Home Entertainment పుష్ప2 ఆపేసి హాలిడే ట్రిప్స్ వేస్తున్న అల్లు అర్జున్.. కారణం అదేనా!

పుష్ప2 ఆపేసి హాలిడే ట్రిప్స్ వేస్తున్న అల్లు అర్జున్.. కారణం అదేనా!

0 second read
0
0
157

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మన తెలుగు రాష్ట్రాల లో తో పాటు మలయాళం లో కూడా అంతే క్రేజ్ ఉన్న హీరో. ఆయన నటన, డాన్స్, స్టైల్ తో ఐకాన్ స్టార్ గా ఎదిగారు అల్లు అర్జున్. ఈ మధ్య కాలంలో ఆయన నటించిన ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్థాయి lo గుర్తింపు తెచ్చుకున్నారాయన. పుష్ప 2 మీద ఎంత క్రేజ్ ఉందొ దాని బిజినెస్ కూడా అదే స్థాయి లో ఉంది , దాదాపు 1200 కోట్ల వరకు పుష్ప 2 కలెక్ట్ చేస్తుంది అని అంచనా ఉంది. ఇటు సినిమాలతో పాటు అటు సోషల్ మీడియాలోనూ ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉంది. అలాగే ఆయన సతీమణి స్నేహరెడ్డి కూడా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు. అల్లు అర్జున్ స్నేహారెడ్డిని 2011లో వివాహం చేసుకున్నారు. వీరికి అల్లు అయాన్, అర్హా ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. మార్చి 6న వీరి పెళ్లి రోజు కావడంతో తన భార్యకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అల్లు అర్జున్. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారాయన. ‘హ్యపీ యానివర్సరీ క్యూటీ’ అంటూ లవ్ సింబల్‌తో ఆమెపై ఉన్న ప్రేమను వ్యక్తం చేశారు. అంతేకాకుండా భార్యతో దిగిన ఓ బ్యూటిఫుల్ ఫోటోను కూడా షేర్ చేశారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్స్ చేస్తున్నారు.

Allu Arjun wishes his 'cutie', wife Sneha Reddy on her birthday with family  pic - Hindustan Times

ఇక స్నేహరెడ్డి కూడా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. ఆమెకు సోషల్ మీడియా లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటారామె. తన గ్లామర్ తో హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటాయి స్నేహరెడ్డి ఫోటోలు. అందుకే ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే తన ఫ్యామిలీకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటారు స్నేహరెడ్డి. ఇటీవలే అల్లు అర్జున్ ఫ్యామిలీ తల్లి తండ్రీ, అన్న, వదినా, తమ్ముడు శిరీష్, భార్యా పిల్లలతో కలసి ఫారిన్ ట్రిప్ కు వెళ్లారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి కూడా. ప్రస్తుతం అల్లు అర్జున్ పెళ్లి రోజు సందర్భంగా ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

Allu Arjun colour coordinates with his family during Tanzania vacation,  fans shower love | Entertainment News,The Indian Express

అల్లు అర్జున్ గారు ప్రస్తుతం ‘పుష్ప 2’ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా దేశవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమాలో పాటలు, డైలాగ్ లు చాలా రోజుల పాటు ట్రెండ్ అయ్యాయి కూడా. దీంతో ఈ మూవీ సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు పెరిగాయి. అందుకే ఈ మూవీ విషయంలో చిత్ర బృందం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ సినిమా షూటింగ్ కోసం అల్లు అర్జున్ చాలా సినిమాలకు నో చెప్తున్నారు. ఇటీవలే ఓ బడా బాలీవుడ్ హీరో సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినా ‘పుష్ప 2’ కోసం ఆ మూవీకు నో చెప్పారట అల్లు అర్జున్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అందాల తార రష్మిక నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సినిమాను విడుదల చేయనున్నారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…