Home Entertainment ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న సమంత కి జూనియర్ ఎన్టీఆర్ చేయూత..వైరల్ అవుతున్న వీడియో

ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న సమంత కి జూనియర్ ఎన్టీఆర్ చేయూత..వైరల్ అవుతున్న వీడియో

0 second read
0
0
405

టాలీవుడ్ అగ్ర హీరోయిన్‌గా చెలామణి అవుతున్న సమంత షాకింగ్ న్యూ్స్ చెప్పింది. తాను ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు శనివారం నాడు వెల్లడించింది. యశోద ట్రైలర్‌కు వచ్చిన ఇచ్చిన రెస్పాన్స్ చూసి సంతోషంగా ఉందని తెలుపుతూ తన వ్యాధి గురించి వివరంగా చెప్పింది. తనకు మయోసిటిస్‌ అనే వ్యాధి సోకిందని సమంత చెప్పింది. ఈ మేరకు చేతికి సెలైన్ ఎక్కించుకుంటున్న ఫొటోను వెనుక నుంచి చూపిస్తూ తన వ్యాధి గురించి తెలిపింది. దీంతో సినిమా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మయోసిటిస్ అనే వ్యాధి ప్రాణాంతకం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మయోసిటిస్ అనే వ్యాధి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. అసలు ఈ వ్యాధి గురించి చాలా మందికి తెలియడం లేదు. దీంతో ఈ వ్యాధి అంటే ఏంటని పలువురు కామెంట్లు పెడుతున్నారు. అయితే సమంతకు అరుదైన వ్యాధి సోకిందన్న వార్తను క్షణాల్లోనే మీడియా ప్రసారం చేయడంతో సెలబ్రిటీలు స్పందిస్తున్నారు.

ఈ క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలుత స్పందించాడు. సమంత ధైర్యంగా ఉండాలంటూ ఎన్టీఆర్ ఆకాంక్షించాడు. గెట్ వెల్ సూన్ సామ్.. సెండింగ్ యూ ఆల్ ది స్ట్రెంత్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. గతంలో ఎన్టీఆర్, సమంత కలిసి నాలుగు సినిమాల్లో నటించారు. బృందావనం, రభస, రామయ్య వస్తావయ్యా, జనతా గ్యారేజ్ లాంటి సినిమాల్లో వీళ్లిద్దరూ కలిసి నటించారు. పలువురు సెలబ్రిటీలు కూడా సమంత త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. మయోసిటిస్ వ్యాధి గురించి కొందరు వైద్యులు చెప్తున్న సమాచారం ప్రకారం ఇది చర్మ వ్యాధి అని తెలుస్తోంది. ఈ వ్యాధిని దీర్ఘకాలిక కండరాల వాపు అని కూడా అంటారని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఈ వ్యాధి సోకిన వారికి కండరాల నొప్పులు విపరీతంగా ఉంటాయని.. చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేరని అంటున్నారు. చిన్న పనులు చేస్తేనే వెంటనే నీరసించి పోవడం, క్షణాల్లో అలసిపోవడం, ఉన్నట్టుండి కింద పడిపోవడం లాంటి లక్షణాలు ఈ వ్యాధి కలిగి ఉంటుందని పలువురు వైద్యులు చెప్తున్నారు.

అటు సమంత ఆరోగ్యంపై నేచురల్ స్టార్ నాని కూడా స్పందించాడు. సమంత ఎప్పటిలాగే బలంగా పుంజుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోరు అంటూ నాని ట్వీట్ చేశాడు. మయోసిటిస్ వ్యాధి లక్షణాల గురించి ఆరా తీస్తే కూర్చున్న స్థానం నుంచి నిలబడటం కష్టంగా ఉంటుందని.. మెట్లు ఎక్కడం కష్టతరంగా మారుతుందని.. చేతులు ఎత్తడం కూడా కష్టంగా ఉంటుందని.. ఎక్కువసేపు నిలబడినా, నడిచినా అలసిపోతారని.. ఆహారాన్ని మింగడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారని.. కనురెప్పలు, మోచేతులు, మోకాలు, పిడికిలిపై ఎరుపు లేదా ఊదారంగులో దద్దుర్లు వస్తాయని వైద్యులు వెల్లడించారు. అయితే మయోసైటిస్ వ్యాధి ఎక్కువగా చిన్నపిల్లలు, మహిళల్లో సోకుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి మూడు రకాలుగా ఉంటుందని.. అయితే సమంతకు సోకినది ఏ తరహా మయోసిటిస్ అన్నది తెలియాల్సి ఉంది. పెళ్లి విఫలం అయిన దగ్గర నుంచి సమంత పరిస్థితి ఏమంత బాగా లేదు. విపరీతంగా నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. దానికి తోడు ఇప్పుడు ఈ వ్యాధి చూస్తుంటే సమంత టైమ్ బాగోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆమె శాకుంతలం, యశోద, ఖుషి వంటి సినిమాల్లో నటిస్తోంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…