Home Entertainment పునీత్ రాజ్ కుమార్ జేమ్స్ 3 రోజుల వసూళ్లు ఎక్సక్లూసివ్ గా మీకోసం

పునీత్ రాజ్ కుమార్ జేమ్స్ 3 రోజుల వసూళ్లు ఎక్సక్లూసివ్ గా మీకోసం

0 second read
0
0
211

గత ఏడాది అక్టోబర్ నెలలో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారి అకాల మరణం మన అందరికిని ఎంత కృంగిపోయ్యేలా చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, నిజానికి పునీత్ రాజ్ కుమార్ గారి సినిమాలు మనం ఒక్కటి కూడా చూసి ఉందాము, కానీ ప్రజల కోసం పిల్ల కోసం ఆయన చేసిన సేవ కార్యక్రమాలు అలాగే ఆయన చేసిన ఎన్నో లెక్కలేనన్ని మంచి పనులు ఆయన గురించి ప్రతి ఒక్కరు బాధపడేలా చేసాయి, ఇలాంటి మంచి వ్యక్తి ని దేవుడు ఎలా తీసుకెళ్ళిపొయ్యాడు అని ప్రతి ఒక్కరి గుండె బరువెక్కిపోయింది, కన్నడ లో పునీత్ రాజ్ కుమార్ గారిని ఎంతలా ఆరాధిస్తారో అని ఉదాహరణకి చెప్పేదే ఆయన హీరో గా నటించిన ఆఖరి సినిమా జేమ్స్ వసూళ్లు, ఈ సినిమా మొదటి రోజు సృష్టించిన ప్రభంజనమ్ మామూలుది కాదు, దశాబ్దాల నుండి థియేటర్స్ కి కదలని ప్రేక్షకులు కూడా కడసారి పునీత్ రాజ్ కుమార్ గారిని వేడితెర మీద చూసుకునేందుకు కదిలి థియేటర్స్ కి వచ్చారు అంటే ఆయనని ప్రజలు ఏ స్థానం లో పెట్టుకున్నారో చెప్పవచ్చు , ఇప్పటికి ఈ సినిమా విడుదల అయ్యి మూడు రోజులు కావొస్తుంది, ఈ మూడు రోజుల్లో ఈ సినిమా కర్ణాటక లో ఎంత వసూలు చేసిందో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

మొదటి రోజు ఈ సినిమా 88 ఏళ్ళ కన్నడ చలన చిత్ర పరిశ్రమలో లో ఎన్నడూ చూడని రేంజ్ ఓపెనింగ్ ని సాధించి , మొదటి రోజు దాదాపుగా 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం రెండవ రోజు 20 కోట్ల రూపాయిల గ్రాస్ , మూడవ రోజు 22 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకునట్టు కన్నడ ట్రేడ్ వర్గాల్లో జరుగుతున్న చర్చ , తోలి మూడు రోజుల్లోనే ఈ సినిమా 70 కోట్ల రూపాయిల గ్రాస్ మార్క్ ని అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది అని కన్నడ ట్రేడ్ వర్గాల్లో సాగుతున్న చర్చ,జేమ్స్ సినిమాకి మొదటి మూడు రోజుల్లో వచ్చిన వసూళ్లతో కన్నడ లో ఒక్క భారీ బడ్జెట్ సినిమానే తీసేయొచ్చు అనే విధంగా ఆ వసూళ్లు వచ్చాయట, ఇది పునీత్ రాజ్ కుమార్ గారికి కన్నడ చిత్ర ప్రేక్షకులు ఘనంగా అందిస్తున్న నివాళి అని చెప్పొచ్చు, ఇక తెలుగు లో కూడా ఈ సినిమాకి డీసెంట్ ఓపెనింగ్ దక్కింది అనే చెప్పాలి , గతం లో పునీత్ రాజ్ కుమార్ హీరో గా నటించిన యువరత్న సినిమా కూడా మన తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ గానే ఆడింది, ఫుల్ రన్ లో ఈ సినిమా తెలుగు లో రెండు నుండి మూడు కోట్ల రూపాయల షేర్ సాదికంహే అవకాశం ఉంది ట్రేడ్ వర్గాల అంచనా .

మొత్తానికి పునీత్ రాజ్ కుమార్ గారికి ఆయన అభిమానులు జేమ్స్ సినిమా ద్వారా చరిత్ర లో ఏ స్టార్ కి కూడా జరగనటువంటి ఘనమైన నివాళి అర్పించారు అనే చెప్పాలి, తమ అభిమాన హీరో సినిమా విడుదల అవుతుంది అని సంతోషం చూపించాలా?, లేదా తమ హీరో ఇక ఎప్పటికి రాడు, ఈ లోకం లో లేదు, ఇక ఎప్పటికి ఆయన సినిమా మనం చూడలేము , ఆయన సేవలు మనం అందుకోలేము, ముఖ్యంగా ఆయన చిరు నవ్వుని ఇక మనం ఎప్పటికి చూడలేం అని బాధపడాలో అర్థం కానీ సందిగ్ద పరిస్థితి లో ఉన్న అభిమానుల బాధ ని వర్ణించండం ఎవరి తరం కాదు అనే చెప్పాలి, మనకే ఇంత బాధగా ఉంటె ఇక ఆయన కుటుంబ సబ్యులకు ఏ స్థాయిలో బాధ ఉంటుందో ఊహించడం కూడా మన తరం కాదు అనే చెప్పాలి,ఆయన ఆత్మకి ఎక్కడ ఉన్న శాంతి చేకూరాలి అని మనస్ఫూర్తిగా మనం అందరం కోరుకుందాము.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

స్టార్ డైరెక్టర్ లైంగిక వేధింపులకు గురైన వరలక్ష్మి శరత్ కుమార్..కంటతడి పెట్టిస్తున్న లేటెస్ట్ వీడియో

వరలక్ష్మి శరత్ కుమార్ అనే పేరు తెలియని వాళ్ళు ఉండరు ఎందుకు అంటే చాల మంది కి ఈమె క్యారెక్టర…