పాట సినిమా ఏకంగా 345 టికెట్ రేట్స్ తో విడుదల అయ్యింది..345 రూపాయిలు పెడితే రికార్డు వస్తుంది అనుకున్నారు కానీ , ప్రేక్షకులు అంత పెట్టి చూసేందుకు సిద్ధంగా లేరు అనే విషయాన్నీ అంచనా వేయలేకపోయారు ఆ చిత్ర నైజం ప్రాంత డిస్ట్రిబ్యూటర్స్..నైజం రురల్ ప్రాంతాలలో భీమ్లా నాయక్ సినిమాకి ఏ మాత్రం పోటీ ఇవ్వకపోయినప్పటికీ కూడా ఈ సినిమాకి మొదటి రోజు 12 కోట్ల రూపాయలకు పైగా వచ్చింది అని నిర్మాతలు ఒక్క పోస్టర్ ని విడుదల చేసారు.
కానీ వాస్తవ వసూళ్లు ఈ సినిమాకి వచ్చింది కేవలం 8 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ మాత్రమే అని ఒక్క ప్రముఖ వెబ్ సైట్ పోస్ట్ చెయ్యడం తో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యారు..ప్రొడక్షన్ టీం నుండే నేరుగా ఫేక్ కలెక్షన్స్ వెయ్యడం నిజంగా విచారకమని..ఇది ఇరువురి హీరోల అభిమానుల మధ్య చిచ్చు పెట్టె చర్య అంటూ నెటిజెన్ల పెదవి విరుస్తున్నారు..సోషల్ మీడియా లో ట్రోలింగ్స్ పెరిగిపోతూ ఉన్న సమయం లో అగ్ని కి ఆజ్యం పోస్తునట్టు సర్కారువు పాట చిత్రం టీం పవన్ కళ్యాణ్ అభిమానులను గిల్లినట్టు విడుదల చేసిన ఒక్క వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది..అంతే కాకుండా పవన్ కళ్యాణ్ అభిమానులు చేసిన ట్రోల్ల్స్ కొన్ని జాతీయ మీడియా సంస్థలు కూడా తమ చానెల్స్ లో ప్రత్యేకమైన స్టోరీ లు టెలికాస్ట్ చెయ్యడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం..ప్రస్తుతం అయితే సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ ఫాన్స్ మరియు మహేష్ బాబు ఫాన్స్ మధ్య పెద్ద యుద్ధమే నడుస్తుంది..చూడాలి మరి ఈ ఫ్యాన్ వార్స్ ఎప్పటికి ఆగుతుందో అనేది.