
టాలీవుడ్ లో కామెడీ హీరోలు అంటే మనకి ముందుగా గుర్తుకు వచ్చే పేర్లు రాజేంద్ర ప్రసాద్ మరియు నరేష్..నరేష్ తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి తనకంటూ ఒక్క ప్రత్యేకమైన మార్కుని ఏర్పరచుకున్నాడు..హీరో గా స్టార్ ఇమేజి పియ్యిన తర్వాత ఆయన క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ కి షిఫ్ట్ అయ్యి నేడు ఎలాంటి డిమాండ్ ఉన్న క్యారక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీ లో కొనసాగుతున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఆయన లేని సినిమా అంటూ ఏమి లేదు అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు..చిన్న హీరో దగ్గర నుండి స్టార్ హీరో ఇమేజి ఉన్న హీరోల వరుకు ప్రతి ఒక్కరికి నరేష్ గారు కావాల్సిందే..ఇండస్ట్రీ లో క్యారక్టర్ ఆర్టిస్టుగా ఆయన ఏర్పర్చుకున్న ఇమేజి అలాంటిది మరి..ఇటీవల ఆయన ముఖ్య పాత్ర పోషించిన అంటే సుందరానికి సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమాలో హీరో నాని తర్వాత అదే రేంజ్ లో నరేష్ పెర్ఫార్మన్స్ గురించి కూడా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు.
ఇది కాసేపు పక్కన పెడితే నరేష్ కి సంబంధించిన ఒక్క లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సషనల్ గా మారింది..అదేమిటి అంటే నరేష్ అతి త్వరలోనే పవిత్ర లోకేష్ అనే ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్టు ని నాల్గవ పెళ్లి చేసుకోబోతున్నాడు అట..ఇది వరకే నరేష్ కి మూడు పెళ్లిళ్లు అయ్యాయి..వారితో విడాకులు అయ్యిపోయాయి కూడా..నరేష్ కి నవీన్ అనే ఒక కొడుకు కూడా ఉన్నాడు..ఇతను ఇప్పటికే నందిని నర్సింగ్ హోమ్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరో గా కూడా పరిచయం అయ్యాడు..తొలిసినిమా తోనే పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ కూడా ఎందుకో మళ్ళీ ఆ తర్వాత ఆయన సినిమాల్లో నటించలేదు..ఇది పక్కన పెడితే నరేష్ గత కొంత కాలం నుండి పవిత్ర లోకేష్ తో డేటింగ్ లో ఉంటున్నాడు అని..త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకొని ఒక్కటవ్వబోతున్నారు అని ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా నడుస్తున్న చర్చ..వీళ్ళిద్దరేవు కలిసి ఎన్నో సినిమాల్లో జంటగా నటించారు..ఇప్పుడు నిజంగా జీవితం లో కూడా ఒకటి అవ్వబోతుండడం విశేషం..నరేష్ నాల్గవ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్త రావడం తో సోషల్ మీడియా లో ఆయన పై విమర్శలు వెల్లువలా కురుస్తున్నాయి.
నరేష్ గారు పెళ్లి చేసుకోబోతున్న పవిత్ర లోకేష్ గారు కూడా తన భర్త తో విడిపోయి చాలా కాలం నుండి ఒంటరిగా బ్రతుకుతున్నారు..షూటింగ్ సమయం లో వీళ్లిద్దరి మనసులు కలవడం..పెద్ద వయస్సులో తోడు కచ్చితంగా అవసరం కాబట్టి నరేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇండస్ట్రీ లో వినిపిస్తున్న టాక్..స్వర్గీయ శ్రీ విజయ నిర్మల గారి వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నరేష్ కి సూపర్ స్టార్ కృష్ణ సపోర్టు కూడా ఫుల్ గా ఉండేది..ఎందుకంటే ఆయన విజయ నిర్మల గారిని అప్పటికే పెళ్లి చేసుకున్నారు..కృష్ణ గారు విజయ నిర్మల గారిని పెళ్లి చేసుకున్నప్పటి నుండి నరేష్ కృష్ణ గారితోనే కలిసి ఉంటున్నారు..ప్రస్తుతం కృష్ణ గారికి అన్ని తానై కుడి భుజం లా నిలిచారు నరేష్..ప్రస్తుతం ఆయన పనులు అన్ని కూడా నరేష్ గారే చూసుకుంటూ వస్తున్నారు..పెద్ద వయస్సు లో తనకి తోడు ఉన్న నరేష్ గారు అంటే కృష్ణ గారికి ఎంతో అభిమానం అనే సంగతి మన అందరికి తెలిసిందే.