
మన సౌత్ ఇండియా లో అందం తో అభినయం ని సమానం గా చూపించే అతి తక్కువ మంది హీరోయిన్స్ లో నయనతార ఒకరు..సౌత్ ఇండియా లో ప్రతి స్టార్ హీరో తో కలిసి నటించిన నయనతార కైవారం హీరోల పక్కన ఉండే హీరోయిన్స్ రోల్స్ మాత్రమే కాదు..లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు..ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ తో విజయశాంతి గారి తర్వాత అన్ని బ్లాక్ బసుతీ హిట్స్ కొట్టిన ఏకైక హీరోయిన్ నయనతార మాత్రమేనట..సినిమాల్లో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన నయనతార ఆమె నిజ జీవితం లో మాత్రం ఎన్నో మలుపులను చూసింది..మొదట్లో హీరో శింబు తో ప్రేమాయణం నడిపింది..రేపో మాపో పెళ్లి అని అనుకుంటున్న సమయం లో బ్రేకప్ అవ్వడం అప్పట్లో పెద్ద సెన్సషనల్ హాట్ టాపిక్ అయ్యింది..ఇక ఆ తర్వాత ప్రభుదేవా తో కూడా ప్రేమలో పడింది..కానీ వీరి రిలేషన్ పెళ్లి పీటల వరుకు వచ్చి ఆగిపోయింది..ఇక ఇటీవలే ఆమె ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లాడిన సంగతి మన అందరికి తెలిసిందే..సుమారు నాలుగేళ్ల నుండి ప్రేమించుకుంటూ డేటింగ్ లో ఉన్న ఈ జంట ఎట్టకేలకు రెండు రోజుల క్రితం మహాబలిపురం లోని ఒక్క రిసార్ట్ లో కుటుంబ సన్నిహితులు మరియు సినీ ప్రముఖులు మధ్య ఘనంగా జరిగింది.
హిందూ సాంప్రదాయాలతో వేదమంత్రాల సాక్షిగా జరిగిన వీళ్లిద్దరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి..చూడడానికి ఎంతో ముచ్చటగా ఉన్న జంట గురించే ఇప్పుడు ఎక్కడ చూసిన చర్చ..ఇది ఇలా ఉండగా అభిమానులకు షాక్ ఇస్తూ నయనతార తీసుకున్న ఒక్క నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సషనల్ గా మారింది..అదేమిటి అంటే ఇక నుండి నయనతార సినిమాలు చెయ్యదంట..ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలు అన్ని పూర్తి చేసి ఇక శాశ్వతంగా సంసార జీవితం ని పరిపూర్ణంగా అనుభవించాలనుకుంటుంది అట..ఇది స్వయంగా ఆమె పెళ్లి లో తన సన్నిహితులతో మాట్లాడిన మాటలు అని కోలీవుడ్ వర్గాల్లో సాగుతున్న చర్చ..ప్రస్తుతం ఆమె షారుక్ ఖాన్ మరియు అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న జవాన్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది..ఇది కాకుండా ఇటీవలే ఆమె సమంత మరియు విజయ్ సేతుపతి తో కలిసి చేసిన కన్మణి రాంబో ఖతీజా సినిమా తమిళ్ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది..విభిన్నమైన పాత్రలతో అభిమానులను అలరించే నయనతార ఇక నుండి సినిమాలు చెయ్యదు అనే వార్తని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
పెళ్లి అయిన రెండు రోజులకే నువ్వు పెట్టిన ఆంక్షల వల్లే ఈరోజు నయనతార సినిమాలు వదిలేసింది అంటూ ఆమె భర్త విగ్నేష్ ని సోషల్ మీడియా లో నయనతార అభిమానులు తిడుతున్నారు..ఇక నయనతార పెళ్లి విశేషాలు గురించి మాట్లాడుకోవాల్సి వస్తే..ఈ పెళ్ళికి ఆమె ఎక్కువ మంది ముఖ్య అతిధులను ఆహ్వానించకుండా ఇండస్ట్రీ లో తనకి బాగా సన్నిహితంగా ఉండే వాళ్లనే ఆహ్వానించింది అట..ఈ పెళ్లి ఈవెంట్ చిరంజీవి, కమల్ హాసన్ , రజినీకాంత్ , షారుక్ ఖాన్ , సూర్య మరియు తమిళ ముఖ్యమంత్రి స్టాలిన్ ముఖ్య అతిధులుగా హాజరు అయినట్టు తెలుస్తుంది..ఇక పెళ్లి రోజు నయనతార తన భర్త కి 20 కోట్ల రూపాయిలు విలువ చేసే ఇల్లు ని బహుమతి గా ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..అంతే కాకుండా వీళ్ళ పెళ్లి వీడియో ని నెట్ ఫ్లిక్స్ వారికి దాదాపుగా రెండున్నర కోటి రూపాయలకు అమ్మారు అట..త్వరలోనే ఈ వీడియో నెట్ ఫ్లిక్స్ లోకి అందుబాటులోకి రానుంది..ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే షారుక్ ఖాన్ తో ఆమె చేస్తున్న జవాన్ సినిమా తో పాటుగా..తెలుగు లో ఆమె మెగాస్టార్ చిరంజీవి తో గాడ్ ఫాదర్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.