
గత ఏడాది నుండి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా కొనసాగుతున్న విషయం సమంత – నాగ చైతన్య విడాకుల వ్యవహారం..ఎప్పుడూ వివాదాలకు పూర్తిగా దూరంగా ఉండే నాగ చైతన్య విడాకుల కారణం గా గాసిప్స్ కి రూమర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాడు..కానీ ఎన్ని రూమర్స్ వచ్చినా కూడా ఏ మాత్రం స్పందించకుండా తనపని ఎదో తానూ చేసుకుంటూ ముందుకి పోతున్నాడు..అప్పట్లో నాగ చైతన్య ప్రముఖ హీరోయిన్ రాశి ఖన్నా తో ప్రేమలో పది డేటింగ్ లో ఉన్నాడని..త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఇలా పలు రకాల వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి..కానీ నాగ చైతన్య అప్పట్లో దేనికి కూడా స్పందించలేదు..ఇక ఇటీవల కాలం లో ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల తో నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి..ఈ వార్త అయితే ఏకంగా నేషనల్ మీడియా లో కూడా ప్రసారం అయ్యింది..అయితే తన పై తరచు వస్తున్న రూమర్స్ పై నాగ చైతన్య ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ తనదైన శైలిలో సమాధానం చెప్పాడు.
ఇక అసలు విషయానికి వస్తే నాగ చైతన్య మరియు రాశి ఖన్నా హీరోహీరోయిన్లు గా మనం ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన థాంక్యూ అనే సినిమా ఈ నెల 22 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..నాగ చైతన్య మరియు రాశి ఖన్నా కాంబినేషన్ వస్తున్న రెండవ సినిమా ఇది..గతం లో వీళ్లిద్దరు కలిసి వెంకీ మామ అనే సినిమాలో నటించారు..ఇక విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన అక్కినేని ముల్టీస్టార్ర్ర్ మనం సినిమా లో కూడా రాశి ఖన్నా ఒక చిన్న పాత్రలో కనిపిస్తుంది..ఇది పక్కన పెడితే మరో పది రోజుల్లో వీళ్లిద్దరు కలిసి నటించిన థాంక్యూ సినిమా విడుదల కాబోతుండడం తో ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా గడుపుతున్నారు..ఈ ప్రొమోషన్స్ లో భాగంగానే వీళ్లిద్దరు జంటగా కలిసి చాలా ఇంటర్వూస్ లో పాల్గొన్నారు..ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ నాగ చైతన్య ని ప్రశ్న అడుగుతూ ‘మీ ఇద్దరి పెయిర్ చాలా క్యూట్ గా ఉంది..చాలా క్లోజ్ గా ఉన్నారు కూడా..సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నట్టే మీరిద్దరూ నిజంగా లవర్స్ యేనా..డేటింగ్ లో ఉన్నారా’ అని అడిగేసింది.
దీనికి నాగ చైతన్య నవ్వుతూ సమాధానం చెప్తూ ‘అవును మేమిద్దరం డేటింగ్ లో ఉన్నాము..త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము కూడా..మొన్ననే మరో హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాను అన్నారు..ఆ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోబోతున్నాను..ఇలా మీరు మీడియా పుట్టించే ప్రతి పుకారు లో ఉన్న అమ్మాయిని చేసుకుంటూ పోతూనే ఉంటాను..మీకు ఏమైనా సమస్యనా..సోషల్ మీడియా లో రోజుకి ఇలాంటి రూమర్స్ పుట్టుకొస్తూనే ఉంటాయి..నేను వాటిని అసలు పట్టించుకోను..మీరు కూడా పట్టించుకోకుండా కేవలం సినిమా గురించి మాత్రమే మాట్లాడండి’ అంటూ నాగ చైతన్య సమాధానం ఇచ్చాడు..ఆయన సమాధానం విన్న యాంకర్ ఒక్కసారిగా షాక్ కి గురైంది..ఇక థాంక్యూ సినిమా విషయానికి వస్తే మనం సినిమా తర్వాత నాగ చైతన్య విక్రమ్ కె కుమార్ తో కలిసి చేస్తున్న సినిమా ఇదే..అక్కినేని ఫామిలీ కి జీవితాంతం గుర్తుండిపోయ్యే రేంజ్ సినిమాని ఇచ్చిన విక్రమ్ కె కుమార్ నుండి వస్తున్న చిత్రం కావడం తో కచ్చితంగా ఈ సినిమా కూడా బాగా ఆడుతుంది అని అక్కినేని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు..టీజర్ మరియు ట్రైలర్ కూడా అదిరిపోవడం తో కచ్చితంగా హిట్టు అయిపోతుందని ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి..చూడాలి మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందా లేదా అనేది.