
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న అనితర సాధ్యమైన క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ని నిర్మాతలు మరియు బయ్యర్స్ తెగ వాడేస్తున్నారు..ఆయన పాత సినిమాలంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ఇష్టం..ఆ సినిమాల వల్లే పవన్ కళ్యాణ్ కి ఈరోజు ఇలాంటి చెక్కుచెదరని ఫ్యాన్ బేస్ ఏర్పడింది..హిట్టు మరియు ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ రికార్డ్స్ పెట్టే స్టామినా వచ్చింది..ఆ స్టామినా ని నిర్మాతలు వాడుకొని డబ్బులు పోగు చేసుకుంటున్నారు..ముందుగా జల్సా సినిమా ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు స్పెషల్ షోస్ గా వేసుకున్నారు..ఈ చిత్రానికి రెస్పాన్స్ అదిరిపోయింది..కేవలం ఒక్కరోజులోనే మూడు కోట్ల 30 లక్షల గ్రాస్ ని వసూలు చేసింది ఈ చిత్రం..అయితే ఆ షోస్ కి వచ్చిన కలెక్షన్స్ మొత్తం జనసేన పార్టీ కి ఇచ్చుకున్నారు అభిమానులు..అప్పట్లో ఎక్కడ చూసిన జల్సా మేనియా పవన్ మేనియా కనిపించడం తో దానిని క్యాష్ చేసుకునేందుకు థర్డ్ పార్టీ వాళ్ళు తమ్ముడు సినిమాని వేసుకున్నారు..ఆ ఊపు లో ఈ సినిమా స్పెషల్ షోస్ కి కూడా రెస్పాన్స్ అదిరిపోయింది.
కేవలం నైజాం మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాలలో వేసుకున్న తమ్ముడు షోస్ కి సుమారుగా 66 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..ఇక రీసెంట్ గానే ఖుషి చిత్రాన్ని 4K కి మార్చి విడుదల చేసారు దర్శక నిర్మాతలు..డిసెంబర్ 31 వ తేదీన విడుదలైన ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ మామూలు రేంజ్ కాదు..కేవలం మొదటి రోజు నుండే ఈ చిత్రానికి ఇక్కడ నాలుగు కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..ఇది ఆల్ టైం ఆల్ ఇండియన్ రికార్డు గా చెప్పుకోవచ్చు..ఫుల్ రన్ లో కూడా ఈ సినిమా 7 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసి ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ముందుకి దూసుకుపోతుంది..దీనితో థర్డ్ పార్టీ బయ్యర్స్ పవన్ కళ్యాణ్ పాత సినిమాలను వరుసగా థియేటర్స్ లో విడుదల చేసి క్యాష్ చేసుకోవడానికి క్యూ కట్టేసారు.
మార్చ్ 14 వ తేదీన తొలిప్రేమ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం అంటూ నిర్మాతలు అధికారిక ప్రకటన చేసారు..ఇంతలోపే మార్చ్ 7వ తేదీన బద్రి సినిమా ని రీ రిలీజ్ చెయ్యబోతున్నట్టు ‘వీ సినిమాస్’ అధినేత అధికారిక ప్రకటన చేసాడు..వీటితో పాటు అతి త్వరలోనే గుడుంబా శంకర్ , తీన్ మార్, పంజా మరియు అత్తారింటికి దారేది వంటి సినిమాలు కూడా రీ రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు బయ్యర్స్..అలా ప్రతీ నెల ఒక పవన్ కళ్యాణ్ సినిమాని థియేటర్స్ లో దింపి క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు బయ్యర్స్.