
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఈ ఏడాది బాగా కలిసొచ్చిన ఏడాది అని చెప్పొచ్చు..వృత్తి పరంగా, కీర్తి ప్రతిష్టల పరంగా ఆయన అధిరోహించిన శిఖరాలు టాలీవుడ్ లో ఏ స్టార్ హీరో కూడా గతం లో చూడలేదు..#RRR సినిమా ద్వారా ప్రపంచం నలుమూలల తన ఖ్యాతిని విస్తరింపచేసుకున్న రామ్ చరణ్,ఇప్పుడు ఆస్కార్ అవార్డ్స్ లో కూడా నామినేషన్స్ దక్కించుకునే అవకాశం ఉంది అనే వార్తలు రావడం ప్రతీ తెలుగోడు గర్వించదగ్గ విషయం..అంతే కాకుండా న్యూ యార్క్ ఫిలిం క్రిటిక్ కార్పొరేషన్స్ ఈ ఏడాది నిర్వహిస్తున్న అవార్డ్స్ లో ఉత్తమ నటుడిగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి నామినేషన్స్ లో చోటు దక్కడం అందరూ గమనించాల్సిన విషయం..వీటితో పాటు ఆయన చేతిలో ప్రస్తుతం ఉన్న సినిమాలన్నీ పాన్ ఇండియన్ సినిమాలే..ప్రస్తుతం శంకర్ తో ఒక సినిమా చేస్తున్న రామ్ చరణ్..ఈ చిత్రం తర్వాత బుచ్చి బాబు తో ఒక సినిమా..సుకుమార్ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు.
ఇక లేటెస్ట్ గా ఆయన తండ్రి కూడా కాబోతున్నాడు అనే వార్త రావడం అభిమానులకి పట్టరాని అనందం ని కలిగించేలా చేసింది..వీటితో పాటు రామ్ చరణ్ కి మరో అరుదైన గౌరవం కూడా లభించింది..అదేమిటి అంటే అహ్మదాబాద్ లో స్వామి మహారాజ్ శతాబ్ది యత్సవాలకు హాజరు కావాల్సిందిగా మెగా పవర్ రామ్ చరణ్ కి ప్రత్యేకమైన ఆహ్వానం లభించింది..ఈ ఉత్సవాలకు ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ, ముఖేష్ అంబానీ కూడా హాజరు కాబోతున్నారు..వీళ్ళిద్దరితో వేదికని పంచుకొని అక్కడ ప్రసంగం ఇవ్వబోతున్న ఏకైక సినీ సెలబ్రిటీ గా రామ్ చరణ్ నిలవబోతున్నాడు..ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..ఇలా ఆయనకీ ఈ ఏడాది మొత్తం పట్టిందల్లా బంగారం లాగ మారిపోతుంది..వీటితో పాటు అందరూ ఊహించినట్టు గా ఆస్కార్ అవార్డ్స్ లో నామినేషన్స్ కూడా దక్కించుకుంటే..ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఆస్కార్ అవార్డ్స్ కి నామినెటే అయినా మొట్టమొదటి హీరో గా రామ్ చరణ్ చరిత్రలో నిలిచిపోతాడు.
రామ్ చరణ్ కి ఆస్కార్ అవార్డ్స్ లో చోటు దక్కేందుకు అన్ని విధాలుగా అర్హతలు ఉన్నాయి..రామరాజు పాత్ర ద్వారా ఆయన ప్రతీ ఒక్క ఎమోషన్ ని డ్రామాటిక్ గా కాకుండా ఎంతో సహజంగా పలికే లాగ చేసాడు..ఇది క్వాలిటీ యాక్టింగ్ కి నిదర్శనం..ఇలాంటి నటన కనబర్చే నటులకు ఇలాంటి గౌరవాలు దక్కుతుంటాయి..మరి రామ్ చరణ్ కి ఆ గౌరవం దక్కుతుందా లేదా అనేది చూడాలి..ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే..ఇడుప్పటి వరుకు 50 శాతం కి పైగా షూటింగ్ ని జరుపుకున్న ఈ చిత్రం లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు..దిల్ రాజు తన 50 వ చిత్రం గా ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు..ఈ సినిమాలో రామ్ చరణ్ పొలిటిషన్ గా మరియు CBI ఆఫీసర్ గా నటిస్తున్నాడు..ఇందులో ఆయనకీ హీరోయిన్ గా కైరా అద్వానీ నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు.