Home Entertainment పునీత్ రాజ్ కుమార్ జేమ్స్ మూవీ మొదటి రోజు వసూళ్లు ఎక్సక్లూసివ్ గా మీకోసం

పునీత్ రాజ్ కుమార్ జేమ్స్ మూవీ మొదటి రోజు వసూళ్లు ఎక్సక్లూసివ్ గా మీకోసం

0 second read
0
0
140

ఇటీవల కాలం లో యావత్తు సినీ లోకాన్ని శోక సంద్రం లోకి నెట్టేసిన ఒక్క ఘటన పునీత్ రాజ్ కుమార్ మరణించడం , కన్నడ చలన చిత్ర పరిశ్రమలో పునీత్ రాజ్ కుమార్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు , ఆయన సినిమా వస్తుంది అంటే చాలు కర్ణాటక ప్రాంతం మొత్తం పండగ వాతావరణం సంతరించుకొని సంబరాల్లో ముండిగి తేలుతుంది, పునీత్ రాజ్ కుమార్ గారి తండ్రి రాజ్ కుమార్ తర్వాత కన్నడ చిత్ర ప్రేక్షుకులు గుండెల్లో పెట్టుకున్న నటుడు ఆయన తనయుడు పునీత్ రాజ్ కుమార్, కేవలం సినిమాల్లోనే కాదు , నిజ జీవితం లో కూడా ఎన్నో సేవ కార్యక్రమాలు చేసి రియల్ హీరో అని కూడా అనిపించుకున్నాడు,అందుకే ఆయన చనిపోయిన తర్వాత ఒక్క కన్నడ అభిమానులు మాత్రమే కాదు , అసలు ఆయన సినిమాలను కూడా చూడని ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా గుండెలు బాదుకుని ఏడ్చారు,ఇది ఇలా ఉండగా పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం జేమ్స్ నిన్న ప్రపంచవ్యాప్తంగా అన్ని రంథియా బాషలలో ఘనంగా విడుదల చేసిన సంగతి మన అందరికి తెలిసిందే, పునీత్ రాజ్ కుమార్ గారి చివరి చిత్రం కావడం తో కన్నడ ప్రేక్షకులు మొత్తం నిన్న థియేటర్స్ లోనే కాలం గడిపేశారు, ఒక్కసారి ఈ మూవీ కి మొదటి రోజు ఎంత కలెక్షన్స్ వచ్చాయి, ఈ సినిమా ఎలాంటి ఆల్ టైం రికార్డ్స్ ని సృష్టించింది అనేది ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

పునీత్ రాజ్ కుమార్ గారి చివరి చిత్రం అయ్యే సరికి జేమ్స్ సినిమాకి ప్రారంభం నుండే ఒక్క రేంజ్ క్రేజ్ మరియు డిమాండ్ ఉంది,ఆ క్రేజ్ కి తగట్టు గానే ఈ సినిమా బిజినెస్ ఎవ్వరి ఊహలకు అందని రేంజ్ లో జరిగింది, దానికి తగ్గట్టుగానే ఈసినిమాని కర్ణాటక ప్రాంతం లో కనివిని ఎరుగని రేంజ్ లో రిలీజ్ చేసారు,ఇక ఓపెనింగ్స్ అయితే ఈసినిమాకి ఒక్క రోజులో అమ్ముడుపోయిన టిక్కెట్లు 88 ఏళ్ళ కన్నడ చలన చిత్ర పరిశ్రమలో ఏ సినిమాకి కూడా అమ్ముడుపోలేదు అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి , మొత్తం మీద ఈ సినిమాకి కన్నడ లో మొదటి రోజు దాదాపుగా 30 కోట్ల రుపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి, ఇది కన్నడ చలన చిత్ర చరిత్ర లోనే ఒక్క ఆల్ టైం రికార్డు అని చెప్పొచ్చు, ముందు ఉన్న అన్ని ఓపెనింగ్ రికార్డ్స్ కంటే ఈ సినిమా ఓపెనింగ్స్ రికార్డు డబల్ ట్రిపుల్ మార్జిన్ తో కొట్టడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం, కన్నడ సినీ ఇండస్ట్రీ లో అత్యధిక డే 1 రికార్డ్స్ ఉన్న హీరో పునీత్ రాజ్ కుమార్ గారే,అలాంటి హీరో చివరి సినిమా అంటే ఏ స్థాయి లో ఉంటుందో సాధారణంగానే మనం ఒక్క అంచనా వేసుకోవచ్చు , ఆ అంచనాలను మించి ఈ సినిమా ఓపెనింగ్ రికార్డ్స్ ని కొట్టడం ని చూస్తుంటే పునీత్ రాజ్ కుమార్ గారిని అక్కడి ప్రజలు ఎంతలా అభిమానిస్తారో అర్థం చేసుకోవచ్చు.

మొదటి రోజు ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా రెండవ రోజు కూడా అదే స్థాయిలో కలెక్షన్స్ ని రాబడుతూ పునీత్ రాజ్ కుమార్ గారి పై కన్నడ పేక్షకులు తమ అభిమానం ని చాటుకుంటున్నారు, ఈ సినిమా కి వస్తున్నా కలెక్టన్ల ప్రవాహం చూస్తుంటే ఇప్పట్లో ఆగేలా కనిపిసిమ్హడం లేదు అని, కన్నడ చలన చిత్ర పరిశ్రమలో బాహుబలి తర్వాత తోలి 100 కోట్ల రూపాయిల సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది అని, అది కూడా అతి వేగంగా 100 కోట్ల మార్కుని అందుకోబోతుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి , ఈ సినిమా ఓపెనింగ్ రికార్డ్స్ ని ఇప్పట్లో మరో కన్నడ సినిమా కొట్టే అవకాశమే లేదు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి, ఇక తెలుగు లో కూడా ఈ సినిమా డీసెంట్ ఓపెనింగ్స్ ని దక్కించుకుంది ,ఈ సినిమా విజయం ని చోసిఎందుకు తమ అభిమాన హీరో లేదు , ఇక పై రాడు అని తెలిసి ఆయన అభిమానులు పడే ఆత్మా వేదన ఎలాంటిదో మాటలో వర్ణించలేనిది , ఇలాంటి పరిస్థితి ఏ హీరో అభిమానికి కూడా రాకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

చిరంజీవి ఇంట్లో బాలయ్య బాబు సినిమా షూటింగ్..షాక్ లో ఫాన్స్

మన టాలీవుడ్ లో చిరంజీవి మరియు బాలకృష్ణ కి ఎలాంటి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా…