
ప్రస్తుతం మెగా కాంపౌండ్‌లో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ హీరోలుగా కెరీర్లో దూసుకుపోతున్నారు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్, ఆర్.ఆర్.ఆర్ సినిమాతో రామ్‌చరణ్ పాన్ వరల్డ్ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు. వీళ్లిద్దరూ ఇంచుమించు ఒకేసారి టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. చిరుతతో రామ్‌చరణ్, గంగోత్రి సినిమాతో అల్లు అర్జున్ తొలి సినిమాలతోనే సూపర్ హిట్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రికార్డులను కొల్లగొట్టింది. ఇప్పుడు పుష్ప ది రూల్ కోసం సుకుమార్ స్క్రిప్ట్ సిద్ధం చేసి షూటింగ్‌కు రెడీగా ఉన్నాడు. తాజాగా ఈ సినిమాలో రామ్‌చరణ్ కూడా నటిస్తున్నాడని ఫిలింనగర్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే అల్లు అర్జున్, రామ్‌చరణ్ కలిసి ఓ సినిమాలో నటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఎవడు సినిమాలో వీళ్లిద్దరూ కలిసి నటించగా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసింది. ఎవడు సినిమాలో బన్నీ గెస్ట్ రోల్ పోషించగా.. ఇప్పుడు పుష్ప సినిమాలో చరణ్ గెస్ట్ రోల్లో కనిపిస్తాడని టాక్ నడుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో చరణ్ నటించిన రంగస్థలం అతడి కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయింది. ఈ సినిమాతో సుక్కూతో చరణ్‌కు మంచి బాండింగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో పుష్ప-2 సినిమాలో నటించాలని చరణ్‌ను సుకుమార్ అడగ్గా అతడు అంగీకరించినట్లు తెలుస్తోంది. పుష్ప 2 సినిమా క్లైమాక్స్‌లో అల్లు అర్జున్‌కు ఓ సమస్య వస్తుందని.. ఆ సమయంలో చరణ్ ఎంట్రీ ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్‌ను సుకుమార్ ఫాలో అవుతున్నాడని సమాచారం.
పాన్ ఇండియా సినిమా అంటే అదనపు ఆకర్షణలు ఉండాలని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు. దీంతో పుష్ప సిరీస్‌లోకి కావాలనే చరణ్‌ను ఎంట్రీ చేస్తున్నట్లు గాసిప్స్ నడుస్తున్నాయి. ఈ వార్త నిజం కావాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. పుష్ప సినిమాలో బన్నీ డిఫరెంట్ గెటప్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఊర మాస్ గెటప్‌లో బన్నీ నటన, బడీ లాంగ్వేజ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సుకుమార్ మేకింగ్, బన్నీ యాక్టింగ్ పుష్ప సినిమాను పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌గా నిలబెట్టాయి. ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా భారీ వసూళ్లను కూడా రాబట్టింది. ముఖ్యంగా తగ్గేదే లే డైలాగ్ అందరినీ అలరించింది. విశ్వవ్యాప్తంగా ఈ డైలాగ్‌తో ఎంతోమంది సోషల్ మీడియాలో రీల్స్ చేశారు. కాగా పుష్ప సినిమాను త్వరలో రష్యాలోనూ విడుదల చేస్తున్నారు. పుష్ప ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ ఇటీవల రష్యా వెళ్లింది. డిసెంబర్ 1న మాస్కోలో, డిసెంబర్ 3న సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో మీడియాతో ఇంటరాక్ట్ అయిన అల్లు అర్జున్, సుకుమార్ అండ్ టీం అక్కడ పుష్ప సినిమాకి మంచి బజ్ క్రియేట్ చేశారు. పుష్ప 2 మూవీని కూడా ఎవ్వరూ ఊహించని రీతిలో విడుదల చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి 20కి పైగా దేశాల్లో ఈ సినిమాను విడుదల చేయాలని సుకుమార్ టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.