Home Entertainment పుష్ప పార్ట్ 2 ట్రైలర్ ఎక్సక్లూసివ్ గా మీ కోసం

పుష్ప పార్ట్ 2 ట్రైలర్ ఎక్సక్లూసివ్ గా మీ కోసం

0 second read
0
0
2,748

ఈ ఏడాది చివరిలో భారీ అంచనాలతో వచ్చి బాక్స్ ఆఫీస్ ని ఒక్క రేంజ్ లో కుమ్మేసిన సినిమా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన పుష్ప సినిమా, మొదట్లో కాస్త ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ రెండవ రోజు నుండి టాక్ బాగా పాజిటివ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద ఒక్క తెలుగు లో మాత్రమే కాకుండా హిందీ , తమిళ్ , మలయాళం బాషలలో కూడా బాహుబలి తర్వాత ఆ స్థాయి వసూళ్లు సాధించిన చిత్రం గా సరికొత్త చరిత్ర సృష్టించింది, విడుదల అయ్యి 20 రోజులు దాటుతున్న కూడా పుష్ప సినిమా హిందీ లో ఇప్పటికి రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతూనే ఉంది,ఈ స్థాయి లో ఈ ఏడాది బాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ ని దంచికొట్టిన సినిమానే మరొక్కటి లేదు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు, పుష్ప పార్ట్ 1 రేంజ్ ఈ స్థాయిలో ఉంటె ఇక పార్ట్ 2 రేంజ్ ఏ స్థాయిలో ఉండబోతుందో అని అటు అభిమానులు ఇటు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు, ఇక పుష్ప పార్ట్ 2 సినిమా షూటింగ్ వచ్చే ఏడాది లో ప్రారంభం అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే.

ఇది ఇలా ఉండగా పుష్ప పార్ట్ 2 కి సంబంధించిన కొన్ని సన్నివేశాలు పార్ట్ 1 తీస్తున్న సమయం లోనే తెరకెక్కించాడు అట డైరెక్టర్ సుకుమార్, ఈ సన్నివేశాల్లోని కొన్ని షాట్స్ ని కలిపి ఒక్క ట్రైలర్ లాగ ఈ సంక్రాంతి రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు అట సుకుమార్, ఈ ట్రైలర్ పార్ట్ 2 మీద అభిమానుల్లో అంచనాలను పదింతలు చేసే విధంగా ఉండబోతుంది అట, అల్లు అర్జున్ మరియు ఫహద్ ఫాజిల్ మధ్య వచ్చే సన్నివేశాలు అభిమానులకు రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తాయి అట, అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా షూటింగ్ ని ఏప్రిల్ నెలలో ప్రారంబించి వచ్చే దసరా కి విడుదల చేసే అవకాశం ఉంది అని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగ వినిపిస్తున్న వార్త, బాహుబలి పార్ట్ 2 మరియు కేజీఎఫ్ పార్ట్ 2 వంటి సినిమాల కోసం ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూసారో పుష్ప పార్ట్ 2 కోసం కూడా అదే స్థాయిలో ఎదురు చూస్తారు అనే గట్టి నమ్మకం తో ఉన్నారు పుష్ప సినిమా దర్శక నిర్మాతలు, మరి ఆ స్థాయిని ఈ సినిమా అందుకుంటుందా లేదా అనేది తెలియాలి అంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

ఇక వెండితెర మీద అద్భుతాలు సృష్టించిన పుష్ప సినిమా అతి త్వరలోనే బుల్లిటరా మీద సందడి చేయనుంది, ఈనెల 7 వ తారీకు నుండి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో తెలుగు , తమిళం , హిందీ మరియు కన్నడ బాషలలో అందుబాటులోకి రానుంది, హిందీ వెర్షన్ మాత్రం ఇప్పటికి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు రాబడుతుండడం తో హిందీ వరుకు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ని కొంతకాలం ఆపివేశారు, ఈ సినిమా డిజిటల్ మరియు థియేట్రికల్ హక్కులను గోల్డ్ మైన్స్ సంస్థ వారు కొనుగోలు చేసిన సంగతి మన అందరికి తెలిసిందే, మరి ఈ సినిమా ఆన్లైన్ వెర్షన్ ని వారి యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేస్తారో, లేకపోతే వేరే ఓటీటీ ఛానల్ కి అమ్ముకుంటారో అనే విషయం తెలియాల్సి ఉంది, హిందీ లో ఈ సినిమా ఇప్పటి వరుకు 70 కోట్ల రూపాయిల నెట్ ని వసూలు చేసింది, ఫుల్ రన్ లో ఈ సినిమా 100 కోట్ల రూపాయిల నెట్ ని వసూలు చేసే అవకాశం ఉంది అని బాలీవుడ్ ట్రేడ్ వర్గాల అంచనా, మరి పుష్పరాజ్ బాక్స్ ఆఫీస్ విద్వాంసం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

పెళ్ళైన హీరో తో పబ్లిక్ గా రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన హీరోయిన్ కైరా అద్వానీ..షాక్ లో ఫాన్స్

చేసిన రెండు మూడు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోవడం అంటే మాములు విషయం కాదు..మన ఇండస…