
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఎలాంటి మాస్ క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, మెగాస్టార్ చిరంజేజేవి నట వారసుడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టినప్పటి మొదటి సినిమా నుండి డాన్స్ పరంగా కానీ యాక్టింగ్ పరంగా కానీ తండ్రికి తగ్గ తనయుడు శబాష్ అనిపించుకుంటూ ముందుకు పోతున్నాడు, ఇక బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ లో అయితే రామ్ చరణ్ కి ఉన్నటవంటి రికార్డులు టాలీవుడ్ లో మరో హీరో కి లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు, తోలి సినిమా చిరుత తోనే స్టార్ హీరో రేంజ్ వసూళ్లు రాబట్టి సత్తా చాటిన రామ్ చరణ్, ఇక రెండవ సినిమా మగధీర తో ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలు కొట్టి తాన్ సత్తా ఎలాంటిదో ఒక్క టాలీవుడ్ కి మాత్రమే కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తానికి తెలిసేలా చేసాడు, ఇక ఈ సినిమా తర్వాత వరుసగా యావరేజి సినిమాలతో కూడా రికార్డ్స్ పెట్టగలను అని నిరూపించాడు, ఇక రంగస్థలం సినిమా అయితే కేవలం బాక్స్ ఆఫీస్ పరంగా మాత్రమే కాదు, నటుడిగా కూడా జాతీయ స్థాయి గుర్తింపుని సంపాదించుకున్నాడు, ఇప్పుడు రాజా మౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చెయ్యబోతున్నాడు రామ్ చరణ్.
రామ్ చరణ్ తన అభిమానులను ప్రతి విషయం లో గర్వ పడేలా చేసాడు,కానీ అభిమానులందరూ ఎప్పటి నుండో రామ్ చరణ్ వారసుడి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు, ఆయనతో పాటుగా పెళ్లి చేసుకున్న అల్లు అర్జున్ మరియు జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు ఇద్దరు పిల్లలకి సంతానం ఇచ్చి ఎంతో సంతోషం గా తమ జీవితం ని గడుపుతున్నారు,కానీ రామ్ చరణ్ మాత్రం పెళ్లి అయ్యి ఇన్నేళ్లు అయినా పిల్లల్ని కనలేదు అని అభిమానులు కాస్త నిరాశ లో ఉన్నారు, ఇటీవల ఒక్క ప్రముఖ మీడియా ఛానల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూ లో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల పాల్గొంది, ఇందులో యాంకర్ ఉపాసన ని ‘ఇది వ్యక్తిగత విషయం అయినా అడగక తప్పట్లేదు, అభిమానులందరూ జూనియర్ రామ్ చరణ్ కోసం లేదా జూనియర్ ఉపాసన కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్లకి ఏమైనా శుభ వార్త చెప్పబోతున్నారా ‘ అని ఉపాసన ని అడిగిన ప్రశ్నకి ఆమె సమాధనం చెప్తూ ‘ అది పూర్తిగా నా వ్యక్తిగత విషయం, దానిని నేను చెప్పదల్చుకోలేదు, నేను ఒక్కటి చెప్తే మీరు దానికి వంద అర్థాలు తీసి సెన్సేషన్ చేస్తారు , అందుకే చెప్పదల్చుకోలేదు, అది పూర్తిగా నా వ్యక్తిగతం, ఏదైనా ఉంటె నేనే చెప్తాను’ అంటూ చెప్పుకొచ్చారు ఉపాసన.
ఇక రామ్ చరణ్ నటించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7 వ తేదీన విడుదల కాబోతుంది, ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సౌత్ ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ తో కలిసి ఒక్క సినిమా చేస్తున్నాడు, ఇప్పటికే ఈ సినిమాకే సంబంధించిన మొదటి షెడ్యూల్ ని పూణే లో పూర్తి చేసారు, ట్రైన్ లో వచ్చే ఒక్క భారీ యాక్షన్ సన్నివేశం ని శంకర్ తెరకెక్కించాడు, ఈ సన్నివేశం సినిమాకే హైలైట్ గా నిలవబోతుంది అట, ఇక ఈ సినిమాకి సంబంధించిన రెండవ షెడ్యూల్ కూడా ఇటీవలే ప్రారంభం అయ్యింది, ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ మరియు కైరా అద్వానీ మధ్య ఒక్క అద్భుతమైన పాటని తెరకెక్కించబోతున్నాడు, దాదాపు 300 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న సినిమా ని దిల్ రాజు గా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, ఆయనకీ ఇది నిర్మాతగా 50 వ సినిమా, అందుకే ఎక్కడ కూడా ఖర్చుకి వెనకాడకుండా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు, ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ గౌతమ్ తినూరి (జెర్సీ ఫేమ్ ) తో ఒక్క సినిమా మరియు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మరొక్క సినిమా చెయ్యబోతున్నాడు, ఇలా రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత కెరీర్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకి వెళ్తున్నాడు.