Home Entertainment ప్రముఖ నటుడిపై పబ్లిక్ స్టేజి మీద చెయ్యి చేసుకున్న హీరో విశాల్

ప్రముఖ నటుడిపై పబ్లిక్ స్టేజి మీద చెయ్యి చేసుకున్న హీరో విశాల్

0 second read
0
0
272

తెలుగు మరియు తమిళం బాషలలో మంచి క్రేజ్ మరియు మార్కెట్ సంపాదించుకున్న హీరోలలో ఒకడు విశాల్ రెడ్డి..ప్రముఖ నిర్మాత GK రెడ్డి తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన విశాల్ , తోలి సినిమా ప్రేమ చదరంగం అనే సినిమాతో యావరేజి ఫలితం ని అందుకున్నాడు..ఆ తర్వాత ఈయన ప్రముఖ తమిళ దర్శకుడు లింగు స్వామి తో తీసిన రెండవ చిత్రం ‘పందెం కోడి’ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..తమిళం లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో తెలుగు లో కూడా ఈ సినిమా అదే రేంజ్ హిట్ అయ్యింది..అప్పట్లోనే ఈ సినిమా రెండు భాషలకు కలిపి 30 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది అంటే ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు..తమిళం లో ఈ సినిమా అప్పట్లో 175 కేంద్రాలలో కూడా ఆడింది..విశాల్ ని తెలుగు మరియు తమిళం బాషలలో పెద్ద మాస్ హీరో ని చేసింది ఈ చిత్రం..ఆ తర్వాత విశాల్ నటించిన పొగరు, భయ్యా , భరణి ,పిస్తా,అభిమన్యుడు వంటి సినిమాలు మన తెలుగు లో కూడా భారీ హిట్ గా నిలిచాయి..అప్పట్లో విశాల్ సినిమాలు తెలుగు లో కూడా స్టార్ హీరో రేంజ్ హైప్ తో విడుదల అయ్యేవి..అయితే గత కొంత కాలం నుండి ఆయనకీ సరైన హిట్ లేదు.

అయితే ఇప్పుడు ఆయన తెలుగు మరియు తమిళ బాషలలో కలిపి ‘లాఠీ’ అనే సినిమా చేసాడు.ఈ చిత్రానికి వినోద్ కుమార్ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించాడు..బలమైన కథాంశం తో తెరకెక్కిన ఈ చిత్రం పై విశాల్ చాలా ఆశలే పెట్టుకున్నాడు..ఈ సినిమా కోసం ఆయన ఎన్నో రిస్క్ స్తంట్స్ కూడా చేసి ప్రాణాల మీదకి కూడా తెచ్చుకున్నాడు..దాదాపుగా నాలుగు సార్లు ఆయన ఆసుపత్రి పాలయ్యారు ఈ సినిమా కోసం..అంత ప్రాణం పెట్టి చేసిన ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతుంది..పందెం కోడి సినిమా తన కెరీర్ లో ఎలాంటి ల్యాండ్ మార్క్ సినిమాగా నిలిచిందో ఈ లాటి అనే సినిమా కూడా విశాల్ కెరీర్ లో అలాంటి ల్యాండ్ మార్క్ సినిమాగా నిలబడబోతుంది అట..ఇది ఇలా ఉండగా ఇటీవలే ఈ సినిమాకి సమ్బనించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తమిళనాడు లో ఘనంగా చేసాడు విశాల్..ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా గురించిన విశేషాలు చెప్పుకొచ్చాడు..అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ నటుడు ‘రోబో శంకర్’ పై ఆయన స్టేజి మీదనే చెయ్యి చేసుకోవడం వివాదాలకు దారి తీసింది.

రోబో శంకర్ తమిళనాడు లో పెద్ద కమెడియన్..1999 వ సంవత్సరం నుండి ఆయన ఇండస్ట్రీ లో ఉన్నాడు..ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో కమెడియన్ గా నటించి అద్భుతమైన కామెడీ ని పండించారు..ఇక హీరో విశాల్ కి బాగా కలిసి వచ్చిన కమెడియన్ ఈయనే..ఇప్పటి వరుకు వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ పెద్ద హిట్ అని చెప్పుకోవచ్చు..ముఖ్యంగా 2018 వ సంవత్సరం లో విడుదలైన అభిమన్యుడు సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఇప్పుడు వీళ్లిద్దరు కలిసి ఈ లాఠీ సినిమాలో కూడా నటించారు..అయితే స్టేజి మీద నిన్న ఆయన మాట్లాడుతూ ‘ విశాల్ గారు మీరు తమిళం లో ఎంతో మంది ఆర్టిస్టులతో కలిసి నటించారు..అందరితో ఎంతో బాగుంటారు..ఏదైనా ఈవెంట్ కి కూడా ఆహ్వానించేటప్పుడు ఎంతో ప్రేమతో పిలుస్తారు..కానీ నన్ను మాత్రం ఎదో రా అంటే రా అన్నట్టు మొక్కుబడిగా పిలుస్తారు..ఇది కరెక్ట్ కాదండి’ అంటూ రోబో శంకర్ మాట్లాడడం తో విశాల్ కి కోపం వచ్చి స్టేజి మీదనే రోబో శంకర్ పై రెండు సార్లు చెయ్యి చేసుకుంటాడు..ఇది నిజం ఏమో అనుకోని అక్కడే స్టేజి మీదున్న సూరి కిందకి వెళ్ళిపోతూ ఉంటాడు..అప్పుడు విశాల్ నవ్వుతు అతనిని పిలిచి ఇది కేవలం మేము చేస్తున్న ప్రాంక్..ఇది మాకు అలవాటే..కాసేపు నిన్ను మరియు ఆడియన్స్ ని టెన్షన్ పెట్టేందుకు చేసాము అని చెప్పడం తో ఒక్కసారిగా సందడి వాతవరణం గా మారిపోయింది..ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారిపోయింది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

బ్రేకింగ్ : విడాకులు తీసుకున్న నిహారిక కొణిదెల – చైతన్య..గుండెలు పగిలేలా ఏడుస్తున్న నాగబాబు

ఈమధ్య కాలం లో సెలెబ్రిటీలు విడాకులు తీసుకోవడం సర్వసాధారణం అయిపోయింది.సమంత – నాగ చైతన…