
ప్రస్తుతం ఇండియన్ ఫిలిం హిస్టరీ లో మన తెలుగు సినిమా పరిశ్రమ నెంబర్ 1 స్థానం లో ఉన్నది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు, బాహుబలి సినిమా తర్వాత మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతి కనివిని ఎరుగని స్థాయిలో పెరిగి మన మార్కెట్ ని బాలీవుడ్ కి ధీటుగా మారేలా చేసింది, ఇక మన హీరోలు కూడా త్వరలో బాలీవుడ్ హీరోల మార్కెట్ ని అధిగమించబోతున్నారు అనడం లో ఎలాంటి సందేహం లేదు, ఇప్పటికే బాలీవుడ్ ని దశాబ్దాలుగా ఏలుతున్న ఖాన్స్ త్రయం ఆధిపత్యానికి చెక్ పెట్టిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, ఇప్పుడు పాన్ ఇండియా నెంబర్ 1 సూపర్ స్టార్ గా కొనసాగుతున్నాడు, ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కూడా అదే స్థాయిలో బాలీవుడ్ నుండి కోలీవుడ్ వరుకు చక్రం తిప్పుతారు అనడం లో ఎలాంటి సందేహం లేదు, ఈ స్థాయి స్టార్ డమ్ ఉన్న ఈ హీరోలందరూ ఐకమత్యం తో ఉంటే ఎలా ఉంటుంది?, చూడడానికి రెండు కళ్ళు చాలవు కదూ, సరిగ్గా ఇప్పటి ట్రెండ్ అలాగే కొనసాగుతుంది, హీరోలందరూ ఎంతో స్నేహం తో ఉంటూ అభిమానులకి కూడా అలాగే ఉండాలి అని మెసేజ్ పాస్ చేస్తున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మన టాలీవుడ్ కి డార్లింగ్ అని అందరూ అంటుంటారు, ప్రతి ఒక్క హీరో తో ఆయన ఎంతో స్నేహం గా మెలుగుతూ ఉంటారు, ఇటీవల ఆయన గ్రీన్ ఛాలెంజ్ అంటూ మొక్కలను నాటి ,రామ్ చరణ్ కి కూడా అలా చెయ్యమని ఛాలెంజ్ విసిరినా సంగతి మన అందరికి తెలిసిందే, ఈరోజు రామ్ చరణ్ ప్రభాస్ ఛాలెంజ్ ని స్వీకరిస్తూ మొక్కలను నాటాడు, ఈ కార్యక్రమం పూర్తి అయినా తర్వాత రామ్ చరణ్ మాట్లాడుతూ ‘ నా డార్లింగ్ ప్రభాస్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ ని ఈరోజు పూర్తి చేశాను, ఆయన నాకు ఈ ఛాలెంజ్ ని విసిరి చాల కాలం అయ్యింది, నేనే చాల లేట్ అయ్యాను, పెరుగుతన్న కాలుష్యం ని కంట్రోల్ చెయ్యడానికి మొక్కలను పెంచడం అనివార్యం, దయచేసి అందరూ మొక్కలను పెంచండి ‘ అంటూ రామ్ చరణ్ ఈ సందర్భంగా మాట్లాడాడు, ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన రామ్ చరణ్ మొక్కలు నాటిన వీడియోలు మరియు ఫొటోలే తెగ వైరల్ గా మారాయి.
ఇది ఇలా ఉండగా ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ చెయ్యబొయ్యే సినిమాల గురించి ఇప్పటి నుండి చర్చలు మొదలు అయ్యాయి, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తన తదుపరి సినిమా ఉండబోతున్నట్టు అధికారికంగా ప్రకటించిన సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమాలు తర్వాత ఆయన కె జీ ఎఫ్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీళ్ దర్శకత్వం లో నటించబోతున్నట్టు సమాచారం, ఒక్క పక్క జూనియర్ ఎన్టీఆర్ ఇంత స్పీడ్ ని చూపిస్తుంటే, రామ్ చరణ్ మాత్రం చాలా తెలివిగా ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు, ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో ఒక్క ముఖ్య పాత్రలో నటించడానికి మాత్రమే రామ్ చరణ్ ఒప్పుకున్నారు, ఆ తర్వాత ఏ కథ చెప్పాలి అన్న వచ్చే ఏడాది సమ్మర్ లోనే చెప్పాలి అని రామ్ చరణ్ తన కోసం వెయిట్ చేస్తున్న డైరెక్టర్స్ కి చెప్పాడు అట, ఇప్పటికే లోకేష్ కనకరాజు, గౌతమ్ తిన్నూరి మరియు వంశీ పైడిపల్లి వంటి దర్శకులు రామ్ చరణ్ కోసం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు, వీళ్ళతో పాటు తమిళ టాప్ డైరెక్టర్ అట్లీ కూడా రామ్ చరణ్ కోసం ఒక్క పవర్ ఫుల్ సబ్జెక్టు ని రెడీ చేసాడు అట, మరి రామ్ చరణ్ వీరిలో ఎవరికీ ఓకే చెప్తాడు అనేది ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది.