Home Entertainment ప్రభాస్ కి ఊహించని షాక్ ఇచ్చిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు..ఆందోళనలో ఫాన్స్

ప్రభాస్ కి ఊహించని షాక్ ఇచ్చిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు..ఆందోళనలో ఫాన్స్

2 second read
0
0
2,383

సెలబ్రిటీ అన్నాక కచ్చితం గా వాళ్ళకి పబ్లిక్ లోకి వచ్చినప్పుడు కాస్త ప్రైవసీ ఉండాలి అనేది వాస్తవమే..కానీ కోర్టు ఒక్కసారి ఒక్క రూల్ పెదిత్యే కచ్చితంగా అది ఎంతటి వారు అయిన పాటించాల్సిందే,కానీ ఈమధ్య సెలెబ్రిటీలు హైదరాబాద్ లోని ట్రాఫిక్ రూల్స్ నిబంధనలకు విరుద్ధంగా చేసి తరుచు ఫైన్లు వేయించుకోవడం సర్వ సాధారణం అయ్యిపోయింది..ఇక అసలు విషయానికి హైదరాబాద్ లోకార్ల విండోస్ కి బ్లాక్ ఫిలిం లు ఉపయోగించరాదు అని కోర్టు వారు ఒక్క కఠినమైన చట్టం ని తీసుకొచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..కేవలం Y కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వారికి మాత్రమే ఈ నిబంధనలు వర్తించవు..మిగిలిన వారు ఎవ్వరైనా సరే ఎంత పెద్ద సెలబ్రిటీ అయిన వారి కార్ల విండోస్ కి బ్లాక్ ఫిలిమ్స్ తగిలించరాదు..ఒక్క వేల తగిలిస్తే పోలీసు వారు ఆ వాహనం ని ఆపి బ్లాక్ ఫిలిం ని తొలగించి 700 రూపాయిలు ఫైన్ వేస్తారు..ఇలా టాలీవుడ్ లో చాలా మంది హీరోలకే జరిగింది..ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా చేరిపోయాడు.

ఇక అసలు విషయానికి వస్తే గత శనివారం నాడు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 లో నీరూస్ జంక్షన్ లో కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం తగిలించుకొని వెళ్తున్న ఒక్క కారుని గమనించి దానిని నిలిపిచేసారు పోలీసులు..ఆ తర్వాత ఆ కారుని క్షుణ్ణంగా పరిశీలించగా అది మన ప్రభాస్ గారి కార్ అని తెలిసింది..కార్ నెంబర్ ప్లేట్ స్పష్టం గా లేకపోవడం , కార్ వెనకాల MP స్టికర్ ఉండడం మరియు కార్ గ్లాసులకు బ్లాక్ ఫిలిం ఉండడం..ఈ మూడు ట్రాఫిక్ రూల్స్ కి విరుద్ధం కాబట్టి పోలీసులు ఈ మూడు రూల్స్ అతిక్రమించినందుకు గాను 1500 రూపాయిలు ఫైన్ విధించారు హైదరాబాద్ పోలీసులు..కార్ ని తనిఖీ చేస్తున్న సమయం లో ప్రబస్ లేనట్టు తెలుస్తుంది..కేవలం అతని డ్రైవర్ మాత్రమే ఆ కారు ని డ్రైవ్ చేస్తున్నాడు..ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..రెండు మూడు రోజుల క్రితం త్రివిక్రమ్ , నాగ చైతన్య వంటి వారు కూడా ఇలా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినందుకు గాను ఫైన్లు వేయించుకున్నారు..గతం లో జూనియర్ ఎన్టీఆర్ కారు ని కూడా ఇలాగె ఆపి బ్లాక్ ఫిలిం ని తొలగించి జరిమానా విధించిన సంగతి మన అందరికి తెలిసిందే.

ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది ఆయన రాధే శ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..భారీ బడ్జెట్ తో భారీగా అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లోనే అతి పెద్ద డిసాస్టర్ ప్లాప్ గా నిలిచింది..దీనితో ప్రభాస్ అభిమానులు చాలా తీవ్రమైన నిరాశ కి గురి అయ్యారు..ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ సలార్ సినిమా చేస్తున్న సంగతి మనకి తెలిసిందే..ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 30 శాతం వరుకు పూర్తి అయ్యినట్టు ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక్క ఇంటర్వ్యూ లో తెలిపాడు..KGF చాప్టర్ 2 వంటి సెన్సషనల్ హిట్ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ వంటి పాన్ ఇండియన్ సూపర్ స్టార్ తో తీస్తున్న సినిమా కావడం తో ఈ మూవీ పై అభిమానుల్లో కనివిని ఎరుగని రేంజ్ లో అంచనాలు ఉన్నాయి..ఆ అంచనాలకు తగట్టు గానే ఈ సినిమాలో ప్రభాస్ ని మోస్ట్ పవర్ ఫుల్ చూపించాడు అట..ప్రభాస్ అభిమానుల ఆకలి మొత్తం ఈ సినిమా తో తీరిపోతుంది అని మూవీ మేకర్స్ బలంగా నమ్ముతున్నారు..మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందో లేదో అనేది చూడాలి.

 

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…