
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పుడు వరుసగా హీరోలందరూ ఒక్కరి తరువాత ఒక్కరు పెళ్లి పీటలు ఎక్కుతున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఇన్ని సంవత్సరాలు వేచి ఉంది కరెక్ట్ గా కరోనా సమయం లో వీళ్ళందరూ పెళ్లి పీటలు ఎక్కడం విశేషం అని చెప్పొచ్చు, ముఖ్యంగా అభిమానులందరూ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న రానా దగ్గుపాటి పెళ్లి కూడా ఇటీవలే బందు మిత్రుల సమక్షం లో పెళ్లి చేసుకున్నాడు, అలాగే రానా తర్వాత మరో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నితిన్ కూడా ఇటీవలే పెళ్లి చేసుకొని తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బాయ్ చెప్పాడు, ఇక మరో యువ హీరో నిఖిల్ కూడా పెళ్లి కూడా ఈమధ్యనే చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఇకమెగా ఫామిలీ కుటుంబం నుండి నిహారిక కొణిదెల కూడా ఇటీవలే నిశ్చితార్థం చేసుకొని ఈ ఏడాది డిసెంబర్ లో పెళ్లి పీటలు ఎక్కబోతుంది, ఇక వీళ్ళందరి తో పాటు మరో క్రేజీ యువ హీరో కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు సమాచారం ,అతను ఎవరో కాదు అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ.
విజయ్ దేవర కొండ చాలా కాలం నుండి మన టాలీవుడ్ లో ఇప్పుడు టాప్ హీరోయిన్ గా చలామణి అవుతున్న రష్మిక మందాన తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్నా సంగతి మన అందరికి తెలిసిందే, వీళ్లిద్దరు కలిసి తొలిసారిగా గీత గోవిందం అనే సినిమాలో నటించారు, ఈ సినిమా షూటింగ్ సమయం లోనే వీళ్లిద్దరు లవ్ లో పడ్డారు అని ,డేటింగ్ కూడా చేస్తున్నారు అని వార్తలు జోరుగా షికార్లు చేసాయి, అయితే దీనిలో ఎలాంటి నిజం లేదు అని, మేము కేవలం మంచి మితులం మాత్రమే అని రష్మిక అనేక ఇంటర్వ్యూలలో తెలిపారు, కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఈ వార్తలపై ఎక్కడ కూడా పెదవి విప్పలేదు, దీనితో వస్తున్నా ఈ రూమర్స్ నిజమే అనడానికి కారణాలు బలపడ్డాయి, అయితే ఇటీవల విడుదల అయినా ఒక్క ఫోటో సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం అవుతూ వస్తున్నా రూమర్స్ ని బలపరిచేలా చేస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా ఇటీవల కాలం లో రష్మిక మండన ఎక్కువగా విజయ్ దేవరకొండ ఫామిలీ తోనే ఉండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది, సోషల్ మీడియా లో లీక్ అయినా ఒక్క ఫోటో లో రష్మిక మండన ఫామిలీ మరియు విజయ్ దేవరకొండ ఫామిలీ కలిసి ఉన్న ఫోటో మీరు ఎక్సక్లూసివ్ గా క్రింద చూడవచ్చు, ఈ ఫొటోలో విజయ్ దేవరకొండ బంధువులతో కలిసి రష్మిక మండన ని మీరు చూడవచ్చు, అయితే ఒక్కపుడు సోషల్ మీడియా లో కేవలం రూమర్స్ గా ఉన్న ఈ వార్త త్వరలో నిజం అయ్యే అవకాశాలు ఉన్నాయి అని ఫిలిం నగర్ లో గట్టిగ వినిపిస్తున్న వార్త, మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగాల్సిందే, రష్మిక కి గతం లో కన్నడ హీరో రక్షిత్ తో నిశ్చితార్థం అయ్యి కొన్ని కారణాల వాళ్ళ పెళ్లి క్యాన్సిల్ అయినా సంగతి మన అందరికి తెలిసిందే, ఇప్పుడు ఆమె విజయ్ దేవరకొండ తో ప్రేమలో ఉన్న వార్త ఎంత మాత్రం నిజమో అతి త్వరలోనే అధికారికంగా తెలియనుంది.