Home Entertainment ప్రభాస్ పై మండిపడుతున్న అభిమానులు..కారణం ఏమిటో తెలుసా?

ప్రభాస్ పై మండిపడుతున్న అభిమానులు..కారణం ఏమిటో తెలుసా?

2 second read
0
3
50,581

టాలీవుడ్ లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కి ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..బాహుబలి సిరీస్ తర్వాత ఎవరికీ సాధ్యపడని స్టార్డమ్ ని సొంతం చేసుకున్నాడు ఆయన..ఆయన అట్టర్ ఫ్లాప్ సినిమా సాహూ కూడా 450 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసింది అంటే ఆయన స్టార్ డమ్ ప్రస్తుతం ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు..అందుకే ఆయనతో సినిమాలు తియ్యడానికి నిర్మాతలు వందల కోట్లు సైతం చాలా తేలికగా ఖర్చుపెట్టేస్తారు..ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న నాలుగు సినిమాల బడ్జెట్ విలువ దాదాపుగా 2000 కోట్ల రూపాయలకు పైమాటే..ఇక ఏడాది ఆయన హీరో నటంచిన లవ్ స్టోరీ రాధే శ్యామ్ చిత్రం దాదాపుగా 200 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..ప్రభాస్ ఫ్లాప్ సినిమాలే ఇప్పుడు ఈ రేంజ్ లో వసూలు చేస్తుంటే..పొరపాటున ఇప్పుడు ఆయనకీ ఒక హిట్ పడితే ఏ రేంజ్ లో ఉంటుందో కలలో కూడా ఊహించలేం..అందుకే ప్రభాస్ కోసం అంత డబ్బులు ఖర్చు చేస్తున్నారు నిర్మాతలు.

ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ , సలార్ మరియు ప్రాజెక్ట్ K వంటి సినిమాలలో నటిస్తున్నాడు..అయితే ప్రభాస్ అతి త్వరలోనే అర్జున్ రెడ్డి సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తో స్పిరిట్ అనే సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమాకి సంబంధించిన ఒక లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు ప్రభాస్ అభిమానులను కంగారు పెడుతుంది..అదేమిటి అంటే ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ ని ఎంపిక చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి..వయసులో ప్రభాస్ తో సమానం గానే ఉన్నప్పటికీ..ప్రభాస్ ముందు ఆన్ స్క్రీన్ పైన ప్రభాస్ కి అమ్మా లాగ అనిపిస్తుందని..అలాంటి ఆంటీ ని ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా పెట్టుకోవడం ఏమిటి అని సందీప్ రెడ్డి వంగ పై ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా లో విరుచుకుపడుతున్నారు..అయితే ఇందులో కరీనా కపూర్ హీరోయిన్ రోల్ చేస్తుందా లేదా వేరే ఏదైనా రోల్ చేస్తుందా అనేది కంఫర్మ్ గా తెలియాల్సి ఉంది..ఒకవేళ హీరోయిన్ రోల్ చేస్తే మాత్రం ప్రభాస్ అభిమానుల నుండి ఆగ్రహావేశాలు ఆ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఎదురుకోక తప్పదు అనే చెప్పాలి.

కరీనా కపూర్ భర్త సైఫ్ అలీ ఖాన్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమాలో రావణాసురిడిగా కనిపించబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా షూటింగ్ సమయం లోనే ప్రభాస్ సైఫ్ అలీ ఖాన్ కి మరియు కరీనా కపూర్ కి బాగా దగ్గరయ్యాడట..ఆ చనువు తోనే ప్రభాస్ తన తదుపరి సినిమాలో నటించమని కోరగానే కరీనా కపూర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది..మరి ఈ కాంబినేషన్ ఎంత వరుకు వర్కౌట్ అవుతుందో చూడాలి..ప్రభాస్ ఇప్పటికే ఆది పురుష్ సినిమాని పూర్తి చేసాడు..ఇండియా లోనే మొట్టమొదటి మోషన్ కాప్చర్ చిత్రం గా ఈ సినిమా తెరకెక్కుతుంది..కాబట్టి VFX మరియు కంప్యూటర్ గ్రాఫిక్స్ సంబంధించిన వర్క్ చాలా ఉంటుంది..దీనికి ఎంతో సమయం పడుతుంది..మరో పక్క ప్రభాస్ KGF సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ మూవీ షూటింగ్ ఇప్పటికే 30 శాతం పూర్తి అయ్యింది..వీటితో పాటు మహానటి దర్శకుడు నాగ అశ్విన్ తో ప్రాజెక్ట్ K అనే సినిమా చేస్తున్నాడు..ఈ చిత్రాల షూటింగ్స్ అన్ని పూర్తి అయిన తర్వాత ప్రభాస్ – సందీప్ వంగ ‘స్పిరిట్’ చిత్రం ప్రారంభం అవ్వబోతుంది అని సమాచారం.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…