
మన టాలీవుడ్ లో యూత్ మరియు మాస్ లో సరిసమానమైన క్రేజ్ ఉన్న హీరోలు ఎవరు అని అడిగితె టక్కుమని మనకి గుర్తు వచ్చే పేర్లు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..ఈ ఇద్దరి హీరోలకు మాములు క్రేజ్ లేదు అనే చెప్పాలి..వీళ్ళ సినిమాలు వచ్చాయి అంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది..ఈ ఇద్దరి హీరోల మధ్య బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పోటీ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా ఒక్కరు అంటే ఒక్కరికి అపారమైన గౌరవం..పవన్ కళ్యాణ్ ఎన్నో సందర్భాలలో ప్రభాస్ ని మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి..అలాగే ప్రభాస్ కూడా పలు సందర్భాలలో పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా మాట్లాడాడు కూడా..కానీ ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య జరిగిన గొడవలు మనం అంత తేలికగా మరచిపోలేము..ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు భీమవరం లో ఫ్లెక్సీల గొడవ ఈ ఇద్దరి హీరోల అభిమానుల మధ్య ఏ స్థాయిలో జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అప్పట్లో అక్కడి పరిస్థితులను శాంతపరచడానికి ప్రభుత్వం 144 సెక్షన్ కూడా విధించింది.
ఇప్పటికి కూడా సోషల్ మీడియా లో ఈ ఇద్దరి హీరోల అభిమానుల మధ్య ఎదో ఒక్క గొడవ తరుచు జరుగుతూనే ఉంటుంది..అయితే ఇటీవల వీళ్ళ మధ్య సోషల్ మీడియా లో జరిగిన ఒక్క గొడవ ఏకంగా మీడియా వరుకు వెళ్ళింది..అసలు విషయానికి వస్తే ఇటీవల కాలం లో ట్విట్టర్ లో స్పేసేస్ కి తెగ క్రేజ్ ఏర్పడ్డ సంగతి మన అందరికి తెలిసిందే..ఈ స్పేస్ లో సోషల్ మీడియా లో ఉండే స్నేహితులతో ఇంటరాక్ట్ అవ్వొచ్చు..అప్పుడప్పుడు ఈ స్పేసేస్ లో ఫ్యాన్ వార్స్ కూడా జరుగుతూ ఉంటాయి..అలా కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు స్పేస్ లో ప్రభాస్ ని తిట్టడం ఇప్పుడు వైరల్ గా మారింది..’ప్రభాస్ కి బాహుబలి లాటరీ లా వచ్చింది..ఇప్పటీకి ఆంధ్ర తెలంగాణ లో ప్రభాస్ కి ఫాన్స్ లేరు’ అని కొంతమంది స్పేస్ లో ప్రభాస్ మీద చేసిన కామెంట్స్ కి ఆయన అభిమానులు బాగా హర్ట్ అయ్యారు..దీనితో పవన్ కళ్యాణ్ మాకు వచ్చి క్షమాపణలు చెప్పాలి అని..లేకపోతే మేము జనసేన పార్టీ కి వోట్ వెయ్యము అంటూ ఒక్క ప్రతేయకమైన టాగ్ ద్వారా ట్రెండ్ చేసారు..ఇది ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది.
పవన్ కళ్యాణ్ సినిమాలు కేవలం జనసేన పార్టీ ని నడపడం కోసం మాత్రమే చేస్తున్నాడు అని..రాబొయ్యే ఎన్నికలలో మనకి ప్రతి ఒక్క హీరో అభిమాని వోట్ ముఖ్యమే అని..ఇలాంటి సమయం లో ఎవ్వరితో గొడవలకు దిగొద్దు అంటూ జనసేన పార్టీ శ్రేణులు కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులకు దిశానిర్దేశం చేస్తున్నారు..నిన్న అమరావతి లో జరిగిన జనసేన పార్టీ విస్తృత చర్చా కార్యక్రమం లో కూడా పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా లో జరుగుతున్నా వ్యాఖ్యలపై పరోక్షం గా కామెంట్స్ చేసారు..ఒక్క గొప్ప ఆలోచనతో జనసేన పార్టీ పెట్టాను అని..ప్రతి ఒక్కరు పార్టీ ఎదుగుదల కి కృషి చెయ్యాలి కానీ, పార్టీ కి చెడ్డపేరు తెచ్చే ప్రయత్నాలు చెయ్యకూడదు అని చెప్పుకొచ్చారు..సోషల్ మీడియా లో నా అభిమానులుగా చెప్పుకుంటూ దయచేసి ఇతర హీరోలో అభిమానులతో గొడవలు పడకండి..అలా గొడవ పడేవారు నా అభిమాని అని చెప్పుకోవడం మానేయండి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.