
స్టార్ హీరోయిన్ నయనతార ఇటీవల తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వీళ్లు ఇటీవల తమిళనాడులోని మహాబలిపురంలో ఓ హోటల్ వేదికగా అత్యంత ఘనంగా వివాహం చేసుకున్నారు. అయతే గతంలో ప్రభుదేవా, శింబు లాంటి హీరోలతో సహజీవనం చేసిన నయనతార చాన్నాళ్ల తర్వాత పెళ్లి చేసుకోవడంతో ఆమె అభిమానులు కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్‌కు చెందిన కంపెనీ, అతడి టెక్నికల్ యూనిట్ ఈ పెళ్లికి సంబంధించిన చిత్రీకరణ బాధ్యత మొత్తం తీసుకుంది. ప్రతి క్షణాన్ని కెమెరాలో బంధించి నయనతార పెళ్లి వీడియోను విఘ్నేష్‌కు అపురూప కానుక రూపంలో అందించబోతోంది. అంతేకాకుండా వీరి పెళ్లి వీడియోను నెట్‌ఫ్లిక్స్‌లో రెండు పార్టులుగా ప్రసారం చేయనున్నారు.
అటు వివాహం అనంతరం నయనతార, విఘ్నేష్ శివన్ జంట థాయ్‌లాండ్ రాజధాని నగరం బ్యాంకాక్‌కు హనీమూన్ కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత కొద్దిరోజులకే నయనతార షాకింగ్ నిర్ణయం తీసుకుందని.. ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పనుందని ప్రచారం జరుగుతోంది. వివాహం చేసుకున్న తర్వాత వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించాలని నయనతార భావిస్తోందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకుందని ఆమె సన్నిహిత వర్గాలు గతంలో వెల్లడించాయి. కానీ నయనతార మళ్లీ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆమె తాజాగా ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొని అందరికీ షాకిచ్చింది. హనీమూన్ కోసం బ్యాంకాక్ వెళ్లిన ఆమె ఇండియాకు తిరిగి రాగానే జవాన్ అనే బాలీవుడ్ మూవీ షూటింగ్‌లో పాల్గొంది. ఈ సినిమాతో నయనతార బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తోంది. బాలీవుడ్ హీరో షారుఖ్‌ఖాన్ నటిస్తున్న ఈ సినిమాను.
కోలీవుడ్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్నాడు. గతంలో నయనతారతోనే అతడు రాజా-రాణి వంటి బ్లాక్ బస్టర్ హిట్‌ను రూపొందించాడు.తాజా పరిణామంతో నయనతార పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేయనున్నట్లు తెలుస్తోంది. వివాహం తర్వాత ఓపిక ఉన్నంత కాలం వరుస సినిమాలు చేయడానికి విఘ్నేష్ అనుమతి ఇవ్వడంతోనే నయనతార వివాహం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నానుమ్ రౌడీదాన్ అనే సినిమాలో తొలిసారి నయనతార నటించింది. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ సినిమాను తెలుగులో నేనూ రౌడీనే పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఆ తర్వాత రౌడీ పిక్చర్స్ అనే సంస్థను స్థాపించి విఘ్నేష్ శివన్.. నేత్రికన్, కుజంగల్ వంటి చిత్రాలను నిర్మించాడు. మరోవైపు నయనతార ప్రస్తుతం తెలుగులో చిరంజీవి హీరోగా నటిస్తోన్న గాడ్ ఫాదర్ సినిమాలో చిరు చెల్లెలి పాత్రలో నటించింది. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో చిరు, సల్మాన్‌లపై ఒక పాట పిక్చరైజ్ చేస్తే షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. తెలుగు, తమిళంలోనే కాదు నయనతారకు మలయాళంలోనూ మంచి క్రేజ్ ఉంది. ఆమె తమ ప్రాజెక్టు ఒప్పుకుంటే చాలు అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటే నయనతారకు ఉన్న డిమాండ్‌ను అర్ధం చేసుకోవచ్చు.