
టాలీవుడ్ లో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు పూజ హెగ్డే..స్టార్ హీరో సినిమా లేని సంవత్సరం అయినా ఉంటుంది ఏమో కానీ, పూజ హెగ్డే హీరోయిన్ గా లేని సంవత్సరం మాత్రం ఉండదు..కుర్ర హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వరుకు ప్రతీ ఒక్కరికి తమ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే మాత్రమే కావాలి అనే రేంజ్ లో ఆమె క్రేజ్ ని ఏర్పర్చుకుంది..కేవలం టాలీవుడ్ ,కోలీవుడ్ మాత్రమే కాదు..ఈ అమ్మడి క్రేజ్ బాలీవుడ్ వరుకు పాకింది..అక్కడ స్టార్ హీరోలందరూ ఇప్పుడు పూజ హెగ్డే డేట్స్ కోసం పోటీ పడుతున్నారు..ఇదంతా పక్కన పెడితే పూజ హెగ్డే బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ తో ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నట్టు బాలీవుడ్ లో ఒక రూమర్ గత కొంత కాలం నుండి తెగ ప్రచారం అవుతుంది..వీళ్లిద్దరు కలిసి హిందీ లో ‘కిసీ కా భాయ్..కిసీ కా జాన్’ అనే సినిమాలో నటిస్తున్నారు.
ఏడాది నుండి విరామం లేకుండా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి అయ్యింది..ఈ చిత్రం మన విక్టరీ వెంకటేష్ ఒక ముఖ్య పాత్ర పోషించాడు..ఈ సినిమా షూటింగ్ సమయం లో పూజ హెగ్డే మరియు సల్మాన్ ఖాన్ బాగా క్లోజ్ అయ్యారట..వీళ్లిద్దరు చాలా సమయం ప్రైవేట్ స్పేస్ లో కూడా గడిపినట్టు సమాచారం..ఆ ప్రైవేట్ స్పేస్ లో ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడే కలిసి డేటింగ్ చెయ్యాలనే నిర్ణయానికి వచ్చినట్టు బాలీవుడ్ లో ఒక వార్త కోడై కూస్తుంది..అంతే కాకుండా సల్మాన్ ఖాన్ తర్వాతే చెయ్యబొయ్యే మూడు సినిమాల్లో కూడా పూజ హెగ్డే నే హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది..అగ్రిమెంట్ కూడా అయిపోయింది అట..మరి వీళ్లిద్దరు కేవలం డేటింగ్ మాత్రమే చేసుకుంటారా..లేదా పెళ్లి కూడా చేసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది..సల్మాన్ ఖాన్ వయస్సు ప్రస్తుతం 56 ఏళ్ళు..పూజ హెగ్డే వయస్సు 32 ఏళ్ళు..ఇద్దరి మధ్య దాదాపుగా 23 ఏళ్ళ తేడా ఉంది..మన టాలీవుడ్ లో ఇలాంటివి జరిగితే చాలా దారుణంగా తిడుతారు..కానీ బాలీవుడ్ లో ఇలాంటివి సర్వసాధారణం.
ఇక సల్మాన్ ఖాన్ కి బాలీవుడ్ లో హీరోయిన్స్ తో డేటింగ్ చెయ్యడం చాలా కామన్..గతం లో ఆయన ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్ మరియు ఆసిన్ వంటి వారితో డేటింగ్ చేసాడు..కత్రినా కైఫ్ తో అయితే పెళ్లి వరుకు వ్యవహారం వచ్చింది కానీ , ఎందుకో చివరి నిమిషం లో రద్దు అయ్యింది..ఇక ఐశ్వర్య రాయ్ విషయం లో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..వీళ్ళ ప్రేమ వ్యవహారం అప్పట్లో ఒక సెన్సేషన్..అలా మనోడు చాలా మంది హీరోయిన్స్ తో డేటింగ్ చేసాడు కానీ..ఇప్పటి వరుకు పెళ్లి అయితే చేసుకోలేదు..ప్రస్తుతం పూజ హెగ్డే తో డేటింగ్ చేసిన కూడా అది పెళ్లి పీటలు వరుకు కచ్చితంగా వెళ్ళదు అని చెప్పొచ్చు..చూడాలి మరి ఏమి ఇందులో ఎంత మాత్రం నిజాలు ఉన్నాయో అనేది..ప్రస్తుతం పూజ హెగ్డే మన టాలీవుడ్ లో మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.