
తెలుగు బుల్లితెర పై కొంతమంది యాంకర్లకు మరియు కొంతమంది కమెడియన్స్ కి ఏ రేంజ్ లో డిమాండ్ ఉందొ ప్రత్యేకంగా చేపనక్కర్లేదు, ముఖ్యంగా ఈటీవీ లో రిప్రసారం అయ్యే జబర్దస్త్ షో ఎలాంటి సెన్సేషన్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఈ షో ద్వారా కామెడాన్స్ గా వచ్చిన ఎంతో మంది నేడు ఇండస్ట్రీ టాప్ కమెడియన్స్ గా కొనసాగుతున్నారు, కొంతమంది అయితే హీరోలుగా కూడా చేసారు ఇప్పటికి చేస్తూనే ఉన్నారు, ఆలా జబర్దస్త్ నుండి ఇండస్ట్రీ కి వచ్చి స్టార్ కమెడియన్ అయిన నటుడు హైపర్ ఆది, ఈయన వేసే పంచులు మరియు చేసే కామెడీ కి ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చేపనక్కర్లేదు, అదిరే అభి టీం లో ఒక్క కంటెస్టెంట్ గా కెరీర్ ని ప్రారంభించిన హైపర్ ఆది , ఆ తర్వాత టీం లీడర్ గా ఎదిగి ఏ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించాడో మన అందరికి తెలిసిందే, బుల్లితెర నుండి వెండితెర కి వెళ్లి అక్కడ కూడా స్టార్ కమెడియన్ గా స్థిరపడిపొయ్యాడు హైపర్ ఆది,ఇది కాసేపు పక్కన పెడితే హైపర్ ఆది కి సంబంధించిన ఒక్క వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది , అదేమిటో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.
అదేమిటి అంటే హైపర్ ఆది పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతున్న సంగతి మన అందరికి తెలిసిందే, గతం లో ధీ షో ఓ హైర్ ఆడికి జోడిగా ఇచ్చిన యాంకర్ వర్షిణి తో హైపర్ ఆది ప్రేమలో ఉన్నాడు అనే వార్తలు జోరుగా ప్రచారం అయిన సంగతి మన అందరికి తెలిసిందే, అయితే ఇందులో ఎలాంటి నిజం లేదు అని అటు హైపర్ అడ్డు , ఇటు వర్షిణి క్లారిటీ ఇచ్చాడు, ఇది ఇలా ఉండగా ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా ఈటీవీ లో ఒక్క ప్రత్యేకమైన షో ని చేసిన సంగతి మన అందరికి తెలిసిందే, ఈ షో లో హైపర్ ఆది తండ్రి కూడా పాల్గొన్నాడు, తన తండ్రి తో చిన్నపట్టి నుండి చేసిన అల్లరి , అలాగే తన తండ్రి తో తనకి న్నా అనుబంధం ని గుర్తు చేసుకుంటూ హైపర్ ఆది మాట్లాడిన మాటలు అందరిని అలరించాయి, అయితే ఆది పెళ్లి ఎప్పుడు అని ఆ షో కి జడ్జి గా వ్యవహరించిన ఇంద్రజ గారు హైపర్ ఆది తండ్రిని అడగగా ఆయన దానికి సమాధానం చెప్తూ ‘మొన్న ఒంగోలు లో ఒక్క అమ్మాయిని చూసాము, కానీ ఆది చేసుకోను నాకు రెండేళ్ల సమయం కావలి అన్నాడు, దీనితో చేసేది ఏమి లేక మేము కూడా వెయిట్ చేస్తున్నాము’ అంటూ చెప్పుకొచ్చాడు.
అయితే సోషల్ మీడియా లో మాత్రం హైపర్ ఆది ఒక్క ప్రముఖ టీవీ యాంకర్ తో లవ్ లో ఉన్నాడు అని , ప్రసుతం వాళ్లిదరు డేటింగ్ చేస్తున్నారు అని, అందుకే హైపర్ ఆది ఇంట్లో చూసిన సంబంధాలకు ప్రస్తుతం నో చెప్పాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి, కానీ హైపర్ ఆది అటు బుల్లితెర మీద , ఇటు వెండితెర మీద చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు అని , ఇప్పుడు కెరీర్ పీక్ స్థానం లో ఉన్నప్పుడు వెన్తనె పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని హైపర్ ఆది కి చెందిన కొన్ని సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి, మరి యందులో ఎంత వరుకు నిజం ఉంది తెలియాలి, ఇది ఇలా ఉండగా హైపర్ ఆది ప్రస్తుతం ఈటీవీ లో జబర్దస్త్ షో పాటుగా ధీ షో చేస్తున్నాడు , వీటితో పాటు పండగ పూట ఈటీవీ వారు ప్రత్యేకంగా నిర్వహించే షోస్ లో కూడా హైపర్ ఆదిని ప్రధానంగా కనిపిస్తున్నాడు, ఒక్కప్పుడు హైపర్ ఆది తో పాటు సుడిగాలి సుధీర్ కూడా ఇలాంటి షోస్ లో కనిపిస్తూ ఉండేవాడు , కానీ ఇప్పుడు సుధీర్ సినిమాల్లో హీరో గా మరియు స్టార్ కమెడియన్ గా ఫుల్ బిజీ తో ఉన్నాడు, దానితో ఆయన బుల్లితెర కి సరైన సమయం కేటాయించలేకపోవడం తో సుధీర్ షోస్ అన్ని హైపర్ ఆది కి వెళ్లిపోయాయి.