
మెగా సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ డిఫరెంట్ కథ తో వస్తున్న మూవీ ‘విరూపాక్ష’..కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తుండగా.. తాజాగా ఈ సినిమా కి సంబందించి న ఒక న్యూస్ బయట కి వచ్చింది..గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయిధరమ్ తేజ్ ,కోలుకున్న తర్వాత చేసిన సినిమా ‘విరూపాక్ష’ , అత్తరెంటికి దారేది నిర్మాత బీవీఎస్ఎస్ ప్రసాద్ నిర్మి్ంచిన ఈ చిత్రం ద్వారా కార్తీక్ వర్మ దండు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయి లో పేరు తెచ్చుకున్న క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్టోరీ, స్క్రీన్ప్లే అందించిన మూవీలో సంయుక్త మీనన్ కథానాయికగా నటించింది. ఇక విరూపాక్షకు ‘కాంతార’ మూవీకి పనిచేసిన అజినీష్ లోక్నాథ్ మ్యూజిక్ అందించడం విశేషం. మిస్టీరియస్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉండగా.. ఇటీవలే షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఇక ఏప్రిల్ 21న మూవీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు..ఈ సినిమా మేకర్స్ తాజాగా థియేట్రికల్ బిజినెస్ డీల్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది.
‘విరూపాక్ష’ మూవీ థియేట్రికల్ రైట్స్ ఆంధ్ర ,తెలంగాణ కలిపి రికార్డు ధరకు అమ్ముడయ్యాయి. వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ ప్రవీణ్ రూ.22 కోట్ల భారీ మొత్తానికి రైట్స్ దక్కించుకున్నాడు. కాగా.. సాయిధరమ్ తేజ్ చివరి చిత్రం దేవాకట్టా దర్శకత్వం లో వచ్చిన ‘రిపబ్లిక్’ కమర్షియల్గా పెద్దగా సక్సెస్ కానప్పటికీ, ఫిల్మ్ క్రిటిక్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. కమర్షియల్ గా సక్సెస్ లేనప్పటికీ ‘విరూపాక్ష’ సినిమా రైట్స్కు భారీ ధర పలకడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే సుకుమార్ లాంటి అగ్ర దర్శకుడు స్టోరీ, స్క్రీన్ప్లే అందించినందున ఈ సినిమాపై మార్కెట్లో మంచి బజ్ ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. మొత్తానికి సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలగా ఉన్నాడు. కాగా విరూపాక్ష టీజర్ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే.