Home Entertainment ప్రముఖ స్టార్ హీరో పై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ పూజా హెగ్డే

ప్రముఖ స్టార్ హీరో పై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ పూజా హెగ్డే

0 second read
0
0
4,082

సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ప్రస్తుతం ఒక్క రేంజ్ డిమాండ్ మరియు క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లో ఒక్కరు పూజ హెగ్డే..ప్రస్తుతం ఈమె నెంబర్ 1 హీరోయిన్ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..అన్ని ప్రాంతీయ బాషల స్టార్ హీరోలకు ఇప్పుడు వాళ్ళ సినిమాలలో హీరోయిన్ గా పూజ హెగ్డే ని కావాలి అంటున్నారు అంటే ఆమెకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు..ఇప్పుడు ఆమె కేవలం సౌత్ ఇండియా ని మాత్రమే కాదు..నార్త్ ఇండియా ని ఎలేయబోతుంది..బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ హీరో గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కభీ ఈద్ కభీ దీవాలి’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది..ఈ సినిమా ఆమెకి బాలీవుడ్ లో మూడవ సినిమాగా చెప్పుకోవచ్చు..ఇప్పటి వరుకు ఆమె బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో మోహెన్ జోదారో..అక్షయ్ కుమార్ తో హౌస్ ఫుల్ 4 వంటి సినిమాలలో నటించింది..ఇప్పుడు సల్మాన్ ఖాన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది..ఇలా బాలీవుడ్ లో కూడా ఈమె ఇప్పటి వరుకు వరుసగా స్టార్ హీరోల సరసనే నటిస్తూ ముందుకు దూసుకుపోతుంది.

ఇది ఇలా ఉండగా సల్మాన్ ఖాన్ సినిమా షూటింగ్ లో పాల్గొని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయం లో పూజ హెగ్డే తనకి ఎదురు అయిన ఒక్క అనుకోని సంఘటన గురించి సోషల్ మీడియా లో టాగ్ చేస్తూ భయంకరమైన ఆరోపణలు చేసింది..ఎప్పుడూకూడా ఎంతో ఎనర్జీ తో ఉల్లాసవంతమైన పోస్టులు మరియు ఫోటోలను అప్లోడ్ చేసే పూజ హెగ్డే ని అంత ఆవేశం గా చూసేసరికి ఒక్కసారిగా అభిమానులు షాక్ కి గురి అయ్యారు..ఇంతకీ ఆమెకి ఎదురు అయిన ఆ చేదు అనుభవం ఏంటో ఇప్పుడు మనం చూడబోతున్నాము..అసలు విషయానికి వస్తే పూజ హెగ్డే షూటింగ్ ని పూర్తి చేసుకొని ఫ్లైట్ లో హైదరాబాద్ కి వస్తున్న సమయం లో ఇండిగో ఫ్లైట్ స్టాఫ్ ఆమెతో చాలా అసభ్యం గా ప్రవర్తించాడు అట..తన జీవితం లో ఒక్క మనిషి ఇంతలా అసభ్యంగా ప్రవర్తించలేదు అని..నా మనసు అతని వల్ల చాలా బాధకి గురైంది అంటూ చెప్పుకొస్తూ పూజ హెగ్డే ఆరోపణలు చేసింది..అతని పేరు విఫుల్ నాకాశే అని..అతని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి అంటూ ఇండిగో ఫ్లైట్ సంస్థ వారికి టాగ్ చేసి చెప్పింది పూజ హెగ్డే..వాస్తవానికి ఇలాంటివి చెప్పుకోడానికి నాకు ఇష్టం ఉండదు అని..కానీ మనసుకి చాలా బాధ కలిగిందికాబట్టే చెప్పుకోవాల్సి వస్తుంది అని పూజ హెగ్డే వేసిన ఒక్క ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఇది ఇలా ఉండగా అదే ఫ్లైట్ లో పూజ హెగ్డే తో పాటుగా ఒక్క ప్రముఖ టాలీవుడ్ హీరో కూడా ఉన్నాడట..అంత గొడవ జరుగుతుంటే తనకి ఏమి పట్టనట్టు చూస్తూ కూర్చున్న ఆ హీరో మీద ఉన్న కోపాన్ని పూజ హెగ్డే ఇలా చూపించింది అంటూ ఫిలిం నగర్ లో ఒక్క వార్త వినిపిస్తుంది..ఇక పూజ హెడ్జ్ సినిమాల విషయానికి వస్తే ఇటీవల ఈమె సౌత్ లో ఉన్న టాప్ స్టార్స్ తో నటించిన సినిమాలు అన్ని పెద్ద ఫ్లాప్ గా నిలిచాయి..ఈమె యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో కలిసి నటించిన రాధే శ్యామ్ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఇక ఆ తర్వాత తమిళ స్టార్ హీరో విజయ్ తో కలిసి ఈమె చేసిన బీస్ట్ అనే సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది..నిన్న మొన్నటి వరుకు గోల్డెన్ లెగ్ అని పిలుస్తున్న టాలీవుడ్ పెద్దలు..ఇప్పుడు ఐరన్ లెగ్ అని పిలుస్తున్నారు..ఈ ముద్ర ని పూజ హెగ్డే తన తదుపరి సినిమాలతో చెరిపేస్తుందో లేదో చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…