Home Entertainment ప్రభాస్-అనుష్క పెళ్ళికి అంత క్లియర్..ముహూర్తం కూడా ఫిక్స్!

ప్రభాస్-అనుష్క పెళ్ళికి అంత క్లియర్..ముహూర్తం కూడా ఫిక్స్!

0 second read
0
1
5,971

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాస్ మాత్రమే. 40 ఏళ్ల వయసు దాటినా ఇంకా ప్రభాస్ పెళ్లి చేసుకోలేదు. అతడి పెళ్లి చూడాలన్న కోరిక తీరకుండా పెద్దనాన్న కృష్ణంరాజు తుదిశ్వాస విడిచారు. ఆయన బతికి ఉండగా ప్రభాస్‌కు పెళ్లి చేయాలని ఎంతో ప్రయత్నించారు. ప్రభాస్ కోసం ఒక మంచి అమ్మాయిని వెతుకుతున్నామని..ప్రభాస్ పెళ్లి చేసుకుంటే అందరికంటే ఎక్కువ సంతోషించేది తానేనని.. ఇప్పుడు అతడితో కలిసి నటించానని, రేపు వారి పిల్లలతో కూడా కలిసి నటించాలని ఉందని కృష్ణంరాజు తన మనసులోని మాటను బయటపెట్టారు. కానీ బాహుబలి తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తుండటం వల్ల ప్రభాస్ పెళ్లి చేసుకోలేకపోయాడు. అంతేకాకుండా గతంలో త్రిష, ఇటీవల అనుష్కతో పెళ్లి చేసుకుంటాడని వార్తలు వచ్చినా అవి కార్యరూపం దాల్చలేదు. ముఖ్యంగా అనుష్కను పెళ్లి చేసుకునేందుకు ప్రభాస్ పెద్దనాన్న ఒప్పుకోలేదని ఫిలింనగర్‌లో ప్రచారం జరిగింది. అయితే అవన్నీ ఒట్టి పుకార్లేనని కృష్ణంరాజు కొట్టేపారేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అయితే ఎవరి మాట ఎలా ఉన్నా ఇప్పటివరకు అటు ప్రభాస్, ఇటు అనుష్క అయితే పెళ్లి చేసుకోలేదు. తాజాగా కృష్ణంరాజు భౌతికంగా లేకపోవడంతో ప్రభాస్ తనకు ఇష్టమైన అనుష్కను పెళ్లి చేసుకుంటాడని టాక్ నడుస్తోంది. ఈ విషయంపై కృష్ణం రాజుకు ఎంతో సన్నిహితుడైన నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు ఇటీవల మాట్లాడారు. ఇంకా చెల్లెళ్ళ పెళ్లిళ్లు చేయాల్సిన బాధ్యత ప్రభాస్ మీద ఉందని, ఇక అతడి పెళ్లి కూడా త్వరలో జరిగితే కృష్ణం రాజు ఆత్మ చాలా సంతోషిస్తుంది అంటూ చెప్పారు. అనుష్క తో ప్రభాస్ పెళ్లి జరిగితే బాగుంటుంది అంటూ వాఖ్యానించారు. కృష్ణం రాజు చనిపోయిన ఏడాది లోనే పెళ్ళి అయిపోతే బాగుంటుంది అంటూ అభిప్రాయ పడ్డారు. పాన్ ఇండియా సినిమాల కారణంగా ప్రభాస్ హైదరాబాద్‌లో తక్కువగా.. ముంబైలో ఎక్కువగా ఉంటున్నాడని పెళ్లి చేసుకోడానికి సమయం ఇప్పట్లో కేటాయించడం కాస్త కష్టమేనని పేర్కొన్నారు. మరోవైపు ఇటీవల కృష్ణంరాజు ఆస్పత్రిలో ఉన్న సమయాంలో ప్రభాస్‌తో పాటు అనుష్క కూడా ఒకే సారి అక్కడికి వెళ్లి పరామర్శించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నడిచింది. వీళ్లిద్దరూ సీక్రెట్‌గా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని.. పెళ్ళి చేసుకోవాలని భావిస్తున్నారని, పెళ్ళి తరువాత ఉండటానికి అమెరికాలో ఇల్లు కూడా కట్టుకున్నారంటూ ఎన్నో పుకార్లు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి.

అయితే సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలపై హీరో ప్రభాస్ లేదా హీరోయిన్ అనుష్క ఎవరూ ఖండించలేదు. కనీసం స్పందన కూడా ఇవ్వలేదు. దాంతో ఈ విషయంలో ఎంతో కొంత నిజం ఉందని నెటిజన్లు భావించారు. అందుకే అప్పుడప్పుడు జనాలు మర్చిపోకుండా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఎవరో ఒకరు చర్చకు పెడుతుంటారు. ఇటీవల కృష్ణంరాజు మరణంతో మరోసారి వీరి పెళ్లి గోల వినిస్తోంది. మరోవైపు ఇటీవల అనుష్క శెట్టి పెళ్లి ఫిక్స్ అయిందని.. ఆమె బెంగళూరుకు చెందిన ఓ బిజినెస్ పర్సన్‌ను పెళ్లి చేసుకుంటుందని టాక్ వినిపించింది. అయితే ప్రభాస్‌తో చాలా సినిమాల్లో నటించిన అనుష్కకి కృష్ణంరాజుతో పాటు ప్రభాస్ కుటుంబంతో కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలోనే కృష్ణంరాజు ఆరోగ్య విషయం తెలుసుకున్న వెంటనే ఆమె ఆయన్ను చూసేందుకు ఆస్పత్రికి వెళ్లిందని కొందరు వాదిస్తున్నారు. ఆ తరవాత అనుష్క సోషల్ మీడియా వేదికగా ఆయన మరణానికి చింతిస్తూ ఎమోషనల్ కూడా అవ్వడంతో ప్రభాస్‌తో ప్రేమ లేకపోతే ఇలా జరుగుతుందా అంటూ మరికొందరు వాదిస్తున్నారు. ఏదేమైనా ప్రభాస్, అనుష్క పెళ్లిళ్లకు సమయం ఎప్పుడు వస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ మూవీ రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీకోసం

మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై…