Home Entertainment పెళ్లి కాకముందే బిడ్డకి జన్మని ఇచ్చిన ప్రముఖ స్టార్ హీరోయిన్..షాక్ లో ఫాన్స్

పెళ్లి కాకముందే బిడ్డకి జన్మని ఇచ్చిన ప్రముఖ స్టార్ హీరోయిన్..షాక్ లో ఫాన్స్

0 second read
0
1
10,373

నేటి తరం హీరోయిన్స్ లో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటి అమీ జాక్సన్..2010 వ సంవత్సరం లో తమిళ హీరో ఆర్య నటించిన మద్రాస్ పట్టణం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయిన ఈ బ్రిటిష్ బ్యూటీ తోలి సినిమా తోనే మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకుంది..ఇక ఆ తర్వాత ఎక్కువ శాతం తమిళ్ మరియు హిందీ సినిమాలలోనే నటించిన ఈ అమ్మాయి..తెలుగు లో మాత్రం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ఎవడు సినిమాలో మాత్రమే కనిపించింది..ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ అయ్యినప్పటికీ కూడా ఈ హీరోయిన్ ఎక్కువగా తమిళ సినిమా ఇండస్ట్రీ మీదనే ఫోకస్ చేసింది..ఈ సినిమా తర్వాత ఈమెకి కోలీవుడ్ లో మంచి క్రేజీ ఆఫర్స్ వచ్చాయి..ఎవడు సినిమా తర్వాత ఈ అమ్మడు కి ఏకంగా శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ వచ్చింది..శంకర్ – విక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఐ’ సినిమా అప్పట్లో ఎంతటి భారీ అంచనాల నడుమ విడుదల అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈ సినిమాలో అమీ జాక్సన్ నటనకి మంచి మార్కులే పడ్డాయి.

ఇక ఆ తర్వాత తమిళ స్టార్ హీరో విజయ్ తో తేరి మరియు సూపర్ స్టార్ రజినీకాంత్ – శంకర్ కాంబినేషన్ లో వచ్చిన రోబో 2.0 ఇలా వరుసగా క్రేజీ ఆఫర్స్ వస్తూ సౌత్ ఇండియాలోనే టాప్ మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లో ఒక్కరిగా మారుతున్న సమయం లో ప్రముఖ పారిశ్రామికవేత్త జార్జ్ పనాయితో ప్రేమలో పడిన తర్వాత సినిమా కెరీర్ ని పూర్తిగా లైట్ తీసుకుంది..సౌత్ ఇండియా మొత్తం ఏడిద పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్స్ వచ్చినప్పటికీ కూడా వాటి అన్నిటిని వదులుకొని జార్జ్ తో డేటింగ్ చేస్తూ సినిమాలకు గుడ్బై చెప్పేసింది..సుమారు నాలుగేళ్ల పాటు ఈ ఇద్దరి జంట డేటింగ్ చేసారు..పెళ్లి చేసుకోకుండానే ఒక్క మెగా బిడ్డకి జన్మని కూడా ఇచ్చారు..రేపో మాపో పెళ్లి చేసుకుంటారు అని అందరు అనుకుంటున్న సమయం లో వీళ్లిద్దరికీ బ్రేకప్ అయ్యింది అని సోషల్ మీడియా లో వార్తలు వచ్చాయి..అమీ జాక్సన్ కూడా చాలా కాలం నుండి కేవలం తన బిడ్డతో కలిసి దిగిన ఫొటోలే పెడుతుంది తప్ప జార్జ్ తో కలిసి దిగిన ఫోటోలను ఇటీవల కాలం లో షేర్ చెయ్యలేదు..దీనిని బట్టి చూస్తుంటే వీళ్లిద్దరు నిజంగానే విడిపోయారు అని అందరూ అనుకున్నారు.

అందరి అంచనాలను కరెక్ట్ చేస్తూ ఈ జంట విడిపోయింది అని ఇటీవల అమీ జాక్సన్ పెట్టిన ఒక్క పోస్ట్ తో ప్రూవ్ అయిపోయింది..ప్రస్తుతం ఆమె బ్రిటిష్ పాపులర్ నటుడు ఎడ్ వెస్ట్ విక్ తో ప్రేమలో ఉన్నట్టు..ప్రస్తుతం మేము ఇద్దరం డేటింగ్ లో ఉన్నట్టు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఒక్క పోస్ట్ పెట్టింది..ఈ పోస్టు ని చూసిన ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యారు..పెళ్లి కాకుండానే ఒక్కరితో డేటింగ్ చేసి బిడ్డకి జన్మని ఇచ్చిన తర్వాత అతనిని పెళ్ళి చేసుకోకుండా..అతనితో బ్రేకప్ చేసుకొని వేరే అతనిని ప్రేమించడం ఏమిటి అని సోషల్ మీడియా లో నెటిజెన్లు పెదవి విరుస్తున్నారు.. కానీ ఇద్దరి వ్యక్తిగత జీవితం గురించి మనకి ఏమి తెలియకుండా కామెంట్స్ చెయ్యడం అసలు కరెక్ట్ కాదు అని..ఇద్దరిలో ఎవరిదీ తప్పు అనేది తెలీకుండా ఎలా మాట్లాడుతారు అని కొంతమంది అభిమానులు అమీ జాక్సన్ కి సపోర్టు గా నిలిచారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…