
కొంతమంది నటీనటులు మన మధ్య ఉన్నా లేకపోయినా వాళ్ళు చేసిన అద్భుతమైన పాత్రల ద్వారా ఇండస్ట్రీ లో ఎప్పటికి చిరంజీవులుగా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా గుర్తుండిపోతారు..ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ ఒక్క నటుడికి ప్రేక్షకుల్లో ఇలాంటి గౌరవమైన స్థానం దక్కదు..అలాంటి దిగ్గజ నటులలో ఒకరు రఘువరన్..ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై విలనిజం కి సరికొత్త నిర్వచనం తెలిపిన మహానటుడు ఆయన..తెలుగు, హిందీ, తమిళం మరియు మలయాళం బాషలలో ఎన్నో సినిమాల్లో నటించి విలన్ గా క్యారక్టర్ ఆర్టిస్టుగా ఉన్నత శిఖరాలను అధిరోహించాడు..కేవలం విలన్ గా మాత్రమే కాదు..క్యారక్టర్ ఆర్టిస్టుగా సెంటిమెంటల్ సన్నివేశాలలో రఘువరన్ ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించిన సినిమాలు చాలానే ఉన్నాయి..వాటిల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతం సినిమాని మనం అంత తేలికగా మరచిపోలేము..ఇందులో పవన్ కళ్యాణ్ తండ్రిగా రఘువరన్ కనబర్చిన నటన చూస్తే ఇలాంటి తండ్రి మనకి కూడా ఉంటె బాగుండును అని అనిపిస్తుంది..ఇలాంటి పాత్రలు ఆయన ఎన్నో చేసాడు..పలు సినిమాల్లో హీరోగా కూడా నటించాడు.
ఇది ఇలా ఉండగా రఘువరన్ తమిళ్ లో టాప్ హీరోయిన్ గా మరియు ఆర్టిస్టుగా కొనసాగుతున్న రోహిణి ని అప్పట్లో ప్రేమించి పెళ్లాడిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈమె ఇప్పటికి కూడా టాలీవుడ్ లో మంచి బిజీ ఆర్టిస్టుగా కొనసాగుతూనే ఉంది..అయితే ఈమె ద్వారా రఘువరన్ గురించి ఇటీవల బయటపడిన ఒక సంఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది..అదేమిటి అంటే రఘువరన్ ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అట..కెరీర్ ప్రారంభం లో ఆయన పలు సినిమాలకు సంగీతం కూడా అందించాడట..అయితే సంగీత దర్శకుడిగానే కొనసాగండి అని రోహిణి సలహాలు కూడా ఇచ్చేదట..కానీ రాధివారం గారు ‘నటుడిగా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాను..ఇలాంటి సమయం లో మ్యూజిక్ కి న్యాయం చెయ్యలేను’ అంటూ మ్యూజిక్ ఫీల్డ్ ని పక్కన పెట్టేసాడట..అయితే ఇండస్ట్రీ లోకి కొత్తవాళ్లు అడుగుపెడుతున్న సమయం లో రాధివారం కి క్యారక్టర్ ఆర్టిస్టుగా డిమాండ్ తగ్గిపోతూ వచ్చింది..అలా మెల్లగా ఫేడ్ అవుట్ అవుతున్న సమయం లో సినిమా అవకాశాలు రావడం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత ఆయన చివరి రోజుల్లో కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ ని కంపోజ్ చేసాడట.
ఈ మ్యూజిక్ వీడియోస్ ఆల్బమ్స్ అన్నిటిని కలెక్ట్ చేసి అతని భార్య రోహిణి ఒక్క DVD రూపం లో తయారు చేయించి సూపర్ స్టార్ రజిని కాంత్ చేత విడుదల చేయించింది..ఆ ఫోటో ని మీరు క్రింద చూడవచ్చు..ఈ ఆల్బం వింటే రఘువరన్ ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అనేది ప్రపంచానికి అర్థం అవుతుందట..ఇది ఇలా ఉండగా రఘువరన్ మరియు రోహిణి దంపతులకు సాయి రిషివారెన్ అనే కొడుకు ఉన్నాడు..ఇతని లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది..చూడడానికి అచ్చం సూపర్ స్టార్ మహేష్ బాబు లాగ కనిపిస్తున్న ఈ పాతికేళ్ల కుర్రాడు..అతి త్వరలోనే ఇండస్ట్రీ లో హీరోగా అడుగుపెట్టబోతున్నాడట..అతని ఫోటోలు మీరు క్రింద చూడవచ్చు..విలన్ గా తన తండ్రి సౌత్ ఇండియా ఎంత పెద్ద మహానటుడిగా ఎదిగాడో..హీరో గా అంతతి మహానటుడిగా పేరు తెచ్చుకోవడమే నా జీవిత లక్ష్యం అని సాయి రిషి వారెన్ పలు ఇంటర్వూస్ లో తెలిపాడు..మరి తన తండ్రిలాగా రిషి కూడా ఎదుగుతాడో లేదో చూడాలి.
1
2
3
4
5
6