Home Entertainment ప్రభాస్ సలార్ మూవీ స్టోరీ ఇదేనా..స్టోరీ లో ఉన్న ట్విస్ట్స్ చూస్తే మెంటలెక్కిపోతారు

ప్రభాస్ సలార్ మూవీ స్టోరీ ఇదేనా..స్టోరీ లో ఉన్న ట్విస్ట్స్ చూస్తే మెంటలెక్కిపోతారు

4 second read
0
0
8,788

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సాహూ మరియు రాధే శ్యామ్ రెండు సినిమాలు కూడా అభిమానులను తీవ్రమైన నిరాశకి గురి చేసాయి..ముఖ్యంగా ఇటీవలే విడుదలైన రాధే శ్యామ్ సినిమా మాత్రం ప్రభాస్ కెరీర్ లో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది..సుమారు 200 కోట్ల రూపాయిల నష్టాల్ని మిగిలించిన ఈ చిత్రం ఇండియా లోనే నెంబర్ 1 డిజాస్టర్ ఫ్లాప్ గా నిలవడం విశేషం..అందుకే ప్రభాస్ తన తదుపరి చిత్రాలపై ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు..ప్రస్తుతం ఆయన KGF సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సలార్ అనే సినిమా తీస్తున్నాడు..ఈ సినిమా షూటింగ్ శెరవేగంగా సాగుతుంది..ఇప్పటికే 30 శాతం కి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ ఏడాది లోపు షూటింగ్ కార్యక్రమాలు మొత్తం ముగించుకొని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకి వచేందుకు సిద్ధం గా ఉన్నది..ఈ చిత్రం లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుండగా, విలన్ గా జగపతి బాబు నటిస్తున్నాడు.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియా లో లీక్ అయ్యి తెగ వైరల్ గా మారిపోయింది..ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమాలో ప్రభాస్ తన మిత్రుడు ఆశయాలను నెరవేర్చే వాడిగా కనిపించబోతున్నాడట..అతనిని విలన్స్ కొన్ని కారణాల వాళ్ళ చెంపేస్తారట..చనిపొయ్యే ముందు ప్రభాస్ తో అన్ని విషయాలు చెప్పి తన ఆశయం ని బ్రతికించమని కోరుతాడట..ఆ స్నేహితుడి పాత్రలో మలయాళం స్టార్ హీరో పృద్వి రాజ్ నటించబోతున్నాడు..ఇక ఈ సినిమా లో శృతి హాసన్ ఒక జర్నలిస్ట్ పాత్రలో నటిస్తుంది..ఇందులో ప్రభాస్ మరియు శృతిహాసన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో అద్భుతంగా వచ్చిందని..ఈ చిత్రం క్లైమాక్స్ లో శృతి హాసన్ చనిపోతుంది..ఇండస్ట్రీ వర్గాల్లో సాగుతున్న చర్చ..KGF చాప్టర్ 2 క్లైమాక్స్ లో కూడా హీరోయిన్ చనిపొయ్యే విషయం మన అందరికి తెలిసిందే..ఈ సినిమా కూడా KGF సిరీస్ లాగానే ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సన్నివేశాలు కూడా చాలా బలంగా పెట్టారట..ప్రభాస్ ఫాన్స్ ఆకలి మొత్తం తీర్చే విధంగా ఈ సినిమాలో ప్రతి షాట్ అద్భుతంగా వచ్చేలా తెరకెక్కిస్తున్నాడట ప్రశాంత్ నీల్.

ఇది ఇలా ఉండగా హాలీవుడ్ తరహాలో KGF కూడా సినిమాటిక్ యూనివర్స్ గా చేసే ఆలోచన ఉన్నట్టు ఆ చిత్ర నిర్మాతలు అధికారికంగా తెలియచేసిన సంగతి మన అందరికి తెలిసిందే..అంటే ఒక సినిమా లింక్ ని మరో సినిమాకి కలపడం..అదే విధంగా సలార్ ప్రపంచం లోకి రాకీ భాయ్ కూడా అడుగుపెడుతాడట..ఈ చిత్రం లోని క్లైమాక్స్ ట్విస్ట్ అదే..రాకీ భాయ్ కి సలార్ కి లింక్ ఏమిటి అనే ట్విస్ట్ ఫాన్స్ మరియు ప్రేక్షకుల మైండ్ బ్లాస్ట్ అయ్యే విధంగా ఉండబోతుంది అట..అంటే KGF 3 లో కూడా సలార్ పాత్ర ఉంటుంది అన్నమాట..ఇలా కనుక జరిగితే సలార్ మరియు KGF 3 సినిమాలు 3000 కోట్ల రూపాయిలు కొల్లగొట్టి హాలీవుడ్ తో కూడా పోటీ పడే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ లో సినీ ప్రముఖులు నుండి వినిపిస్తున్న విశ్లేషణాత్మక మాటలు..ప్రస్తుతం అభిమానులందరూ సలార్ టీజర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..అతి త్వరలోనే ఈ సినిమా టీజర్ కి సంబంధించిన అధికారిక ప్రకటన జరగబోతుంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…