Home Entertainment ప్రభాస్ సినిమా రికార్డ్స్ ని చిత్తు చిత్తు చేసిన కార్తికేయ 2

ప్రభాస్ సినిమా రికార్డ్స్ ని చిత్తు చిత్తు చేసిన కార్తికేయ 2

5 second read
0
0
266

యంగ్ హీరో నిఖిల్ నటించిన కార్తీకేయ-2 చిత్రం ప్రభంజనం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఈ మూవీ హిందీ బెల్ట్‌లో ఆశ్చర్యకర రీతిలో వసూళ్లను సాధిస్తూ ట్రేడ్ పండితులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. కార్తీకేయ 2 చిత్రం ఉత్తరాదిలో అంచనాలకు మించిన స్పందన సొంతం చేసుకొంటున్నది. తొలి రోజు కేవలం 50 షోలతో ప్రారంభమైన ఈ చిత్రం తొలివారం ముగిసే సరికి భారీగా థియేటర్ల సంఖ్యను, షోల సంఖ్యను పెంచుకుంది. తొలి వీక్ పూర్తయ్యే నాటికి దాదాపు 5వేల షోలు ప్రదర్శింపబడుతున్నాయంటే కార్తీకేయ-2 ఎలాంటి ప్రభజనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ మూవీస్ లాల్ సింగ్ చద్దా, రక్షాబంధన్ వంటి సినిమాలను దాటుకుని తెలుగు డబ్బింగ్ సినిమా వసూళ్లను సాధిస్తోంది. హిందూ సంస్కృతి ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతోంది. అందుకే ఈ మూవీ విడుదలైన ప్రతిచోట బ్రహ్మరథం పడుతున్నారు.

ముఖ్యంగా కార్తీకేయ 2 నిర్మాత అభిషేక్ అగర్వాల్ గతంలో ది కాశ్మీరీ ఫైల్స్ చిత్రంతో బాలీవుడ్‌ను కుదిపేశాడు. అదే రీతిలో కార్తీకేయ 2 చిత్రాన్ని మరో సెన్సేషనల్ హిట్‌గా మలిచారనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. శ్రీ కృష్ణుడికి సంబంధించిన కథ కావడంతో హిందీ జనాలు కార్తీకేయ-2 సినిమాకు కనెక్ట్ అయ్యారు. అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ చిత్రంలో చిన్న పాత్ర పోషించడం కూడా కలిసొచ్చింది. ఇప్పటికే హిందీ వెర్షన్‌కు సంబంధించి ప్రభాస్ రాధేశ్యామ్ వసూళ్లను కార్తీకేయ-2 దాటేసింది. తొలిరోజు హిందీలో కేవలం రూ.7 లక్షలు మాత్రమే సాధించిన ఈ మూవీ రెండో రోజు రూ.28 లక్షలు, మూడో రోజు రూ.1.10 కోట్లు, నాలుగో రోజు రూ.1.28 కోట్లు, ఐదో రోజు రూ.1.38 కోట్లు, ఆరో రోజు రూ.1.64 కోట్లు, ఏడో రోజు రూ.2.46 కోట్లు, 8వ రోజు రూ.3.04 కోట్లు, 9వ రోజు రూ.4.07 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాదాపుగా కార్తీకేయ-2 మూవీ బిజినెస్ హిందీ వెర్షన్‌తోనే సాధించిందని.. తెలుగు వెర్షన్‌లో వచ్చిన వసూళ్లన్నీ ఈ సినిమాకు బోనస్ అని ట్రేడ్ పండితులు స్పష్టం చేస్తున్నారు.

తొలి వారంలో ఆదివారం, పంద్రాగస్టు, కృష్ణాష్టమి సెలవులు కార్తీకేయ-2 చిత్రానికి కలిసి వచ్చాయి. వీకెండ్‌లోనే కాకుండా మంగళ, బుధ, గురువారాల్లో కూడా ఈ సినిమాకు మంచి బుకింగ్స్ వచ్చాయి. పైగా ప్రతి రోజు థియేటర్ల, షోల సంఖ్య పెరిగాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వరకు వసూళ్లను పరిశీలిస్తే.. తొలిరోజు రూ.3.50 కోట్లు, రెండోరోజు రూ.3.81 కోట్లు, మూడో రోజు రూ.4.23 కోట్లు, నాలుగో రోజు రూ.2.17 కోట్లు, ఐదోరోజు రూ.1.61 కోట్లు, ఆరో రోజు రూ.1.34 కోట్లు, ఏడో రోజు రూ.2.03 కోట్లు, 8వ రోజు రూ. 1.82 కోట్లు, 9వ రోజు రూ.2.4 కోట్లు, 10వ రోజు రూ.1.15 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది. మైథలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుంది. చందూ మొండేటి మార్క్‌ దర్శకత్వం, హీరో నిఖిల్‌ నటన, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అభినయం ఈ సినిమాను విజయతీరాలకు చేర్చింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌ సంయుక్తంగా కార్తీకేయ 2 సినిమాను నిర్మించాయి. కార్తీకేయ సినిమాను సుబ్రహ్మణ్య పురం నేపథ్యంలో తెరకెక్కిస్తే.. కార్తీకేయ-2 చిత్రాన్ని శ్రీ కృష్ణుడి ద్వారకా నేపథ్యంలో తెరకెక్కించారు. త్వరలో కార్తీకేయ-3 కూడా తెరకెక్కనుంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

సింగర్ వాణి జయరాం మృతి పై తలెత్తుతున్న అనుమానాలు..!

కన్నడతో పాటు పలు భాషల్లో 10,000కు పైగా పాటలు పాడిన నటి వాణీ జయరామ్ ఈరోజు (ఫిబ్రవరి 4) చెన్…