Home Entertainment పెళ్లి సందడి ఫుల్ రన్ కలెక్షన్స్ ఎక్సక్లూసివ్ గా మీ కోసం

పెళ్లి సందడి ఫుల్ రన్ కలెక్షన్స్ ఎక్సక్లూసివ్ గా మీ కోసం

0 second read
0
0
1,314

కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బ తిన్న తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ తో కాసుల కనక వర్షం కురిపిస్తూ పూర్వ వైభవం ని తీసుకొచ్చింది అనే చెప్పొచ్చు,కరోనా సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత పెద్ద హీరోల సినిమాలు ఇప్పటి వరుకు ఏది రాకపోయినా చిన్న సినిమాలు మరియు మీడియం రేంజ్ హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి, ముఖ్యంగా ఈ దసరా కానుకగా విడుదల అయినా మహా సముద్రం , పెళ్లి సందడి మరియు మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ సినిమాలలో మహా సముద్రం దారుణమైన ఫ్లాప్ గా మిగలగా మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ మరియు పెళ్లి సందడి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సషనల్ హిట్ గా నిలిచాయి, ముఖ్యంగా శ్రీకాంత్ కొడుకు రోషన్ నటించిన పెళ్లి సందడి సినిమా ఎలాంటి చప్పుడు లేకుండా వచ్చి బాక్స్ ఆఫీస్ ని ఒక్క ఊపు ఊపింది, ఈ సినిమా సాధించిన వసూళ్లు చూసి ట్రేడ్ పండితులు సైతం నోరెళ్లబెట్టారు అంటే అది ఏ స్థాయిలో ఘానా విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు,ఒక్కసారి పెళ్ళిసందడి సినిమా ఇప్పటి వరుకు ఎంత వసూళ్లను రాబట్టిందో , ఎంత లాభాలను తెచ్చిపెట్టిందో ఇప్పుడు మనం చూద్దాము.

ఈ సినిమా బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా 5 కోట్ల రూపాయలకు జరగగా మొదటి రోజే అందరిని ఆశ్చర్యపరుస్తూ ఈ సినిమా 2 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది, ఇక పది రోజులకు కలిపి ఈ సినిమా కేవలం నైజం మరియు సీడెడ్ నుండే దాదాపుగా 3 కోట్ల 50 లక్షల రూపాయిలు వసూలు చేసింది, అంటే ఈ సినిమా బిజినెస్ కేవలం రెండు ప్రాంతాల నుండే 70 శాతం కి పైగా రికవరీ చేసింది అంటే మాములు విషయం కాదు, ఇక ఉత్తరాంధ్ర లో 92 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం , తూర్పు గోదావరి జిల్లా నుండి 46 లక్షల రూపాయిలు , పశ్చిమ గోదావరి జిల్లా నుండి 37 లక్షల రూపాయిలు వసూలు చేసింది, ఇక గుంటూరు జిల్లాలో 58 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం కృష్ణ జిల్లా నుండి 41 లక్షల రూపాయిలు నెల్లూరు జిల్లా నుండి 31 లక్షల రూపాయిల షేర్ న వసూలు చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది, మొత్తం మీద కేవలం ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ నుండే ఈ సినిమా 6 కోట్ల 32 లక్షల రూపాయిల షర్ ని వసూలు చేసింది, అంటే కేవలం తెలుగు రాష్ట్రాల నుండి ఒక్క కోటి 32 లక్షల రూపాయిల లాభం వచ్చింది అన్నమాట.

ఇక కర్ణాటక మరియు ఇండియాలోని ఇతర ప్రాంతాల నుండి కలిపి ఈ సినిమా 28 లక్షల రూపాయిలు వసూలు చెయ్యగా ఓవర్సీస్ నుండి 8 లక్షా రూపాయిల షేర్ ని వసూలు చేసింది, అంటే మొత్తం మీద ఈ సినిమా 6 కోట్ల 70 లక్షల రూపాయిలు ఇప్పటి వరుకు వసూలు చేసింది,అంటే దాదాపుగా ఈ సినిమాని కొన్న బయ్యర్లకు ఒక్క కోటి 70 లక్షల రూపాయిల లాభాలు ఇప్పటి వరుకు వచ్చింది, ఇప్ప్పటికీ ఈ సినిమా విజయవంతంగా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో త్౫హీట్రెస్ లో నడుస్తుంది, భవిష్యత్తులో ఇంకా ఈ సినిమా బయ్యర్లకు ఎంత లాభాల్ని తెచ్చిపెడుతుందో చూడాలి, వాస్తవానికి ఈ సినిమాకి పబ్లిక్ టాక్ పెద్దగా లేదు అనే చెప్పాలి, కానీ పాటలు ఒక్క రేంజ్ లో హిట్ అవ్వడం తో థియేటర్స్ కి ఆడియన్స్ ని పరుగులు తీసేలా చేసింది అని చెప్పొచ్చు, ఇక హీరో హీరోయిన్ క్యూట్ పెయిర్ కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యింది, ముఖ్యంగా రోషన్ వేసిన డాన్స్ లకు మరియు ఫైట్స్ కి థియేటర్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, భవిష్యత్తులో రోషన్ తన కెరీర్ ని పక్కాగా ప్లాన్ చేసుకుంటే చాల పెద్ద స్టార్ హీరో అవుతాడు అని చూసిన ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు, మరి పెళ్లి సందడి సినిమాతో మంచి హిట్ ని అందుకున్న రసోహన్ అదే విజయ పరంపర ని కొనసాగిస్తాడో లేదో చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

రమేష్ బాబు గారి భార్య బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వుద్ది

తాజాగా సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు సోదరుడు నటుడు మరియు నిర్మాత అయినా రమేష్ బాబు అ…