
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈయన కొత్త సినిమా వస్తుంది అంటే చాలు..ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరూ పండగ చేసుకుంటారు..కానీ ఈసారి ఆయన పాత సినిమా రీ రిలీజ్ కి కూడా అభిమానులు అదే స్థాయిలో పండగ చేసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిన అంశం..ఇక అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా జల్సా సినిమాని ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో స్పెషల్ షోస్ గా నిర్వహించాలని అభిమానులు ఎన్నో ఏర్పాట్లు చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..కానీ తమ్ముడు ఎవ్వరు ఊహించని విధంగా తమ్ముడు సినిమా మధ్యలోకి వచ్చింది..థర్డ్ పార్టీ వాళ్ళు ఈ సినిమాని కమర్షియల్ బిజినెస్ కోసం ప్రత్యేకంగా రీ మాస్టర్ చేయించుకొని రాష్ట్ర వ్యాప్తంగా షోలు ప్లాన్ చేసారు..అంటే జల్సా సినిమాకి వచ్చే డబ్బులు మొత్తం రైతుల సంక్షేమ నిధికి పోతుంది..కానీ తమ్ముడు సినిమాకి వచ్చే కలెక్షన్స్ మాత్రం ఎవరైతే షో ని కొని వేసుకునేవాళ్ళు ఉంటారో వాళ్లకి వచ్చిన లాభాలు వెళ్తాయి.
అందుకే పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ని కాష్ చేసుకోవడం కోసం రాష్ట్రవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాని వేసుకొని లాభాలు పొందేందుకు క్యూ కడుతున్నారు..ఇప్పటికే ఈ సినిమా కేవలం హైదరాబాద్ నుండి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 8 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..ఇది ఒక ఆల్ టైం రికార్డు గా చెప్పుకోవచ్చు..గతం లో పోకిరి సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ మరో రెండు రోజుల్లో స్పెషల్ షోస్ ఉంది అనగా 7 లక్షల రూపాయిలు వసూలు చేసింది..సోషల్ మీడియా లో వచ్చే ట్రోల్ల్స్ మన అందరికి తెలిసిందే..మీ హీరో రికార్డు ని కచ్చితంగా లేపేస్తాము అంటూ సవాలు విసురుకుంటూ ఉంటారు అభిమానులు..అలా పోకిరి సినిమా స్పెషల్ షోస్ ఆల్ టైం రికార్డు సృష్టించినప్పుడు పవన్ కళ్యాణ్ ఫాన్స్ మీ రికార్డుని మా జల్సా సినిమా తో లేపేస్తాము అంటూ సవాలు విసిరారు..కానీ జల్సా కంటే ముందు తమ్ముడు పోకిరి సినిమా రికార్డుని లేపేయడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం.
ఇక జల్సా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అమెరికా నుండి అనకాపల్లి వరుకు ఈ సినిమా బుకింగ్స్ న భూతొ న భవిష్యతి అనే రేంజ్ లో ఉన్నాయి..ఏ ప్రాంతం లోనైనా బుకింగ్స్ ఓపెన్ చేసిన నిమిషాల వ్యవధి లోనే సోల్డ్ అవుట్ అయిపోవడం చూస్తుంటే పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం అయిపోతుంది..ఇంతటి డిమాండ్ కొత్త సినిమా మొదటి రోజు కూడా ఉండదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..ఎక్కడ చూసిన ఇప్పుడు జల్సా మరియు తమ్ముడు సినిమాల మేనియా నే కనిపిస్తుంది..జల్సా సినిమా కి ఉన్న ఊపు చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా దీనికి 800 కి పైగా షోస్ పడే అవకాశం ఉంది..మరో వైపు తమ్ముడు సినిమాకి 300 షోలు పడే ఛాన్స్ ఉంది..ఇలా ఈ రెండు సినిమాలు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు సరికొత్త బెంచ్ మార్క్ ని ఏర్పాటు చేసే విధంగా దూసుకుపోతున్నాయి..మరి ఈ రికార్డ్స్ ని ఎవరు బ్రేక్ చెయ్యబోతున్నారు అనేది చూడాలి.