
కన్నడ చలన చిత్ర పరిశ్రమలో స్వర్గీయ శ్రీ రాజ్ కుమార్ గారి నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి బాల నటుడిగా దాదాపు 14 సినిమాల్లో నటించి, ఆ తర్వాత హీరో గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంబించి ఎన్నో సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ కోట్లాది మంది కన్నడ ప్రజల ఆదరాభిమానాలు అందుకున్న హీరో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నిన్న జిమ్ చేస్తున్న సమయం లో గుండె పోతూ వచ్చి మరణించిన ఘటన మన అందరిని ఎలాంటి శోకసంద్రం లో ముంచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,మనకే ఇంత బాధగా ఉంటె ఇక పునీత్ రాజ్ కుమార్ అభిమానులకు మరియు ఆయన కుటుంబీకులకు ఎంత బాధగా ఉంటుందో మాటల్లో వర్ణించలేనిది,పునీత్ కుమార్ అంటే కేవలం ఒక్క మనిషి మాత్రమే కాదు, కోట్లాది మంది అభిమానుల గుండె చప్పుడు, తనని నమ్ముకొని బ్రతుకుతున్న లక్షలాది మంది సినీ కార్మికుల పాలిట దేవుడు, కన్నడ బాక్స్ ఆఫీస్ కి ఇలవేల్పు ఆయన , కన్నడ ప్రజలు వారి బాషాని ఎంతలా అయితే అభిమానిస్తారో రాజ్ కుమార్ కుటుంబాన్ని కూడా అదే స్థాయిలో ఆరాధిస్తారు, ఇప్పటికి రాజ్ కుమార్ గారి ఫోటో ప్రతి ఇంట్లో ఉంటుంది అంటే వారి కుంటుంబాన్ని యిక్కడి ప్రజలు ఏ స్థాయిలో అభిమానిస్తారో అర్థం చేసుకోవచ్చు.
ఇక పునీత్ రాజ్ కుమార్ చనిపొయ్యే ముందు రోజు కూడా తన అన్నయ్య హీరో గా నటించిన భజరంగి 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు అయ్యి, అద్భుతమైన స్పీచ్ ఇచ్చి స్టేజి మీద తన అన్నయ్య మరియు కేజీఎఫ్ హీరో యాష్ తో కలిసి డాన్స్ చేసాడు, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా అంతటా చక్కర్లు కొడుతోంది, అంత హుషారు గా ఉన్న పునీత్ రాజ్ కుమార్ పక్క రోజు అలా జీవం లేక పది ఉండడం చూసి ఆయన కుటుంబీకులు ఎంతలా బాధ పది ఉంటారో ఊహించడం అసాధ్యం, పునీత్ రాజ్ కుమార్ గారికి మును రోజు రాత్రి నుండే గుండెలో కాస్త ఇబ్బందిగా ఉన్నింది అని, పక్క రోజు జిమ్ చేసేసరికి ఆ నొప్పి బాగా ఎక్కువ అయ్యి ఈరోజు మన అందరం బాధ పడేలా చేసింది అంటూ పునీత్ రాజ్ కుమార్ సెక్యూరిటీ గార్డ్ మీడియా తో తెలిపారు, మొదటి నుండి ఫిట్నెస్ ఫ్రీక్ అయినా పునీత్ రాజ్ కుమార్ , బాడీ లో ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆ ఒక్క రోజు జిమ్ చెయ్యంకుండా ఉంది ఉంటె రోజు కోట్లాది మంది అభిమానులు ఇంతలా బాధ పడాల్సిన పరిస్థితి వచ్చేది కాదు.
బ్రతికి ఉన్నన్ని రోజలు పునీత్ రాజ్ కుమార్ నలుగురికి సహాయం చేస్తూనే బ్రతికాడు, ఆయన తాను చబునిపోయిన తర్వాత కూడా తన కళ్ళని దానం చేసి తనకి ఉన్న విశాల హృదయం ఎలాంటిదో చాటుకున్నాడు, తన సొంత డబ్బులతో 1800 మంది విద్యార్థులను చదివించాడు, ఇక 16 వృద్ధాశ్రమాలు, 26 అనాధాశ్రమాలు, 45 ఉచిత స్కూల్స్, మరియు 19 గోశాలలు నడుపుతూ ఎంతో మందికి జీవనాదారం అయ్యాడు, ఇక తననే నమ్ముకున్న వీళ్లందరి పరిస్థితి ఇప్పుడు ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు , దేవుడు ఎందుకు మంచి వాళ్ళకే ఇలాంటివి చేసున్తడా అంతు చిక్కని ప్రశ్న,ఈ ఏడాది అయాన్ హీరో గా నటించిన యువ రత్న అనే సినిమా విడుదల అయ్యి మంచి విజయం సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే , ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఆయన తన అభిమానులతో అప్పట్లో జరిపిన సంభాషణలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది,పునీత్ రాజ్ కుమార్ ఆకారిగా నటించిన సినిమా జేమ్స్, ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు అన్ని పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని జరుపుకుంటుంది ,ఈ సినిమానే పునీత్ రాజ్ కుమార్ గారి చివరి సినిమా, సంక్రాంతికి ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది.