Home Entertainment ప్రాణం పోయిన అలాంటి పని చెయ్యను అంటూ సంచలన కామెంట్స్ చేసిన కీర్తి సురేష్..వైరల్ అవుతున్న వీడియో

ప్రాణం పోయిన అలాంటి పని చెయ్యను అంటూ సంచలన కామెంట్స్ చేసిన కీర్తి సురేష్..వైరల్ అవుతున్న వీడియో

0 second read
0
0
150

మహానటి సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. మలయాళం సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ తెలుగులో రామ్ నటించిన నేను శైలజ మూవీతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత నేను లోకల్, అజ్ఞాత వాసి సినిమాలతో వరుస అవకాశాలను సంపాదించింది. కానీ మహానటి సినిమా ఒక్కసారిగా కీర్తి సురేష్‌ను ఎక్కడికో తీసుకువెళ్లి కూర్చోబెట్టింది. సావిత్రినే మైమరిపించేలా ఈ సినిమాలో కీర్తి నటించి అందరి ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ తర్వాత కీర్తి సురేష్ వెనుతిరిగి చూసుకోలేదు. పలు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ అవకాశాలు సాధించింది. పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి వంటి సినిమాల్లో నటించింది. అయితే ఈ సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. అయినా కీర్తిలో దూకుడు మాత్రం తగ్గలేదు. అగ్రహీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలను అంగీకరిస్తూ ముందుకు సాగుతోంది.

ప్రస్తుతం కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే.. ఆమె తాజాగా ఓ సినిమాను రిజెక్ట్ చేసిందనే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌కు అవకాశం వచ్చిందని.. అయితే ఈ సినిమాను ఆమె రిజెక్ట్ చేసిందనే వార్తలు గుప్పుమన్నాయి. ఎన్టీఆర్ సినిమాను తిరస్కరించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ నందమూరి అభిమానులు కీర్తిని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. దీంతో కీర్తి సురేష్ తనపై వస్తున్న వార్తల పట్ల స్పందించింది. అసలు బుద్ధి ఉన్న వాళ్లు ఎన్టీఆర్‌తో సినిమా అవకాశం వస్తే వదులుకుంటారా అంటూ ప్రశ్నించింది. తానే కాదు ఏ హీరోయిన్ కూడా ఈ అవకాశాన్ని విడిచిపెట్టే అవకాశమే లేదని కీర్తి సురేష్ స్పష్టం చేసింది. ఇలాంటి చెత్త రూమర్స్‌ ఎవరు క్రియేట్ చేస్తారంటూ అసహనం వ్యక్తం చేసింది. తనకు ఎన్ని సినిమాలు ఉన్నా ఎన్టీఆర్‌తో నటించే అవకాశం వస్తే వదులుకునే ప్రసక్తే లేదని చెప్పింది.

అటు కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌ రోల్‌కు మంచి ప్రాధాన్యత ఉందని ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ పాత్రకు తొలుత రష్మిక మందన్నను పరిశీలించారని.. కానీ ఆమె సెట్ కాలేదని తెలుస్తోంది. చివరకు చాలా మందిని పరిశీలించిన టీమ్ చివరకు కీర్తి సురేష్‌కు అవకాశం ఇవ్వాలని భావించినట్లు టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆర్.ఆర్.ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి సినిమాను చెక్కుతున్నాడు. ఆచార్యకు ముందు తనకు అన్ని హిట్ సినిమాలే ఉన్నా ఒక్క సినిమాతో తన ఇమేజ్‌ను కొరటాల డ్యామేజ్ చేసుకున్నాడు. దీంతో ఎన్టీఆర్‌తో సినిమాతో బౌన్స్ బ్యాక్ కావాలని కొరటాల గట్టిగా ప్రయత్నిస్తున్నాడు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

బ్రేకింగ్ : శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తో విజయ్ దేవరకొండ పెళ్లి..వైరల్ అవుతున్న ఫోటోలు

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు చాలా క్రేజ్ ఉంది. ఇటీవల లైగర్ సినిమాతో బాలీవుడ్‌లోనూ ప…