Home Entertainment ప్రభాస్ పెళ్లి గురించి అభిమానులకు పండగ చేసుకునే వార్త చెప్పిన కృష్ణంరాజు

ప్రభాస్ పెళ్లి గురించి అభిమానులకు పండగ చేసుకునే వార్త చెప్పిన కృష్ణంరాజు

1 second read
0
0
34,191

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ప్రస్తుతం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కి ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..బాహుబలి సినిమా తో ఆయన మన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలుమూలల విస్తరింపచేసాడు..ఆ సినిమాకి ముందు కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీ కి మాత్రమే పరిమితం అయిన ప్రభాస్, బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియన్ సూపర్ స్టార్ గా ఎదిగిపోయాడు..ఈ సినిమాకి ఆయనకీ ఎలాంటి స్టార్ ధం తెచ్చిపెట్టింది అంటే..ఆయన అట్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా నేటి జనరేషన్ స్టార్ హీరోల హిట్ సినిమా స్థాయిలో వసూళ్లను రాబడుతుంది..దానికి ఉదాహరణ గా నిలిచినవే సాహూ మరియు రాధే శ్యామ్ సినిమాలు..ఈ రెండు సినిమాలు అభిమానులను మరియు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయినప్పటికీ సాహూ సినిమా 430 కోట్ల రూపాయిల గ్రాస్ మరియు రాధే శ్యామ్ సినిమా 150 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి ఫ్లాప్ టాక్ తో ప్రభాస్ స్టామినా ఏమిటో మరోసారి అందరికి అర్థం అయ్యేలా చేసింది..ఈ సినిమా తర్వాత ప్రస్తుతం ఆయన KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సలార్, మహానటి దర్శకుడు నాగ అశ్విన్ తో ప్రాజెక్ట్ K మరియు ఆదిపురుష్ వంటి సినిమాలలో నటిస్తున్నాడు.

సినిమాల పరంగా ప్రభాస్ ఎంజాయ్ చేస్తున్న అనితర సాధ్యమైన స్టార్ దమ్ ని ఇండియా లో ఏ హీరో కూడా చూడలేదు అని చెప్పాలి..కానీ అభిమానులను ఎప్పటి నుండో వేధిస్తున్న ప్రశ్న ప్రభాస్ పెళ్లి ఎప్పుడు..నాలుగు పదుల వయస్సు దాటినా కూడా ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడం అభిమానులను నిరాశకి గురి చేస్తోంది..తమ అభిమాన హీరో ఎప్పుడు ఒక ఇంటివాడు అవుతాడో అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న అభిమానులకు ప్రతిసారి నిరాశే ఎదురు అవుతుంది..సాహూ సినిమా విడుదల అయిన తర్వాత ప్రభాస్ పెళ్లి ఉంటుంది అని అప్పట్లో ఆయన పెదనాయన కృష్ణం రాజు అధికారికంగా తెలిపాడు..కానీ అది జరగలేదు.సాహూ విడుదల అయ్యి రెండేళ్లు దాటి..ఇప్పుడు రాధే శ్యామ్ కూడా విడుదల అయ్యిపోయింది..త్వరలోనే సలార్ మరియు ఆదిపురుష్ సినిమాలు కూడా విడుదల అయ్యిపోతాయి..కానీ మా హీరో పెళ్లి గురించి మాత్రం ఎలాంటి శుభవార్త లేదు అని అభిమానులు ఫీల్ అవుతూ ఉన్నారు..అయితే ఇటీవల ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు ప్రభాస్ పెళ్లి గురించి చేసిన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

అదేమిటి అంటే ప్రభాస్ కి ఈ ఏడాది లోనే పెళ్లి జరుగుతుంది అని..ప్రభాస్ కాస్త సినిమా షూటింగ్స్ పూర్తి చేసుకొని ఫ్రీ అయితే పెళ్ళికి సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభిస్తాము అంటూ చెప్పుకొచ్చాడు..అయితే చాలా కాలం నుండి ప్రభాస్ ఒక్క ప్రముఖ టాప్ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి..ఆ హీరోయిన్ మరెవరో కాదు..మన అనుష్కనే..ప్రబస్ మరియు అనుష్క చాలా కాలం నుండి ప్రేమలో ఉన్నారు అని..ప్రస్తుతం డేటింగ్ కూడా చేస్తున్నారు అంటూ వార్తలు చాలా కాలం నుండి సోషల్ మీడియా లో ప్రచారం అవుతూనే ఉన్నాయి..ఇదే విషయాన్నీ కృష్ణం రాజు ని అడగగా, ప్రభాస్ నాకు అలాంటివి ఏమి కూడా చెప్పలేదు అని..ఒక్కవేల వాడు ప్రేమ వివాహం చేసుకుంటాను అన్నా మాకు పర్లేదు అంటూ చెప్పుకొచ్చాడు కృష్ణం రాజు..మరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రభాస్ పెళ్లి ఈ ఏడాది అయినా అవుతుందో లేదో చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…