
అక్కినేని నాగచైతన్య తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత పూర్తిగా సినిమాలపైనే చైతూ దృష్టి సారించాడు. టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ఇటీవల చైతూ మెరిశాడు. అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాలో ఓ కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ సినిమా నిరాశపరిచినా చైతూకు పెద్దగా నష్టం కలగలేదు. అయితే ఈ సినిమా ప్రమోషన్‌లలో చైతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తనను ఒకసారి హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారని.. రైల్వే స్టేషన్ వద్ద కారులో బ్యాక్ సీటులో కూర్చుని తన ప్రియురాలిని ముద్దుపెట్టుకుంటున్నప్పుడు పోలీసులు పట్టుకున్నారని నాగచైతన్య ఓపెన్ అయ్యాడు. కారులో ప్రియురాలితో రొమాన్స్ చేస్తున్నప్పుడు భయం వేయలేదా అని నాగ చైతన్యను యాంకర్ అడగ్గా.. ఈ ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. అంతా బాగానే ఉంది కానీ పోలీసులకు పట్టుబడినట్లు చైతూ వివరించాడు. అయితే ఆ ప్రియురాలు ఎవరో మాత్రం చెప్పలేదు.
అయితే చైతూ ప్రియురాలు ఎవరు అని సోషల్ మీడియాలో నెటిజన్‌లు తెగ చర్చించుకుంటున్నారు. బహుశా కాలేజ్ లవర్ అయి ఉండవచ్చని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం చైతూ రెండోపెళ్లి చేసుకుంటాడని తెగ రూమర్లు వినిపిస్తున్నాయి. కెరీర్ మంచి దశలో ఉన్న టైంలోనే సమంతను నాగచైతన్య ప్రేమించి పెద్దల సమక్షంలో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఏ మాయ చేశావె సినిమాతో ప్రేమించుకున్న ఈ జంట నాలుగేళ్లు సజావుగానే సాగిన వీరి సంసారంలో మనస్పర్ధలు ఏర్పడి గత ఏడాది అక్టోబర్ నెలలో విడాకులు తీసుకుంటున్నట్టు సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ ప్రకటించారు. ఆ తర్వాత ఎవరి లైఫ్‌లో వాళ్లు బిజీగా మారిపోయారు. సమంత తన లైఫ్‌ను బిందాస్‌గా ఎంజాయ్ చేస్తోంది. వరుస బెట్టి సినిమాలు చేస్తూ అటు బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్‌లో దుమ్మురేపుతోంది. ఇక చైతూ కూడా తన వర్క్ విషయంలో గుట్టుచప్పుడు కాకుండా మూవీస్ ఫినిష్ చేస్తున్నాడు. అయితే లాల్ సింగ్ చద్దా మూవీ నెపోటిజంకు గురవడంపై చైతూ అసహనం వ్యక్తం చేశాడు. సౌత్‌లో కూడా ఇలాంటివి జరగడం విడ్డూరంగా కనిపిస్తుందన్నాడు. అసలు నెపోటిజం ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందో అర్ధం కావడం లేదన్నాడు.
అటు నాగ చైతన్య సుప్రసిద్ధ లగ్జరీ, లైఫ్‌స్టైల్ మ్యాగజైన్ మెన్స్ వరల్డ్ ఇండియా సెప్టెంబర్ 2022 సంచిక ముఖచిత్రంగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ మ్యాగజైన్ కవర్ ఫోటోలో మెన్ ఆఫ్ ప్లాటినమ్ కలెక్షన్‌ను ధరించి ఎంతో స్టైలుగా కనిపిస్తున్నాడు. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. నాగచైతన్య మరోసారి సమంతతో కలిసి నటిస్తాడని ప్రచారం సాగుతోంది. ఏమాయ చేశావె, ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ వంటి సినిమాలతో హిట్ పెయిర్ అనిపించుకున్న ఈ జంటతో దర్శకుడు గౌతమ్ మీనన్ ఓ సినిమా తీసేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది. గౌతం మీనన్ ఇప్పటికే సమంతతో మాట్లాడాడని.. సమంత నాగచైతన్యతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉందని టాక్ వినిపిస్తుంది. గతంలో నాగచైతన్యకు ఇదే ప్రశ్న ఎదురైంది. భవిష్యత్తులో సమంతతో కలిసి నటిస్తారా అంటే.. ఆ టైం ప్రకారం నిర్ణయం తీసుకుంటానని .. నో అయితే చెప్పనని నాగచైతన్య చెప్పుకొచ్చాడు. మరి ఇప్పుడు గౌతమ్ మీనన్ సినిమలో వీళ్లిద్దరూ నటిస్తారా లేదా అన్న విషయం చర్చనీయాంశంగా మారింది.