
స్టార్ హీరో ప్రభాస్ ఈ పేరు తెలియని వ్యక్తి కానీ ఇష్టపడని వ్యక్తి కానీ ఉండరు అనే చెప్పవచ్చు మొదట్లో కొన్ని ఫ్లాప్ లతో నిరసపడిన తరువాత వరుస హిట్ లతో ముందుకు దూసుకుపోతున్నారు ఈశ్వర్ చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినాడు ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది దీనితో ప్రభాస్ నిరాశ చెందాడు అనే అనవచ్చు తరువాత చిత్రం రాఘవేంద్ర కూడా ఫ్లాప్ అయింది తరువాత మూడవ చిత్రం గా తెరకెక్కిన చిత్రం వర్షం ఈ చిత్రం ప్రభాస్ లైఫ్ ని మార్చేసింది అనే అనవచ్చు ఈ సినిమా తో ప్రభాస్ కి తెలుగు అభిమానులు పెరిగిపోయారు వర్షం సినిమా సూపర్ హిట్ గా నిలిచింది వర్షం చిత్రం కి ముందు ప్రభాస్ రెండు సినిమాలు చేసినప్పటికీ తనకంటూ ఒక గుర్తింపును తెచుకొలేక పోయారు వర్షం సినిమాతో ఇండస్ట్రీకి కొత్తగా పరిచయం అయ్యారు అనే అనవచ్చు తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఛత్రపతి సినిమా చేయటం జరిగింది ఈ చిత్రం లో ప్రభాస్ ఆక్టింగ్ బాడీ లాంగ్వేజ్ కి ఈ స్టోరీ చాలా బాగా సెట్ అయింది.
దీనితో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది ఈ ఒక్క చిత్రం తో ప్రభాస్ తన టాలెంట్ నీ బయటపెట్టారు అనే అనవచ్చు ఆ తరువాత కొన్ని ఫ్లాప్ లను అందుకున్నప్పటికి హిట్ అయిన సినిమాలు ప్రభాస్ కి మంచి గ్రేస్ నీ తెచ్చిపెట్టాయి అనే అనవచ్చు భాహుబలి చిత్రం తో ఇండస్ట్రీ హిట్ అనే ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు ఈ చిత్రం పార్ట్ 1 పార్ట్ 2 గా రిలీజ్ ఐనప్పటికీ రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ను సొంతం చేసుకున్నారు ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వం లో ఒక చిత్రాన్ని నిర్మిస్తుండగా ఈ చిత్రానికి సంబంధించిన ఎటువంటి సమాచారం బయటికి రాలేదు పక్క కమర్షియల్ చిత్రం లో ప్రభాస్ ను ఫ్యాన్స్ చేస్తున్న ట్రోల్స్ ను దృష్టిలో పెట్టుకొని సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తుంది కానీ మారుతి దర్శకత్వంలో లో వస్తున్న ఈ చిత్రం నుండి ప్రభాస్ లుక్ ఒకటి బయటకు వచ్చింది.
దీనితో ప్రేక్షకులు ఒక కొత్త లుక్ లో రెబల్ స్టార్ ప్రభాస్ ను చూడబోతున్నాం అని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ సినిమా లో ప్రభాస్ కి జంటగా ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు వాళ్ళు కూడా ఈ సినిమా తో తమకు మంచి గుర్తింపు వస్తుందని నమ్ముతున్నారాట ఈ చిత్రం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి ఈ సినిమాకు సంబంధించిన సమాచారాలు ఎవి బయటకు రాకపోవడంతో మారుతి ఏదో కొత్తదనాన్ని చూపిస్తున్నారు అనే ఆశలు పెరుగుతున్నాయి అభిమానుల్లో ప్రభాస్ సినిమాలన్నీ ఎక్కువ సమయం తో పాటు ఎక్కువ కర్చు తో కూడుకున్న పనులే కాబట్టి ప్రభాస్ కూడా కథల విషయం లో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.